ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్‌డేట్స్, డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: April 12, 2024 11:58 am IST

ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 రేపు అంటే ఏప్రిల్ 12, 2024న రిలీజ్ అవుతాయి. దీంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్, లింక్‌   కోసం  ఇక్కడ చూస్తుండండి. 
 
ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్‌డేట్స్, డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండిఏపీ ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్‌డేట్స్, డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి

ఏపీ ఇంటర్ ఫలితాల 2024 కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 ఈరోజు అంటే ఏప్రిల్ 12వ తేదీన విడుదలవుతాయి.  బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల ఫలితాలను ఒకే సారి విడుదల చేయనుంది. ఇప్పటికే బోర్డు అధికారికంగా ఏపీ ఇంటర్ ఫలితాల తేదీని, సమయాన్ని ప్రకటించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాల లింక్ యాక్టివేట్ అవుతుంది. విద్యార్థుల కోసం డైరక్ట్ లింక్ ఈ దిగువున అందించడం జరుగుతుంది. విద్యార్థులు తమ ఫలితాల కోసం BIEAP అధికారిక వెబ్‌సైట్‌లు bie.ap.gov.in, bieap.apcfss.inల చూస్తుండాలి. ఆయా వెబ్‌సైట్‌లలో ఇచ్చే డైరక్ట్ లింక్ ద్వారా విద్యార్థులు ఫలితాలను  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ పుట్టిన తేదీ, రోల్ నెంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది  BIEAP ఇంటర్మీడియట్ పరీక్షలకు దాదాపుగా పది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారుజ  ఇందులో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.  ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అన్ని తాజా అప్‌డేట్‌ల కోసం ఈ లైవ్ బ్లాగ్‌ని చూస్తూ ఉండండి.

ఇవి కూడా చదవండి...

ఏపీ ఇంటర్ ఫలితాల లింక్ 2024 ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో టాపర్ల జాబితా 2024
స్టేటస్ అప్‌డేట్: ఏపీ మొదటి, రెండో సంవత్సరం ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. చివరిగా చెక్ చేయబడిన సమయం: 11:31 గంటలకు


ఏపీ ఇంటర్ ఫలితాల 2024 లింక్

AP ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాల లింక్ 2024 ఉదయం 11:00 గంటలకు యాక్టివేట్ చేయబడుతుంది మరియు దిగువ పట్టిక ద్వారా డైరెక్ట్ లింక్‌లను యాక్సెస్ చేయవచ్చు.
వెబ్‌సైట్ పేరు ఫలితం లింక్
ఈనాడు ప్రతిభ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల లింక్
ఈనాడు ప్రతిభ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల లింక్
సాక్షి ఎడ్యుకేషన్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల లింక్
సాక్షి ఎడ్యుకేషన్ ఇంటర్ రెండోొ సంవత్సరం ఫలితాల లింక్
BIEAP ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల లింక్ ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల 2024 సమయం (AP Inter Results 2024 Time)

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను 2024 ఏ సమయానికి విడుదల చేస్తారనే ప్రశ్న విద్యార్థుల్లో నెలకొంది. అయితే ఇప్పటికే సమయానికి సంబంధించిన అప్‌డేట్ అధికారికంగా రాలేదు. తేదీ, సమయానికి సంబంధించిన వివరాలను అతి త్వరలో బోర్డు వెల్లడించే అవకాశం ఉంది. ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఏ క్షణమైన విడులైన ఛాన్స్ ఉంది గనుక విద్యార్థులు తమ హాల్ టికెట్లను విద్యార్థులు దగ్గరే ఉంచుకోవాలి.

ఇది కూడా చదవండి: మూడు రోజుల్లో  TSRJC సెట్ హాల్ టికెట్లు విడుదల?

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను 2024 వెల్లడించే వెబ్‌సైట్లు ఇవే ( AP Intermediate Result 2024-websites)

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను 2024 విద్యార్థులు వివిధ వెబ్‌సైట్లలో చూడవచ్చు. ఎందుకంటే ఫలితాలు విడుదలైన తర్వాత వెంటనే విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్‌ను సందర్శిస్తుంటారు. ఆ టైమ్‌లో వెబ్‌సైట్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే విద్యార్థులు  వేర్వేరు వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఆ వెబ్‌సైట్ల వివరాలు ఈ దిగువున అందించాం.
  • examresults.ap.nic.in
  • bieap.apcfss.in
  • results.bie.ap.gov.in
  • results.apcfss.in
  • bie.ap.gov.in

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 ఎలా చూసుకోవాలి?  (How to Check AP Intermediate Results 2024?)

