
AP SSC సోషల్ పరీక్ష వాయిదా 2025 (AP SSC Social Exam Postponed 2025):
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. AP SSC టైమ్ టేబుల్ 2025 ప్రకారం పరీక్షలు మార్చి 17 నుంచి మార్చి 31, 2025 మధ్య జరగనున్నాయి
. అయితే ఈ 31న జరగాల్సిన సోషల్ పరీక్షలో మార్పు జరిగింది. మార్చి 31, 2025న జరగాల్సిన ఏపీ పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా పడింది. ఆరోజు రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1, 2025కి సోషల్ పరీక్షను తిరిగి షెడ్యూల్ (AP SSC Social Exam Postponed 2025) చేయడం జరిగింది.
ఈ విషయాన్ని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో ఈనెల 31న స్టోేరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ని తీసుకెళ్లవద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షలు షెడ్యూల్ విడుదల సమయంలో చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పులు ఉండొచ్చని ముందుగానే కాలేజ్ దేఖో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఏపీ పదో తరగతి పరీక్షలు ఎటువంటి అంతరాయం కలగకుండా జరిగాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలపై విద్యార్థుల నుంచి మిశ్రమ స్పందన వెలువడింది. కొన్ని పరీక్షలు సులువుగా ఉంటే.. మరికొన్ని కష్టంగా ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
లేటెస్ట్ న్యూస్..
ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పడు విడుదలవుతాయి? | AP SSC బయాలజీ పరీక్ష విశ్లేషణ 2025 |
---|---|
AP SSC 2025 బయాలజీ ఆన్సర్ కీ PDF | AP SSC సోషల్ గెస్ పేపర్ 2025 |
AP SSC పరీక్ష 2025: హైలెట్స్ (AP SSC Exam 2025: Highlights)
ఏపీ 10వ తరగతి పరీక్షలకు 2025 హాజరయ్యే విద్యార్థులు ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో ముఖ్యమైన సమాచారాన్ని చూడవచ్చు.
వివరాలు | వివరాలు |
---|---|
బోర్డు పేరు | బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ |
పరీక్ష పేరు | AP SSC పరీక్ష 2025 |
తరగతి | 10వ తరగతి |
AP SSC పరీక్ష తేదీలు 2025 | మార్చి 17 నుండి 31, 2025 వరకు |
AP SSC ఫలితాల విడుదల తేదీ | ఏప్రిల్ 2025 (అంచనా) |
AP బోర్డు అధికారిక వెబ్‌సైట్ | bse.ap.gov.in |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



