రెండో దశ AP LAWCET సీట్ల కేటాయింపు ఫలితం 2023 (AP LAWCET Seat Allotment Result 2023): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈరోజు రెండో దశ కోసం AP LAWCET సీట్ల కేటాయింపు ఫలితం 2023ని (AP LAWCET Seat Allotment Result 2023) విడుదలైంది. రెండో దశ సీట్ల కేటాయింపు ఫలితాన్ని చెక్ చేయడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేశాం. అంతకుముందు అభ్యర్థులు AP LAWCET రెండో దశ సీటు కేటాయింపు ఫలితాన్ని చెక్ చేయడానికి అభ్యర్థి పేరు, పాస్‌వర్డ్ వంటి లాగిన్ ఆధారాలను దగ్గరే ఉంచుకోవాలి. సీట్లు కేటాయించబడే అభ్యర్థులు జనవరి 3 నుంచి 5, 2024 మధ్య రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
AP LAWCET సీట్ల కేటాయింపు ఫలితం 2023 రెండో దశ: డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ (AP LAWCET Seat Allotment Result 2023 Second Phase: Direct Link to Download)
AP LAWCET సీట్ల కేటాయింపు జాబితాను అధికారులు కళాశాలల వారీగా ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేశారు. సంబంధిత డౌన్‌లోడ్ లింక్‌ని ఇక్కడ జోడించబడింది.
AP LAWCET రెండో దశ సీట్ అలాట్‌మెంట్ ఫలితం 2023 డౌన్‌లోడ్ లింక్ |
---|
రెండో దశ ఏపీ లాసెట్ సీట్ల కేటాయింపు ఫలితం 2023: డౌన్‌లోడ్ చేయడానికి దశలు (AP LAWCET Seat Allotment Result 2023 Second Phase: Steps to Download)
అభ్యర్థులు AP LAWCET 2023 రెండో దశ సీట్ల కేటాయింపు ఫలితాన్ని చెక్ చేయడానికి కింది దశలను ఇక్కడ చూడవచ్చు:
- పైన హైలైట్ చేసిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు కొత్త పేజీకి దారి రీడైరక్ట్ అవుతారు. ఇక్కడ అభ్యర్థులు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- AP LAWCET రెండో దశ సీట్ల కేటాయింపు ఫలితం PDF స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- AP LAWCET రెండో దశ సీట్ల కేటాయింపు ఫలితాన్ని PDF డౌన్‌లోడ్ చేసి, దాన్ని సేవ్ చేయాలి.
రెండో దశ AP LAWCET 2023 సీట్ల కేటాయింపు తర్వాత ఏమిటి? (What after AP LAWCET 2023 Second Phase Seat Allotment?)
సీటు కేటాయించబడే అభ్యర్థులు దాంతో సంతృప్తి చెందితే సీటును అంగీకరించాలి. ఆ తర్వాత వారు “డౌన్‌లోడ్ సీట్ అలాట్‌మెంట్ లెటర్”పై క్లిక్ చేసి, అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి కేటాయించిన కాలేజీలకు తీసుకెళ్లాలి. అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే, వారి కేటాయింపు స్వయంచాలకంగా రద్దు చేయబడుతుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఇది AP LAWCET 2023 కౌన్సెలింగ్‌లో చివరి రౌండ్ అయినందున చివరి రౌండ్‌లో సీటును అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి రెండో రౌండ్ తర్వాత అభ్యర్థులు సీట్ల కేటాయింపుతో సంతృప్తి చెందకపోతే, వారు దానిని అంగీకరించ లేరు. కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేయలేరు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
లింక్‌పై క్లిక్ చేయాలి.