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను 2024 చెక్ చేసుకునే విధానం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. విద్యార్థులు ఏ మాత్రం గందరగోళ పడకుండా ఈ దిగువున తెలిపిన విధానాన్ని ఫాలో అయి సులభంగా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు bie.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోంపేజీలో ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 కోసం అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ ఆధారాలను అంటే రోల్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • వెంటనే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల స్కోర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
  • అనంతరం ఆ ఇంటర్ ఫలితాల మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అదే హార్డ్ కాపీని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.

ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్‌డేట్స్

  • 12 55 PM IST - 12 Apr'24

    మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ ప్రారంభం

    మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ ప్రారంభంకానుంది. అధికారులు ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదలచేయనున్నారు. 

  • 11 10 AM IST - 12 Apr'24

    ఏపీ ఇంటర్ ఫలితాల్లో ఈ జిల్లాలే టాప్

    ఏపీ ఇంటర్ పలితాల్లో ఐదు జిల్లాలో టాప్‌లో నిలిచాయి. కృష్ణా, గుంటూరు, ఎన్‌టీఆర్, విశాఖపట్నం జిల్లాలలో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైంది. 

  • 11 05 AM IST - 12 Apr'24

    ఏపీ ఇంటర్ రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం

    ఏపీ ఇంటర్ రెండో సంవత్సరంలో 3,60,528 మంది విద్యార్థులు పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం - 78%

  • 11 03 AM IST - 12 Apr'24

    ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణతం శాతం ఎంతంటే?

    ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో పాసైన 3,10,875 విద్యార్తులు.ఉత్తీర్ణత శాతం - 67.

  • 11 00 AM IST - 12 Apr'24

    తక్కువ రోజుల్లోనే పూర్తైన పేపర్ల వాల్యుయేషన్

    కేవలం 19 రోజుల్లో ఏపీ ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ పూర్తైంది. 

  • 10 41 AM IST - 12 Apr'24

    కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలపై ప్రెస్ మీట్ ప్రారంభం

    కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలపై ప్రెస్ మీట్ ప్రారంభమవుతుంది. ఈ సందర్బంగా అధికారులు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తారు. 

  • 09 56 AM IST - 12 Apr'24

    మునుపటి సంవత్సరాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫాస్ పర్సంటేజ్‌లు ఎంతంటే?

    2023:  61 శాతం
    2022:  54 శాతం
    2021: 100 శాతం
    2020:  59 శాతం
    2019:  60 శాతం

  • 09 45 AM IST - 12 Apr'24

    విద్యార్థులు రీ వాల్యుయేషన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

    ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో మార్కుల రీవాల్యుయేషన్, రీ చెకింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • 08 36 AM IST - 12 Apr'24

    ఇంకో 3 గంటల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 వెల్లడి

    ఈరోజు మూడు గంటల్లో ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రిజల్ట్స్‌ని రిలీజ్ చేస్తారు. 

  • 07 55 AM IST - 12 Apr'24

    ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదలవుతాయా?

    అవును, అధికారులు ఏపీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2024 ఒకే సారి విడుదల చేస్తారు. 

  • 07 40 AM IST - 12 Apr'24

    ఏపీ ఇంటర్మీడియట్ మార్కుల మెమోలో ఉండే వివరాలు ఏమిటీ?

    • అభ్యర్థి పేరు
    • ఎగ్జామ్ పేరు
    • స్ట్రీమ్
    • సబ్జెక్ట్ వైజు మార్కులు
    • మొత్తం స్కోర్ చేసిన మార్కులు
    • గ్రేడ్ లేదా పర్సంటేజ్

  • 07 15 AM IST - 12 Apr'24

    ఇంటర్మీడియట్ ఫలితాల్లో A1 గ్రేడ్ సాధించడానికి ఎన్ని మార్కులు రావాలి.

    • A1 గ్రేడ్ పొందడానికి 91 నుంచి 100 మార్కులు
    • A2 గ్రేడ్ రావడానికి 81 నుంచి 90 మారర్కులు పొందాలి
       

  • 07 00 AM IST - 12 Apr'24

    ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 ఎలా విడుదల చేస్తారు?

    అధికారులు మీడియా సమావేశంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తారు. 

  • 06 28 AM IST - 12 Apr'24

    ఈరోజే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

    ఏపీ ఇంటర్ ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదలకానున్నాయి. డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూస్తూ ఉండండి

  • 05 36 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్ ఫలితాలను 2024 చెక్ చేసుకోవడం తెలుసా?

    ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం విద్యార్థులు తమ స్మార్ట్ ఫోన్లలోని క్రోమ్ ఓపెన్ చేసి bie.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.  హోంపేజీలో ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. 

  • 04 11 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలు 2024 విడుదలైన తర్వాత విద్యార్థులు ఏం చేయాలి?

    ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 విడుదలైన తర్వాత విద్యార్థులు ముందుగా తమ మార్కులను చెక్ చేసుకోవాలి. ఒక వేళ తమకు వచ్చిన మార్కుల పట్ల అసంతృప్తి, అనుమానాలుంటే రీ కౌంటింగ్, రీ చెకింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 
     

  • 04 04 PM IST - 11 Apr'24

    మొదటి, రెండో సంవత్సరం ఏపీ ఇంటర్ ఫలితాల రీ చెకింగ్, రీ కౌంటింగ్‌ని ఎప్పుడు నిర్వహిస్తారు?

    ఏపీ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు విడుదలైన తర్వాత BIEAP రీ చెకింగ్, రీ కౌంటింగ్‌కు తేదీలను ప్రకటించింది.  విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.  

  • 03 16 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన

    రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నాట్టు బోర్డు వెల్లడించింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి ఫలితాలను విడుదల చేస్తాయని తెలిపింది. 

  • 02 49 PM IST - 11 Apr'24

    ఈ ఏడాది ఏపీ ఇంటర్ పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు?

    ఈ ఏడాది మొత్తం 9,99,698 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. 
     

  • 02 36 PM IST - 11 Apr'24

    రేపు ఉదయం ఎన్ని గంటలకు ఫలితాల లింక్ యాక్టివేట్ అవుతుంది?

    ఏపీ ఇంటర్ ఫలితాల లింక్ రేపు ఉదయం 11 గంటలకు యాక్టివేట్ అవుతుంది. 

  • 02 33 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపే?

    ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపే విడుదలవుతాయి. ఈ విషయాన్ని బోర్డు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు రేపే ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదలకానున్నాయి. 

  • 02 15 PM IST - 11 Apr'24

    గత ఏడాది ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎంత శాతం మంది పాస్ అయ్యారు?

    గత ఏడాది ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో 61 శాతం మంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో 72 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 

  • 02 10 PM IST - 11 Apr'24

    రేపు ఉదయమే ఇంటర్ ఫలితాలు వచ్చేస్తాయా?

    రేపు అంటే ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసేందుకు విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. 

  • 02 03 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్ ఫలితాలు ఎన్ని గంటలకు విడుదలవుతాయి?

    ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే సమయాన్ని, డేట్‌ని ఇంకా బోర్డు అధికారికంగా ప్రకటించ లేదు. 

  • 01 40 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి అయిందా?

    ఇప్పటికే ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి అయింది. 

  • 01 30 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల కోసం వినతి

    ఏపీ ఇంటర్ ఫలితాలను 2024 విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసింది. ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని అందులో పేర్కొంది.

  • 01 30 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి విద్యార్థుల దగ్గర ఏ లాగిన్ ఆధారాలుండాలి?

    విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలతో ఏపీ ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

  • 01 16 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్మీడియట్ కంపార్ట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు విడుదలయ్యాయా?;

    లేదు. ఏపీ ఇంటర్మీడియట్ కంపార్ట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన తేదీలను బోర్డు ఇంకా ప్రకటించ లేదు. 

  • 01 10 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్ ఫలితాల్లో పాసవ్వని విద్యార్థులకు వేరే మార్గం ఉందా?

    కచ్చితంగా ఉంది. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాసవ్వని విద్యార్థులు నిరాశ చెందనక్కర్లేదు. వాళ్లు కంపార్ట్‌మెంట్ పరీక్షలకు ఎన్‌రోల్ చేసుకోవచ్చు. 

  • 12 02 PM IST - 11 Apr'24

    ఏపీ ఇంటర్‌లో పాసవ్వడానికి విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించాలి?

    ఏపీ ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు పాసవ్వడానికి ప్రతి పరీక్షలో కనీసం 35 శాతం మార్కులను పొందాలి. 

  • 08 44 PM IST - 10 Apr'24

    ఏపీ ఇంటర్ ఫలితాలు 2024: మార్కుల మెమోని ఎలా పొందవచ్చు?

    ఏపీ ఇంటర్ బోర్డు ఫలితాలు 2024 ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న మనబడి ఏపీ ఇంటర్ మార్కుల మెమో తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లను పాఠశాలల ద్వారా బోర్డు జారీ చేస్తుంది. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ap-intermediate-results-2024-live-updates-date-and-time-download-link/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!