ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 (AP DSC Notification 2024) :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మానవ వనరుల శాఖ AP DSC 2024 కింద రాష్ట్ర విద్యా శాఖకు త్వరలో భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకటించబోతోంది. నివేదికల ప్రకారం ఏపీ ప్రభుత్వం అన్ని ఖాళీలను క్లియర్ చేయడానికి ఈనెలలోనే టీచర్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించబోతుంది. ఈ సంవత్సరం కూడా అన్ని జిల్లాల్లోని రాష్ట్ర ప్రభుత్వ MPP, ZPP, MPL, MPL కార్పొరేషన్ / ట్రైబల్, APMS, APREIS, BC సంక్షేమ పాఠశాలల్లో వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి AP DSC 2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (AP DSC Notification 2024) విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ నెల ఖాళీల ఆధారంగా సంవత్సరంలోని అన్ని ఖాళీలను క్లియర్ చేయాలనే నిర్ణయం, ఖాళీలను భర్తీ చేయడానికి జనవరిలో DSC నోటిఫికేషన్‌ను ప్రకటించనుంది.
ఇప్పటికే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక స్పష్టత ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC Notification 2024)పై ఒక స్పష్టమైన నిర్ణయం వస్తోందని వెల్లడించారు. ఏపీ డీఎస్సీ (AP DSC 2024) పై చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలియజేశారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని, ఆయన ఆదేశాల మేరకు టీచర్ పోస్టులపై నివేదిక కూడా సిద్ధం చేశామని కూడా చెప్పారు.
అదే విధంగా త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ (AP DSC Notification 2024) విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో జనవరి నెలాఖరులోపు ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏపీ డీఎస్సీ అర్హత ప్రమాణాలు 2024 (AP DSC Eligibility 2024)
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం AP DSC 2023 నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీఈటీ, క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులకు ఖాళీలు ఉంటాయి. AP DSC 2023 నోటిఫికేషన్ కోసం అర్హత ప్రమాణాలు దిగువున అందజేశాం.
- దరఖాస్తు ముగింపు తేదీ నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు ఉండాలి.
- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి.
- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.