పదో తరగతి తర్వాత ఆంధ్రప్రదేశ్ SSC విద్యార్థులకు మంచి కెరీర్ ఆప్షన్ (Career options for Andhra Pradesh SSC students after 10th):
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి క్లాసులు విజయవంతంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్లో పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి తర్వాత ఏం చేయాలి? ఏం కోర్సుల్లో జాయిన్ అవ్వాలనే? సందేహాలు విద్యార్థుల్లో ఉంటాయి. భవిష్యత్తులో ఏ కోర్సు తీసుకోవాలనే దానిపై పదో తరగతిలోని సబ్జెక్టులపై మరింత దృష్టి సారించవచ్చు. పైగా మంచి కెరీర్‌వైపు అడుగులు వేయడానికి ఇదే కీలకమైన స్టెప్. అందుకే పదో తరగతి తర్వాత కెరీర్ ఆప్షన్ల (Career options for Andhra Pradesh SSC students after 10th) గురించి ఈ ఆర్టికల్లో వివరంగా అందజేశాం. విద్యార్థుల సందేహాల తీర్చే విధంగా అన్ని రకాల కోర్సులు గురించి ఇక్కడ వివరించడం జరిగింది.
విద్యార్థులు తమ ఆసక్తి, అర్హతలను బట్టి వివిధ కోర్సులను ఎంచుకోవచ్చు. ఆ సంబంధిత కోర్సులో మంచి మార్కులతో పాస్ అవ్వడం వల్ల మంచి భవిష్యత్తు వారి సొంతం అవుతుంది. పదో తరగతి తర్వాత చేసేందుకు చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ విద్యార్థి ఆసక్తిని బట్టి తమకు నచ్చిన కోర్సును ఎంచుకోవాలి. అప్పుడే సంబంధిత రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. అది ఏ కోర్స్ అయినా సరే దానికి తగ్గట్టుగా తమను తాము మలుచుకోవడం, చదవడం, ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి సంపాదన కూడా సొంతం చేసుకోవచ్చు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల కూడా మారుతుండాలి. ముఖ్యంగా ఫలాన కోర్సు చేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనను వదిలేయాలి. ఎంత కష్టమైన రంగమైనా సరే ఇష్టంతో ముందుకు అడుగు వేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు దక్కుతాయి. అందుకే ఏ కోర్సు చేయడానికైనా ముందుగా విద్యార్థి ఇష్టం, ఆసక్తి ముఖ్యం. తర్వాత ఆ రంగంలో ఉన్న లోటుపాట్ల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. దానికనుగుణంగా మంచి ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలి. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉండే కోర్సుల వివరాలను ఈ ఆర్టికల్లో అందజేశాం.
పదో తరగతి తర్వాత విద్యార్థుల మంచి ఆప్షన్ పాలిటెక్నిక్. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్) అనేది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొందగల కెరీర్ ఆప్షన్‌లో ఒకటి. పాలిటెక్నిక్‌లో విద్యార్థులు వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఆ బ్రాంచ్‌ల గురించి ఈ దిగువున చూడొచ్చు.
- మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
- డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.
- సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
- మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
అర్హత (ELIGIBILITY)
- అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతిలో 50 శాతం మార్కులతో పాసై ఉండాలి
- అతను/ఆమె సాంకేతిక విద్యా శాఖ నిర్వహించే పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
పరీక్ష విధానం (Scheme of Examination)
పరీక్ష 120 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ప్రశ్న పత్రంలో మొత్తం 120 బిట్‌లు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. వెయిటేజీ ఈ కింది విధంగా ఉంది;
- మ్యాథ్స్ - 60 మార్కులు
- ఫిజిక్స్ - 30 మార్కులు
- కెమిస్ట్రీ -30 మార్కులు .
ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply)
సాంకేతిక విద్యా విభాగం సాధారణంగా ఏప్రిల్ నెలలో పాలిసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు www.polycetap.nic.in ని చూడొచ్చు.
