TGPSC Group 2 హాల్ టికెట్లో లోపాలు 2024 (TGPSC Group 2 Hall Tickets Mistakes 2024) : TGPSC గ్రూప్ 2 ఎగ్జామినేషన్ 2024 షెడ్యూల్ చేయబడింది. ఇప్పుడు ఈ పరీక్ష 2024 డిసెంబర్ 15, 16 తేదీలలో తెలంగాణ రాష్ట్రమంతటా కేటాయించబడిన వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024ని 9 డిసెంబర్ 2024న దాని అధికారిక వెబ్‌సైట్ www.TGPSC.gov.inలో రిలీజ్ చేయనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌ను పరీక్ష తేదీకి ముందే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించడం వల్ల చివరి నిమిషంలో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చూసుకోవాలి. TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 వివరాలను పొందడానికి కిందికి స్క్రోల్ చేయండి.
TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ 2024 (TGPSC Group 2 Hall Ticket 2024 Download Link)
TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్లని డౌన్‌లోడ్ చేసుకోవడానికి సంబంధిత లింక్‌ని ఈ దిగువున అందించాం. అభ్యర్థులు దానిపై క్లిక్ చేసి హాల్ టికెట్లని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ |
---|
TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్లపై ఉండే వివరాలు (TGPSC Group 2 Hall Ticket 2024 Details)
TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌పై పేర్కొన్న అన్ని వివరాలను సరిగ్గా, కనిపించేలా చూసుకోవాలి. ఏమైనా తప్పులుంటే అభ్యర్థులు పరీక్ష తేదీకి ముందే వివరాలను కరెక్షన్ చేసుకోవడానికి నిర్వహణ అధికారాన్ని తప్పనిసరిగా సంప్రదించాలి. హాల్ టికెట్‌పై ఉండే వివరాలు ఈ దిగువున అందించాం.- పరీక్ష పేరు
- అభ్యర్థి పేరు
- కండక్టింగ్ బాడీ పేరు
- రోల్ నెంబర్
- పరీక్ష తేదీ
- పరీక్ష కేంద్రం
- పరీక్ష సమయం
- రిపోర్టింగ్ సమయం
- పరీక్ష సమయం వ్యవధి
- తండ్రి లేదా తల్లి పేరు
- అభ్యర్థి పుట్టిన తేదీ
- అభ్యర్థి ఫోటో
- అభ్యర్థి, పరీక్ష కౌన్సెలర్ సంతకం
- పరీక్ష రోజుకి సంబంధించిన సూచనలు
TGPSC గ్రూప్ 2 హాల్ టిక్కెట్లలోని తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (How to Correct TGPSC Group 2 Hall Ticket Mistakes 2024)
TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్లలో తప్పులుంటే.. వెంటనే సరి చేసుకోవాలి. పరీక్ష కేంద్రానికి వెళ్లక ముందే హాల్ టికెట్లలో తప్పులను సరిదిద్దుకోవాలి. TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్‌పై తప్పులను సరిచేయడానికి, మీరు డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్‌లోని పేరు, రోల్ నెంబర్, పరీక్ష తేదీ, వేదిక లేదా కేటగిరి వంటి మీ వ్యక్తిగత వివరాలలో ఏవైనా లోపాలను గుర్తిస్తే వెంటనే TGPSC హెల్ప్‌డెస్క్‌ని సంప్రదించాలి. అధికారిక TGPSC వెబ్‌సైట్‌లో ఎలా సంప్రదించాలో సమాచారం ఉంటుంది.- ముందుగా అభ్యర్థులు హల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుని.. అందులోని వివరాలను క్షుణంగా చెక్ చేసుకోవాలి.
- హాల్ టికెట్‌లో తప్పులుంటే, లోపాలు గుర్తిస్తే అధికారిక వెబ్‌సైట్ ద్వారా TGPSC హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి.
- హెల్ప్‌డెస్క్ కోసం సంప్రదింపు సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ (TGPSC.gov.in)ని సందర్శించండి.
- హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించిన తర్వాత హాల్ టికెట్‌లో మీరు గమనించిన లోపాలను, తప్పులను వివరంగా తెలియజేయాలి.
- అధికారులకు తెలియజేయడం ద్వారా తప్పులను సులభంగా సరిదిద్దుకోవచ్చు.