APRJC హాల్ టికెట్ 2023 (APRJC CET Hall Ticket 2023): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ APRJC CET హాల్ టికెట్ 2023ని ఈరోజు మే 15, 2023న ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేసింది. APRJC CET దరఖాస్తు ఫార్మ్‌ని విజయవంతంగా సబ్మిట్ చేసిన అభ్యర్థులకు హాల్ టికెట్ జారీ చేయబడింది. అభ్యర్థులు APRJC CET 2023 హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేయడానికి లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. APRJC CET 2023 హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు దాని ప్రింట్ అవుట్‌ని తీసుకోవాలి. దానిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. ఈ సంవత్సరం, APRJC CET పరీక్ష మే 20, 2023న (మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు) నిర్వహించబడుతుంది.
APRJC CET హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ (APRJC CET Hall Ticket 2023 Download Link)
APRJC CET హాల్ టికెట్ 2023 విడుదలైన తర్వాత అభ్యర్థులు దీనిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చే యాలి.
APRJC CET హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ |
---|
గమనిక: అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థుల చిరునామాలకు ఎలాంటి ముద్రించిన హాల్ టికెట్లను అధికార యంత్రాంగం పంపించదు. అలాగే అభ్యర్థులు APRJC CET హాల్ టికెట్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం మరిచిపోకూడదు. లేకపోతే పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించబడరు.
APRJC CET హాల్ టికెట్ 2023 విడుదల సమయం (APRJC CET Hall Ticket 2023 Release Time)
APRJC CET 2023 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఆర్జేసీ సెట్ 2023 హాల్ టికెట్ల విడుదల తేదీ, సమయం ఇక్కడ తెలుసుకోండి.
విశేషాలు | వివరాలు |
---|---|
APRJC CET హాల్ టికెట్ విడుదల తేదీ | మే 15, 2023 |
APRJC CET హాల్ టికెట్‌ను విడుదల చేయడానికి అంచనా సమయం | సాయంత్రం 4 గంటలకు |
APRJC CET హాల్ టికెట్‌ను విడుదల చేయడానికి వెబ్‌సైట్ | aprs.apcfss.in |
APRJC CET హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు దానిపై పేర్కొన్న వివరాలను క్షుణ్ణంగా చెక్ చేయాలి. ఏదైనా వ్యత్యాసాన్ని గుర్తించినట్లయితే వాస్తవాలను సరిదిద్దడానికి అభ్యర్థులు వెంటనే సంబంధిత అధికారిని సంప్రదించాలి.
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.