విజయవాడలో, ఆ చుట్టుపక్కల పాలిటెక్నిక్ కాలేజీలు (Polytechnic Colleges in and around Vijayawada)
- Sana Polytechnic College
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
- Diviseema Polytechnic College
ITI - ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI - Industrial Training Institute)
SSC తర్వాత ITI కూడా విద్యార్థులకు కెరీర్ ఎంపికలలో ఒకటి. మొత్తం 45 శాతం మార్కులతో SSC పాసైన విద్యార్థి ITIకి దరఖాస్తు చేసుకోవచ్చు. ITIలో విద్యార్థులు ఆపరేటర్ లేదా క్రాఫ్ట్‌మ్యాన్ ఉద్యోగాలు చేయడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు. ITIలో చేరిన విద్యార్థులు ట్రేడ్‌లో ప్రాథమిక స్కిల్‌ను పెంపొందించే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కోర్సు వ్యవధి, ఎంచుకున్న ఎంచుకునే శాఖను బట్టి ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఐటీఐలో కోరుకున్న శిక్షణ తీసుకున్న తర్వాత విద్యార్థులు NCVT (ఒకేషనల్ శిక్షణ కోసం నేషనల్ కౌన్సిల్) నిర్వహించే AITT (ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్)లో హాజరు కావడానికి అర్హులవుతారు. AITT ఉత్తీర్ణత సాధించిన తర్వాత NCVT ద్వారా వాణిజ్యానికి సంబంధించి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC)ని అందజేస్తారు. ITI కోర్సు పాసైన తర్వాత విద్యార్థులు ఫ్యాక్టరీలో ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. నేషనల్ అప్‌ప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ పొందడానికి NCVT నిర్వహించే పరీక్షకు మళ్లీ హాజరై పాసై అవ్వాలి.
విజయవాడ ఆ చుట్టుపక్కల ITI (ITI in and around Vijayawada)
ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (Industrial training in Institute) రమేష్ ఆస్పత్రికి సమీపంలో ఉంది, ఎదురుగా Andhra Loyola Institute of Engineering and Technology.
ఏపీఆర్‌జేసీ (APRJC)
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో +2లో (ఇంటర్మీడియట్) ఉచిత విద్యను పొందేందుకు ఆసక్తి ఉన్న SSC విద్యార్థుల కోసం APREI సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ APRJC పరీక్షను నిర్వహిస్తుంది. ఎంట్రన్స్ పరీక్షలో విద్యార్థి సాధించిన మార్కులు ఆధారంగా విద్యార్థి ఎంపిక ఉంటుంది. కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు. ఎంపికైన అభ్యర్థి APRJC అందించే వివిధ కోర్సుల్లో ఏదైనా కోర్సుని ఎంచుకోవచ్చు. ఆ కోర్సులకు సంబంధించిన వివరాలు ఈ దిగువన అందించడం జరిగింది.
- MPC - మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
- Bi.Pc - బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
- MEC- మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్
- CEC - సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్
- HEC - చరిత్ర, ఆర్థిక శాస్త్రం, కామర్స్
పరీక్ష విధానం (Scheme of Examination)
ఆంధ్రప్రదేశ్‌లోని 50 కేంద్రాలలో APREI ద్వారా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ దిగువున తెలియజేసిన అంశాల్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
- సాధారణ ఇంగ్లీష్ - 50 మార్కులు
- ఫిజిక్స్ - 50 మార్కులు
- మ్యాథ్స్ - 50 మార్కులు .
- ఒక అభ్యర్థి Bi.Pcని ఎంచుకుంటే ఆ విద్యార్థి 50 మార్కులు కోసం మ్యాథ్స్‌కు బదులుగా బయోలజీ రాయాలి.
- ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.
విజయవాడ ఆ చుట్టుపక్కల APRJC (APRJC in and around Vijayawada)
ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నాగార్జున సాగర్, గుంటూరు జిల్లాలో ఉంది. .
APRJC కాకుండా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ చదువుకోవచ్చు. విజయవాడలో ఇంటర్‌లో జాయిన్ అయ్యేందుకు ఉన్న ప్రముఖ ప్రైవేట్ కళాశాలలు.
- ఆంధ్రా లయోలా కాలేజ్
- మారిస్ స్టెల్లా కళాశాల
- శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల
- PB సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్
- నలంద కళాశాల
- శ్రీ చైతన్య జూనియర్ కళాశాల
- నారాయణ జూనియర్ కళాశాల.
