AP EAMCET 2023 Counseling Dates: AP EAMCET కౌన్సెలింగ్ 2023 ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?
2023లో AP EAMCET కౌన్సెలింగ్ తేదీలు (AP EAMCET 2023 Counseling Dates) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజు, రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ తేదీలని తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చూడండి.
ఏపీ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ డేట్స్ (AP EAMCET 2023 Counseling Dates): APSCHE ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం కౌన్సెలింగ్ తేదీలను విడుదల చేసింది. అధికారులు AP EAMCET కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించింది. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ జూలై 24 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ఇప్పటికే AP EAMCET అగ్రికల్చర్ కౌన్సెలింగ్ 2023కి సంబంధించిన అధికారిక తేదీలను విడుదల చేసింది. దాని కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. AP EAMCET కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫీజు చెల్లించి, గడువు కంటే ముందే దరఖాస్తు ఫార్మ్‌ను ఆన్‌లైన్‌లో పూరించాలి.
కౌన్సెలింగ్ ప్రక్రియకు అలాట్‌మెంట్ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఆహ్వానించబడతారు. AP EAMCET రిజిస్ట్రేషన్ ఫీజు 2023 జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1200, SC/ST కేటగిరీ అభ్యర్థులకు రూ.600గా అంచనా వేయబడింది. అధికారులు AP EAMCET కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన తర్వాత అర్హత, దరఖాస్తు ప్రక్రియ, సీట్ల కేటాయింపు తేదీ, మరిన్నింటికి సంబంధించిన వివరాలను విడుదల చేయడం జరుగుతుంది.
AP EAMCET కౌన్సెలింగ్ అంచనా తేదీలు 2023 (AP EAMCET Counseling Estimated Dates 2023)
ఈ దిగువ అభ్యర్థి ఇంజనీరింగ్ కోసం AP EAMCET కౌన్సెలింగ్ తేదీ 2023 కోసం ఆశించిన తేదీని చెక్ చేయవచ్చు.
ఈవెంట్స్ | అంచనా తేదీలు |
AP EAMCET కౌన్సెలింగ్ 2023 తేదీ ప్రకటన | జూలై 18, 2023కు ముందు |
AP EAMCET కౌన్సెలింగ్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం | జూలై 24, 2023 |
AP EAMCET కౌన్సెలింగ్ 2023 నమోదు ప్రక్రియ (AP EAMCET Counseling 2023 Registration Process)
ఈ దిగువన AP EAMCET కౌన్సెలింగ్ 2023 నమోదు ప్రక్రియను అందజేయడం జరిగింది. అభ్యర్థులు గమనించవచ్చు.
- AP EAMCET రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2203లో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించడం, అప్లికేషన్ ఫార్మ్ పూరించడం ఉంటాయి.
- ఫీజు చెల్లించేటప్పుడు అభ్యర్థికి బహుళ చెల్లింపు ఆప్షన్లను యాక్సెస్ ఉంటుంది
- రిజిస్ట్రేషన్ ధ్రువీకరించబడిన తర్వాత అభ్యర్థి అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి యాక్సెస్ పొందుతారు
- అప్లికేషన్ ఫార్మ్ అభ్యర్థులు పూరించే ముందు తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్ మార్కులు కార్డ్, కేటగిరీ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, సంతకం స్కాన్ చేసిన కాపీ, ఫోటోగ్రాఫ్, మరిన్ని నిర్దిష్ట డాక్యుమెంట్‌లను తప్పనిసరిగా ఉంచుకోవాలి.
- తదుపరి అభ్యర్థి మార్కులు కార్డ్ ఆధారంగా డీటెయిల్స్ నింపి, ఫార్మ్‌ను విజయవంతంగా సబ్మిట్ చేయవచ్చు.
- చివరగా అభ్యర్థి భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.