AP TET : ఒకే రోజు రెండు పరీక్షలా? ఐతే ఇలా చేయండి .
AP TET 2024 ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్నాయా? ఇలా చేయడం ద్వారా పరీక్ష తేదీ మార్చుకునే అవకాశం ఉంది.
AP TET 2024 : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అక్టోబర్ 03వ తేదీ నుండి ప్రారంభం కానున్నది. ఈ పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థుల కోసం హాల్ టికెట్లు సెప్టెంబర్ 23వ తేదీన విడుదల చేయబడ్డాయి. అయితే AP TET 2024 పరీక్షకు ఎక్కువ మంది అభ్యర్థులు రెండు పేపర్లు ( ఉదా: పేపర్ 1ఏ , పేపర్ 1బి) అప్లై చేసుకున్నారు. ఇలా రెండు పేపర్లకు అప్లై చేసుకున్న అభ్యర్థులలో కొంతమందికి రెండు పరీక్షలకు ఒకే రోజు , ఒకే సమయంలో వేర్వేరు పరీక్ష కేంద్రాలలో పరీక్ష కేటాయించబడింది. మరికొందరికి ఒకేరోజు ఉదయం, మధ్యాహ్నం సమయాలలో రెండు పరీక్షలు కేటాయించబడినా ఆ రెండు పరీక్ష కేంద్రాలు వేరువేరు నగరాలలో ఉండడం వలన ఆ అభ్యర్థులు రెండు పరీక్షలకు హాజరు అవ్వడం అసాధ్యం అవుతుంది.
AP TET 2024 ఒకే రోజు రెండు పరీక్షలు కేటాయిస్తే ఏం చేయాలి? (What to Do if Two AP TET 2024 Exams are Conducting on Same Day?)
సాధారణంగా రెండు పేపర్ల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఒకే రోజు రెండు పరీక్షలు కేటాయించబడవు, ఏదైనా టెక్నీకల్ సమస్యల వలన ఇలా జరిగి ఉండవచ్చు. ఒకవేళ AP TET 2024 పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఒకే రోజు రెండు పరీక్షలు కేటాయించబడితే వారు రెండు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా జిల్లాల డిస్ట్రిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) దగ్గరకు తీసుకుని వెళ్తే వారి పరీక్ష తేదీలను మారుస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. AP TET 2024 పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభం కానుండడంతో అభ్యర్థులు వీలైనంత త్వరగా ఈ సమస్యను సంబంధిత DEO దృష్టికి తీసుకుని వెళ్లడం అవసరం. నిర్దిష్ట సమయంలో అభ్యర్థులు ఈ విషయాన్నీ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లకపోతే వారు ఒక పరీక్ష వ్రాసే అవకాశం కోల్పోతారు .Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.