పదో తరగతి తర్వాత విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో మంచి గ్రూపుల్లో చేరి మంచి మంచి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ఇంటర్‌లో విద్యార్థులు ఎంచుకునే గ్రూపును బట్టి వారికి ఆయా రంగాల్లో అవకాశాలు దక్కుతాయి. ఇంటర్మీడియట్‌లో ఉండే కోర్సుల వివరాలను ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
హెచ్ఈసీ (HEC): పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చేయాలనుకునే అభ్యర్థులకు మంచి కోర్సులు ఉన్నాయి. చరిత్ర, ఎకనామిక్స్, సివిక్స్ వంటి సబ్జెక్టులపై ఆసక్తి ఉన్న ఉన్నవారు HEC గ్రూపును తీసుకోవచ్చు. HEC కోర్సులో సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే పరిణామాలను గురించి తెలియజేస్తారు. ఈ గ్రూప్‌లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఉన్నత విద్యాపరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు చదువుకోవచ్చు. డిగ్రీతో పాటు జాబ్ ఓరియెంటెడ్ డిప్లోమా కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.
ఎంపీసీ (MPC): ఇంజనీరింగ్‌లో రాణించాలనుకునే అభ్యర్థులకు ఎంపీసీ మంచి ఛాయిస్. ఈ గ్రూపులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ)లను అభ్యసించవచ్చు. మ్యాథ్స్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏ మాత్రం ఆలోచించకుండా ఈ గ్రూపులో జాయిన్ అవ్వొచ్చు. ఈ కోర్సులో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఐఐటీ, నీట్, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు పొందవచ్చు. ఒక వేళ ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేకపోతే ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగు పెట్టి తర్వాత ఎమ్మెస్సీ పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను చదవొచ్చు.
సీఈసీ, ఎంఈసీ (CEC, MEC): వ్యాపారం, వాణిజ్యం, గణాంకాల విశ్లేషణపై అవగాహన ఉన్న వారు సీఈసీ, ఎంఈసీ కోర్సులో జాయిన్ అవ్వొచ్చు. వ్యాపార, పారిశ్రామిక రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. ఈ కోర్సులను ఎంచుకునే అభ్యర్థులకు కార్పొరేట్ కంపెనీల్లో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చార్టర్డ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించవచ్చు.
బైపీసీ (Bipc): సైన్స్‌పై ఏ మాత్రం ఆసక్తి ఉన్నా ఇంటర్మీడియట్‌లో Bipc కోర్సు తీసుకోవడం చాలా మంచిది. ఈ గ్రూప్‌లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులను బోధిస్తారు. వైద్య వృత్తిని చేపట్టాలనుకునే విద్యార్థులు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. బైపీసీ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఈ గ్రూప్‌లో థియరీతో పాటు ప్రాక్టీకల్స్ కూడా ఉంటాయి. అందువల్ల తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను, ప్రయోగశాలలో పరిశీలించే విధంగా విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలి. రెండేళ్ల పాటు బైపీసీ చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ కోర్సు చేయాలి.
Source: Sakunth Kumar, City Journalist - Vijaywada, CollegeDekho
విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత విభిన్నమైన కెరీర్ ఆప్షన్ ఎంచుకోవాలి అనుకుంటే ఎలాంటి రంగాలలో ఏ కోర్సులలో అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడానికి CollegeDekho నిపుణులను సంప్రదించడానికి మా టోల్ ఫ్రీ నెంబర్ 18005729877 కు కాల్ చేయండి.
సిమిలర్ ఆర్టికల్స్
క్రిస్మస్ వ్యాసం తెలుగులో (Christmas Essay in Telugu)
TS TET మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి (TS TET Previous Year Question Papers)
ఉగాది పండుగ విశిష్టత.. పచ్చడిలో ఉన్న ప్రత్యేకతలు (Ugadi Festival in Telugu)
నవంబర్ 14 బాలల దినోత్సవం స్పీచ్ తెలుగులో (Children's Day Speech in Telugu)
సంక్రాంతి పండుగ విశేషాలు (Sankranti Festival Essay in Telugu)
ఏపీ 10వ తరగతి రీవాల్యుయేషన్ 2025కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (AP SSC Revaluation 2025)