ఏపీలో 2260 ఉద్యోగాల భర్తీకి గ్నీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవే

Rudra Veni

Updated On: April 15, 2025 04:50 PM

ఏపీ ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. 2260 ఉద్యోగాల (AP Special Education Teacher Posts 2025) భర్తీకి గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగాల వివరాలు ఇక్కడ చూడండి. 
ఏపీలో 2260 ఉద్యోగాల భర్తీకి గ్నీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవేఏపీలో 2260 ఉద్యోగాల భర్తీకి గ్నీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవే

ఏపీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 2025 (AP Special Education Teacher Posts 2025) : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2, 260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను క్రియేట్ చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు SGT పోస్టులు 1,136, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,124 ఉన్నాయి. ప్రభుత్వం DSC ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించనున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వాటిని పెంపొందించడంలో ఈ ఉపాధ్యాయులు కృషి చేస్తారు.

ఏపీలో జిల్లాల వారీగా మంజూరు చేసిన పోస్టుల వివరాలు

ఏపీలో జిల్లా వారీగా మంజూరు చేసిన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించాం. ఇప్పటికే మంజూరు చేసి పోస్టుల సంఖ్య, ఇప్పుడు కొత్తగా మంజూరు చేసిన పోస్టుల వివరాలు అందించాం.


క్ర.సంఖ్య

జిల్లా పేరు

మంజూరు చేయబడిన SGTల సంఖ్య (స్పెషల్ ఎడ్యుకేషన్ )

స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య (స్పెషల్ ఎడ్యుకేషన్) అవసరం

ఇప్పటికే మంజూరు చేసిన పోస్టుల సంఖ్య

ఇప్పుడు మంజూరు చేసిన పోస్టులు

1. 1.

అనంత పురం

101

178

78

100

2

చిత్తూరు

117

164

82

82

3

తూర్పు గోదావరి

127

226

75

151

4

గుంటూరు

151

170

72

98

5

వైఎస్సార్ కడప

57

115

66

49

6

కృష్ణా

71

154

65

89

7

కర్నూలు

110

199

69

130

8

నెల్లూరు

63

105

61

44

9

ప్రకాశం

74

121

71

50

10

శ్రీకాకుళం

71

162

53

109 -

11

విశాఖపట్నం

59

110

58

52

12

విజయనగరం

45

115

49

66

13

పశ్చిమ గోదావరి

90

166

61

105

మొత్తం సంఖ్య

1136

1984

860

1124


ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. విద్యా రంగంలో సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుంది. కాగా ఈ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. మరిన్ని అప్‌డేట్ల కోసం కాలేజ్ దేఖోని ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-special-education-teacher-posts-2260-orders-2025-65050/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy