ఏపీ మెగా డీఎస్సీ సిలబ్ 2024 విడుదల (AP MEGA Dsc Syllabus 2024 Released) : ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ విడుదలైంది. డీఎస్సీ కోసం అభ్యర్థులు సన్నద్ధం అవ్వడానికి వీలుగా పాఠశాల విద్యాశాఖ సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చింది. AP DSC వెబ్‌సైట్‌లో సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు సిలబస్‌ను చూడవచ్చు. ఇప్పటికే డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మెగా డీఎస్సీ సిలబస్‌ని https://apdsc2024.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 డౌన్‌లోడ్ PDF (AP MEGA DSC Syllabus 2024 Download pdf)
ఏపీ మెగా డీఎసీ సిలబస్ 2024 డౌన్‌లోడ్ PDF కోసం ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 PDF - ఇక్కడ క్లిక్ చేయండి |
---|
ముందు షెడ్యూల్ ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రిజర్వేషన్లకు సంబంధించిన వివాదాల కారణంగా నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాంటి సమస్యలు లేకుండా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించాలనే లక్ష్యంతో చట్టపరమైన వివరాలను సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది.అయితే ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదలపై స్పష్టత రాలేదు. మరోవైపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్కూల్ అసిస్టెంట్, PET, SGT, PGT, TGT ప్రిన్సిపల్ పోస్ట్‌ల వంటి బహుళ పోస్ట్‌ల కోసం 16347 ఖాళీల కోసం అభ్యర్థులను నియమించడానికి AP DSC 2024 పరీక్షను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (AP DSC) బాధ్యత వహిస్తుంది. సంబధిత రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ సిలబస్, పరీక్షా సరళి గురించి తెలుసుకోవాలి. పరీక్షలో విజయం సాధించడానికి కష్టపడి చదవాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో మెగా DSC సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక AP DSC వెబ్‌సైట్ 'apdsc2024.apcfss.in'కి వెళ్లాలి. సిలబస్ వెబ్‌సైట్‌లోని 'సిలబస్' విభాగంలో అందుబాటులో ఉంటుంది.