ఏపీ పాలిసెట్ 2024 అప్లికేషన్ చివరి తేదీ (AP POLYCET 2024 Application Last Date) : ఏపీ పాలిసెట్ 2024కు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే (ఏప్రిల్ 05, 2024) చివరి తేదీ (AP POLYCET 2024 Application Last Date). ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. వారి కోసం ఏపీ AP POLYCET2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి, సబ్మిట్ చేయడానికి డైరక్ట్ లింక్ దిగువన అందుబాటులో ఉంది. AP POLYCET 2024 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20 2024న ప్రారంభమైంది. అధికార యంత్రాంగం అధికారిక వెబ్‌సైట్‌లో AP POLYCET 2024 పరీక్ష తేదీని ప్రకటించింది.
AP POLYCET 2024 రిజిస్ట్రేషన్ లింక్ (AP POLYCET 2024 Registration Link )
సంబంధిత అధికారులు AP POLYCET 2024 దరఖాస్తు తేదీలని అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ప్రకటించారు. అభ్యర్థులు దిగువ పట్టిక నుంచి ఏపీ పాలిసెట్ రిజిస్ట్రేషన్ 2024 లింక్‌ను పొందవచ్చు. ఈ లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు.ఏపీ పాలిసెట్ రిజిస్ట్రేషన్ 2024 లింక్ |
---|
AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్‌లో పూరించే విధానం? (How to fill online AP POLYCET 2024 Application Form? )
అధికారులు ఏపీ పాలిసెట్ 2024 దరఖాస్తు ఫార్మ్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏపీ పాలిసెట్ అప్లికేషన్ ఫార్మ్‌ను పూరించి సబ్మిట్ చేయాలి. చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందించడం జరిగింది.
- రిజిస్ట్రేషన్: ముందుగా అభ్యర్థులు ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్‌ను polycetap.nic.in సందర్శించాలి. 'AP POLYCET ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి' అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దరఖాస్తుదారులు ఏపీ పాలిసెట్ రిజిస్ట్రేషన్ 2024లో పదో తరగతి పరీక్ష వివరాలు, పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాసైన సంవత్సరం వంటి నిర్దిష్ట ప్రాథమిక వివరాలను అందించి క్యాప్చా ఎంటర్ చేసి. దిగువున "Show Application అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ద రఖాస్తు ఫార్మ్ నింపడం : అనంతరం ఏపీ పాలిసెట్ దరఖాస్తు ఫార్మ్ 2024 ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు అనేక వ్యక్తిగత, విద్యాపరమైన వివరాలను అందించాలి.
- పత్రాలను అప్‌లోడ్ చేయడం : అభ్యర్థులు ఏపీ పాలిసెట్ 2024 కోసం దరఖాస్తులో వారి సంతకం, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అధికారులు అందించిన స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా వాటిని అప్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించాలి : అభ్యర్థులు అవసరమైన అన్ని వివరాలను అందించిన తర్వాత అభ్యర్థులు రూ. 400 ఏపీ పాలిసెట్ దరఖాస్తు ఫీజును చెల్లించాలి. తర్వాత AP POLYCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను చివరన సబ్మిట్ చేయాలి. నిర్ధారణ పేజీని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయడం : దరఖాస్తు ఫార్మ్‌ను ఆన్‌లైన్‌లో విజయవంతంగా సబ్మిట్ చేసిన అభ్యర్థులు పరీక్షకు కొన్ని రోజులు ముందు అంటే ఏప్రిల్ 20న హాల్ టికెట్లను పొందుతారు.