AEEE 2024 ఫేజ్ 1 అడ్మిట్ కార్డ్ (AEEE 2024 Phase 1 Admit Card) : అమృత విశ్వ విద్యాపీఠం AEEE 2024 ఫేజ్ 1 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ను (AEEE 2024 Phase 1 Admit Card) జనవరి 12, 2024న విడుదల చేస్తుంది. స్లాట్ బుకింగ్ ప్రక్రియ జనవరి 10, 2024న ముగిసిన తర్వాత అడ్మిట్ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయి. కార్డులు విడైదలన తర్వాత amrita.edu వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.అభ్యర్థులు ఈ మెయిల్ ID, అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వారి లాగిన్ వివరాలను ఉపయోగించి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. AEEE 2024 ఫేజ్ 1 పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపును తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారులు తప్పనిసరిగా హాల్ టిక్కెట్లను పోస్ట్ లేదా మెయిల్ ద్వారా పంపరని గమనించాలి. కాబట్టి, AEEE 2024 ఫేజ్ 1 అడ్మిట్ కార్డ్‌ని ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AEEE 2024 ఫేజ్ 1 అడ్మిట్ కార్డ్ తేదీ (AEEE 2024 Phase 1 Admit Card Date)
ఫేజ్ 1 కోసం AEEE 2024 అడ్మిట్ కార్డ్‌కి సంబంధించిన తేదీని దిగువున టేబుల్లో పరీక్ష తేదీతో పాటు కనుగొనండి.
ఈవెంట్ | తేదీలు |
---|---|
AEEE 2024 ఫేజ్ 1 అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ | జనవరి 12, 2024 |
AEEE 2024 ఫేజ్ 1 పరీక్ష తేదీ | జనవరి 19 నుండి జనవరి 22, 2024 వరకు |
AEEE 2024 ఫేజ్ 1 అడ్మిట్ కార్డ్‌లో ముద్రించే వివరాలు (Details Printed on AEEE 2024 Phase 1 Admit Card)
పరీక్షకు హాజరయ్యే పరీక్షా కేంద్రాలలో అభ్యర్థి గుర్తింపు కోసం అడ్మిట్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం. AEEE 2024 ఫేజ్ 1 అడ్మిట్ కార్డ్ పరీక్ష సమయంలో అభ్యర్థులు 'పరీక్షకు హాజరు కావడానికి' అర్హతను ధ్రువీకరిస్తుంది. పరీక్షా ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో సహాయపడుతుంది. వారి అడ్మిట్ కార్డ్‌లు లేని వారు పరీక్షకు ప్రయత్నించడానికి అనుమతించబడరు.
- అభ్యర్థి పేరు
- AEEE 2024 రిజిస్ట్రేషన్ నెంబర్
- పరీక్ష తేదీ
- కేటాయించబడిన పరీక్షా కేంద్రం చిరునామా
- రిపోర్టింగ్ సమయం
- పరీక్ష సమయం
- పరీక్ష కోసం ముఖ్యమైన సూచనలు
- జెండర్
- పుట్టిన తేది
- రాష్ట్రం
- నగరం
- మొబైల్ నెంబర్
- ఫోటోగ్రాఫ్
- సంతకం
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి.