AP Inter Results 2025 లైవ్ అప్‌డేట్లు, కొన్ని గంటల్లో ఇంటర్ ఫలితాలు విడుదల

Rudra Veni

Updated On: April 12, 2025 06:58 AM

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు విడుదలకానున్నాయి. ఇంటర్ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్లు ఇక్కడ అందిస్తాం. 
logo
AP Inter Results 2025 లైవ్ అప్‌డేట్లు, కొన్ని గంటల్లో ఇంటర్ ఫలితాలు విడుదలAP Inter Results 2025 లైవ్ అప్‌డేట్లు, కొన్ని గంటల్లో ఇంటర్ ఫలితాలు విడుదల

AP ఇంటర్ ఫలితాలు 2025 లైవ్ అప్‌డేట్స్, విడుదల తేదీ సమయం (AP Inter Results 2025 LIVE Updates: Date and Time Soon, Grading System) : ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు అంటే ఏప్రిల్ 12వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇంటర్ ఫలితాల విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ అందిస్తాం. ముఖ్యంగా విడుదల తేదీ, సమయానికి సంబంధించిన సమాచారం ఇక్కడ పొందవచ్చు. AP ఇంటర్ 2025  ఫలితాలు మనబడి, సాక్షి విద్య, ఈనాడు ప్రతిభ, మరెన్నో వెబ్‌సైట్‌లలో యాక్టివేట్ చేయబడతాయి. ఈ పేజీలో కూడా ఇంటర్ ఫలితాల డౌన్‌లోడ్ లింక్‌లను అందిస్తాం.  ఫలితాలను పొందడానికి విద్యార్థులు తమ AP ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ 2025ని కలిగి ఉండాలి. AP ఇంటర్ ఫలితాలు 2025 మార్కులు, గ్రేడ్‌ల రూపంలో ప్రకటించబడతాయి. ఇప్పటికే విద్యార్థుల్లో ఏపీ ఇంటర్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 డిజి లాకర్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కేవలం ఇంటర్ ఫలితాలను మాత్రమే ప్రకటిస్తుంది. టాపర్ల లిస్ట్‌ను ప్రకటించదు. కానీ ఫలితాల్లో ఏ జిల్లాలు టాప్‌లో నిలిచాయో, ఎంత మంది పాస్ అయ్యారో అనే విషయాలను వెల్లడిస్తుంది. ప్రతి ఏడాది పాస్ పర్సంటేజ్‌లో ఏ జిల్లా ముందుందో, బాలురు, బాలికల్లో ఎవరి ఉత్తీర్ణత శాతం ఎక్కువుందో ప్రకటించడం జరుగుతుంది.

లేటెస్ట్: ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఎన్ని గంటలకు విడులవుతాయి?

ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 విడుదల తేదీ, సమయం (AP Inter Result 2025 Release Date and Time)

ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 విడుదల తేదీ, సమయానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ అందించాం. ఎప్పటికప్పుడు అప్‌డేట్  చేస్తూ కచ్చితంగా సమాచారాన్ని అందిస్తాం.

ఏపీ ఇంటర్ 2025 ఫలితాల తేదీ ఏప్రిల్ 12,2025
AP Inter Results 2025 ప్రకటన సమయం ఉదయం 11 గంటలకు
AP Inter Results 2025 ఫలితాల లింక్ యాక్టివేషన్ సమయం ఉదయం 11 గంటలకు

AP ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ 2025 (AP Intermediate Grading System 2025)

బోర్డు పరీక్షలలో విద్యార్థులు సాధించిన మార్కుల సంఖ్య ఆధారంగా వారికి గ్రేడ్‌లు ప్రదానం చేస్తారు. AP ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్‌లో A1 నుండి F వరకు గ్రేడ్‌లు ఉంటాయి. ఈ దిగువున ఇవ్వబడిన పట్టిక నుంచి మార్కుల పరిధి, గ్రేడ్ పాయింట్లకు సంబంధించిన వివరాలను చెక్ చేయడి.

తరగతులు

మార్కుల పరిధి

గ్రేడ్ పాయింట్లు

A1

91 నుంచి 100 మార్కులు

10

A2

81 నుంచి 90 మార్కులు

9

B1

71 నుంచి 80 మార్కులు

8

B2

61 నుంచి 70 మార్కులు

7

C1

51 నుంచి 60 మార్కులు

6

C2

41 నుంచి 50 మార్కులు

5

D1

35 నుంచి 40 మార్కులు

4

F

00 నుంచి 34 మార్కులు

ఫెయిల్

AP ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ 2025: డివిజన్ వారీగా (AP Intermediate Grading System 2025: Divisionనుంచిwise)

Add CollegeDekho as a Trusted Source

google

BIEAPలో విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఆంధ్రప్రదేశ్ బోర్డు డివిజన్‌లను స్వీకరిస్తుంది. 2025 AP ఇంటర్ ఫలితాల్లో డిస్టింక్షన్, ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ మరియు థర్డ్ డివిజన్‌లలో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని బోర్డు పంచుకుంటుంది.

విభజన

మార్కుల పరిధి

డిష్టిక్షన్

400, అంతకంటే ఎక్కువ

ఫస్ట్ క్లాస్

300 నుండి 399 వరకు

సెకండ్ క్లాస్

225 నుండి 299 మార్కులు

థర్డ్ క్లాస్

150 నుండి 224 మార్కులు

ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 లైవ్ అప్‌డేట్స్

  • 06 58 AM IST - 12 Apr'25

    కొన్ని గంటల్లో ఇంటర్ ఫలితాలు 2025

    ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయి.

  • 11 49 AM IST - 11 Apr'25

    రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల 2025

    ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు అంటే ఏప్రిల్ 12వ తేదీన విడులవుతాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్టు ఒక ట్వీట్ చేశారు. 

  • 12 33 PM IST - 10 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఎన్ని గంటలకు రిలీజ్ అవుతాయి?

    సాధారణంగా ఏపీ ఇంటర్ ఫలితాలను ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో ఉదయం 11 గంటల సమయంలో విడుదల చేయడ జరుగుతుంది. 

  • 06 00 PM IST - 09 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాల్లో A1 గ్రేడ్ పొందడానికి ఎన్ని పాయింట్లు సాధించాలి?

    ఏపీ ఇంటర్ ఫలితాల్లో  A1 గ్రేడ్ కోసం విద్యార్థులు 100 మార్కులకు 91 లేదా అంతకంటే ఎక్కువ సాధించాల్సి ఉంటుంది. 

  • 05 20 PM IST - 09 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాలను 2025 ఎవరు విడుదల చేయనున్నారు?

    ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సారి ఇంటర్మీడియట్ ఫలితాలను 2025 విడుదల చేసే అవకాశం ఉంది. 
     

  • 04 56 PM IST - 09 Apr'25

    ఏపీ ఇంటర్మీడియట్ 2025 ఫలితాల  వివరాలు

     

    పరీక్ష పేరు ఇంటర్మీడియట్ పరీక్ష
    నిర్వాహక సంస్థ BIEAP
    పరీక్ష తేదీలు 3 మార్చి 2025 నుండి 20 మార్చి 2025 వరకు
    ఫలితాల తేదీ ఏప్రిల్ 12 లేదా 13 2025

  • 12 13 PM IST - 09 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఏ వెబ్‌సైట్లో చూడొచ్చు?

    ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు చెక్ చేయాల్సిన వెబ్‌సైట్‌ల లిస్ట్‌ను ఈ దిగువున అందించాం. 

    • ap.nic.in
    • ap.gov.in
    • bie.ap.gov.in
    • examresults.ap.nic.in

  • 05 41 PM IST - 08 Apr'25

    AP ఇంటర్ ఫలితాల మునుపటి సంవత్సరం పాస్ పర్సంటైజ్‌ ఎంతంటే?

    సంవత్సరంఉత్తీర్ణత శాతం
    202476 శాతం
    202372 శాతం
    202261 శాతం
    2021100 శాతం
    202063 శాతం

     

  • 03 12 PM IST - 08 Apr'25

    12 లేదా 13న ఇంటర్ ఫలితాలు 2025?

    ఈ నెల 12 లేదా 13 తేదీల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. 

  • 02 30 PM IST - 08 Apr'25

    వెబ్‌సైట్‌లో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2025 చెక్ చేసుకోవడానికి కావాల్సిన వివరాలు ఏమిటి?

    • విద్యార్థుల రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్
    • పుట్టిన తేదీ 

  • 02 00 PM IST - 08 Apr'25

    AP ఇంటర్ ఫలితాలు 2025 రీ వెరిఫికేషన్ అప్లికేషన్‌ ఫీజు ఎంత?

    మార్కుల రీకౌంటింగ్ లేదా మార్కుల రీవాల్యుయేషన్ కోసం సబ్జెక్ట్‌కు రూ.260లు చెల్లించాల్సి ఉంటుంది. 

  • 01 30 PM IST - 08 Apr'25

    ఏపీ ఇంటర్ 2025 సప్లిమెంటరీ పరీక్షఎప్పుడు జరుగుతుంది?

    ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష 2025 మే 2025లో జరిగే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్ష 2025లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కావచ్చు.

  • 01 05 PM IST - 08 Apr'25

    వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఎలా చెక్ చేసుకోవాలి?

    • మీ మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.
    • 'Hi' అని టైప్ చేసి 9552300009 నెంబర్‌కు పంపించాలి. 
    • తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' అని చెప్పే ఆప్షన్ కనిపిస్తుంది.
    • అందులో 'విద్యా సేవలు' పై క్లిక్ చేసి, ఆపై 'పరీక్షా ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి (ఇంటర్మీడియట్)' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
    • ఏపీ ఇంటర్ ఫలితం 2025 డౌన్‌లోడ్ ఆప్షన్ యాక్టివేట్ అయిన తర్వాత, మీ హాల్ టికెట్ నెంబర్‌ను సబ్మిట్ చేయాలి. 
    • మీ మార్కుల మెమో పంపబడుతుంది. 

  • 10 27 AM IST - 08 Apr'25

    ఏపీ ఇంటర్ 2025 పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు?

    ఏపీ ఇంటర్ 2025 పరీక్షలకు దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 

  • 09 38 AM IST - 08 Apr'25

    ఏపీ ఇంటర్ సెకండియర్ 2025లో ఫెయిల్ అయితే ఎలా?

    ఏపీ ఇంటర్ సెకండియర్ 2025లో ఫెయిల్ అయితే విద్యార్థులు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఆ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి మళ్లీ పాస్ అవ్వొచ్చు. 

  • 08 54 AM IST - 08 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాల్లో టాపర్ల లిస్ట్ 2025 రిలీజ్ చేస్తారా?

    ఏపీ బోర్డు ఇంటర్మీడియట్  ఫలితాల 2025ను మాత్రమే ప్రకటిస్తుంది. టాపర్ల జాబితాను విడుదల చేయదు.

  • 09 00 PM IST - 07 Apr'25

    2024 ఏపీ 2వ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాలు ఏమిటి?

    • కృష్ణ
    • గుంటూరు 
    • ఎన్టీఆర్
    • విశాఖపట్నం  
    • తూర్పు గోదావరి

  • 08 00 PM IST - 07 Apr'25

    2024 ఏపీ  ఇంటర్ ఫలితాల్లో 1వ సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత శాతం ఏ జిల్లాలో నమోదైంది?

    • కృష్ణ
    • గుంటూరు
    • ఎన్టీఆర్
    • విశాఖపట్నం
    • తూర్పుగోదావరి

  • 07 12 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 తర్వాత ఏమిటి?

    ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులతో పాసైన అభ్యర్థులు తమకు ఇష్టమైన మార్గంలో వెళ్లవచ్చు. కొందరు ఎంసెట్, పాలిటెక్నిక్ వంటి ప్రవేశ పరీక్షలు రాసి ఇంజనీరింగ్ వైపు అడుగులు వేస్తారు. 

  • 06 18 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాలను SMS ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి ?

    • మీ ఫోన్‌లో మెసెజ్ ఓపెన్ చేయాలి. 
    • APGEN1 < స్పేస్ > రోల్ నెంబర్ (1వ సంవత్సరానికి) లేదా APGEN2 < స్పేస్ > రోల్ నెంబర్ (2వ సంవత్సరానికి) అని టైప్ చేయాలి. 
    • దీనిని 56263కు పంపించాలి. 
    • మీరు మీ ఫలితాన్ని SMS ద్వారా అందుకుంటారు.

  • 04 34 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్ 2024 పాస్ పర్సంటేజ్ ఎంత?

    గత ఏడాది అంటే 2024లో విడుదలైన ఏపీ ఇంటర్ ఫలితాల్లో మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం  67 శాతం మంది పాస్ అయ్యారు. 

  • 04 05 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలపై ఉత్కంఠ

    ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలపై రాష్ట్రంలో విద్యార్థులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలామంది ఇంటర్ బేస్‌పై పలు ఎంట్రన్స్ టెస్ట్‌లకు హాజరవుతారు. దీంతో ఇంటర్ ఫలితాలను అందరిలో ఆసక్తి నెలకొంది. 

  • 03 47 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాలను 2025 ఎలా చెక్ చేసుకోవాలి?

    • హోంపేజీలో  'AP IPE ఫలితాలు 2025' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. 
    • మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం ఫలితాల లింక్‌ను ఎంచుకోవాలి.
    • మీరు లాగిన్ విండోకు రీ డైరెక్ట్ అవుతారు.
    • మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఆపై సబ్మిట్ చేయాలి.
    • మీ AP ఇంటర్ మార్కుల షీట్ స్క్రీన్‌పై కనబడతాయి.
    • భవిష్యత్తు సూచన కోసం కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

  • 02 40 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాలను 2025 SMS ద్వారా పొందవచ్చా?

    ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు SMS ద్వారా కూడా పొందే అవకాశం ఉంది. 

  • 02 20 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఏ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి?

    అభ్యర్థులు తమ ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ను bieap-gov.org సందర్శించాలి. 

  • 02 00 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్‌ ఫెయిల్ అయితే తర్వాత ఏం చేయాలి?

    ఏపీ ఇంటర్‌లో కనీస అర్హత మార్కులు సాధించడంలో విఫలమైన వారు సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. 

  • 01 45 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్‌లో పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు పొందాలి?

    ఏపీ ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్ పరీక్షలలో కనీసం 35 శాతం, అంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 35 మార్కులు సాధించాలి. 

  • 01 10 PM IST - 07 Apr'25

    గత సంవత్సరాల ఏపీ 2వ సంవత్సరం ఫలితాల విడదల తేదీలు

    గత కొన్నేళ్లుగా ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం విడుదల తేదీలను ఇక్కడ చూడండి

    సంవత్సరం 2వ సంవత్సరం ఫలితాల తేదీ
    2024ఏప్రిల్ 12
    2023ఏప్రిల్ 26
    2022జూన్ 22
    2021జూలై 23
    2020జూన్ 12

  • 12 45 PM IST - 07 Apr'25

    గత సంవత్సరాల ఏపీ ఫలితాలు ట్రెండ్

    గత ఐదేళ్లుగా ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల తేదీలని ఇక్కడ అందించాం. 

    సంవత్సరం మొదటి సంవత్సరం ఫలితాల తేదీ
    2024ఏప్రిల్ 12
    2023ఏప్రిల్ 26
    2022జూన్ 22
    2021జూలై 23
    2020జూన్ 12

  • 12 21 PM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్ పరీక్షలు 2025

    ఈ ఏడాది ఇంటర్  మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1, 2025న ప్రారంభమయ్యాయి, రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3, 2025న ప్రారంభమై మార్చి 20, 20న పరీక్షలు ముగిశాయి. 

  • 11 51 AM IST - 07 Apr'25

    ఏపీ ఇంటర్ పేపర్ల దిద్దుబాటు 2025

    ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థుల పేపర్ల దిద్దుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. తొందర్లోనే ఫలితాలు విడుదలవుతాయి. 

  • 11 00 AM IST - 07 Apr'25

    వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు 2025

    ఈ ఏడాది 2025 ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యార్థులు వాట్సాప్ ద్వారా చూసుకునే అవకాశం ఉంటుంది. 

  • 10 08 AM IST - 07 Apr'25

    అతి త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025

    ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అతి త్వరలో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను విడుదల చేయనుంది.

  • 01 30 PM IST - 06 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్ కోసం ఫీజు ఎంత?

    ఏపీ ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్‌ కోసం రూ.100లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  • 01 20 PM IST - 06 Apr'25

    ఏపీ ఇంటర్ ఫలితాలపై రీకౌంటింగ్‌కి ఛాన్స్ 2025

    ఏపీ ఇంటర్ ఫలితాలపై 2025 అసంతృప్తి ఉంటే విద్యార్థులు రీకౌంటింగ్‌కి అప్లై చేసుకోవచ్చు. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ap-inter-results-2025-live-updates-date-and-time-soon-grading-system/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy