ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 తేదీ (AP Inter Results 2024 Date) :
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (APBIE) ఏపీ ఇంటర్ ఫలితాలు 2024ని (AP Inter Results 2024 Date) రేపు అంటే ఏప్రిల్ 12, 2024న విడుదల చేస్తుంది. ఏపీ ఇంటర్ ఫలితాలను అధికారిక తేదీని బోర్డు ప్రకటించింది. ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. దీనికోసం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ ఇంటర్ 2024 ఫలితాలు అధికారిక వెబ్‌సైట్
bieap.apcfss.in
లో విడుదల చేయబడతాయి. ఏపీ ఇంటర్ 2024 పరీక్షలకు సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీ ఇంటర్ 2024 ఫలితాల ప్రకటనతో పాటు, టాపర్స్ జాబితా, మొత్తం ఉత్తీర్ణత శాతం వంటి ఇతర వివరాలను బోర్డు విడుదల చేస్తుంది.
ఇది కూడా చదవండి:
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల లైవ్ అప్‌డేట్స్, డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి
ఏపీ ఇంటర్ ఫలితాలు 2024: చెక్ చేయాల్సిన వెబ్‌సైట్‌ల జాబితా (AP Inter Results 2024: List of Websites to Check)
ఏపీ ఇంటర్ ఫలితాలు 2024ని ఇక్కడ చెక్ చేయడానికి అభ్యర్థులు కింది వెబ్‌సైట్‌లలో దేనినైనా క్లిక్ చేయవచ్చు.
- examresults.ap.nic.in
- bieap.apcfss.in
- results.bie.ap.gov.in
- results.apcfss.in
- bie.ap.gov.in
పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లు కాకుండా అభ్యర్థులు SMS ద్వారా ఫలితాలను పొందవచ్చు.దీని కోసం విద్యార్థులు APGEN2 (స్పేస్) రోల్ నెంబర్‌ను టైప్ చేసి, ఆపై దానిని 5626కు పంపించాలి. అలాగే అభ్యర్థులు డిజిలాకెట్ ద్వారా ఏపీ ఇంటర్ 2024 ఫలితాన్ని చెెక్ చేయవచ్చు.
ఏపీ ఇంటర్ ఫలితాలు 2024: చెక్ చేసుకునే విధానం (AP Inter Results 2024: Steps to Check)
ఏపీ ఇంటర్ 2024 ఫలితాలను విడుదల చేసే విధానం ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంది. అభ్యర్థులు ఏపీ ఇంటర్ 2024 ఫలితాలను ఇక్కడ చెక్ చేయడానికి దిగువున తె లిపిన దశలను కనుగొనవచ్చు.
- ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా పైన హైలైట్ చేసిన ఏదైనా వెబ్‌సైట్‌ని సందర్శించండి
- అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే AP ఇంటర్ మొదటి సంవత్సరం/రెండో సంవత్సరం ఫలితాల లింక్ 2024పై క్లిక్ చేయండి
- అభ్యర్థుల రోల్ నెంబర్ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
- ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి
- AP ఇంటర్ 2024 ఫలితాలను చెక్ చేయండి.
ఆ తర్వాత, అభ్యర్థులు ఏపీ ఇంటర్ 2024 పరీక్షా మార్కు షీట్‌లను సేకరించడానికి సంబంధిత పాఠశాలలను సందర్శించాలి మరియు భవిష్యత్తు సూచన కోసం వాటిని సేవ్ చేయాలి.