JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2 (JEE Main 2024 City Intimation Slip Session 2) :
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ సెషన్ కోసం సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను 27 మార్చి 2024న విడుదలైంది. JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్
(
JEE Main 2024 City Intimation Slip Session 2) సెషన్ 2 లింక్ దిగువన జోడించబడింది. ఏప్రిల్ 4, 15 2024 మధ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి పరీక్షకు మూడు రోజుల ముందు విడుదల చేసే అడ్మిట్ కార్డ్‌లా కాకుండా NTA JEE మెయిన్ సిటీ స్లిప్ 2024ని అన్ని రోజులున, షిఫ్ట్‌లకు ఒకే రోజు విడుదల చేస్తుంది. సెషన్ 2కి మొదటిసారి హాజరైన అభ్యర్థులు తప్పనిసరిగా JEE మెయిన్ సిటీ స్లిప్ 2024లో కేటాయించిన పరీక్షా నగరంతో పాటు అభ్యర్థుల వివరాలు మాత్రమే ఉంటాయని గమనించాలి. పరీక్ష నగరం పూర్తి వివరాలు అడ్మిట్‌లో అందుబాటులో ఉంటాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆధారంగా అభ్యర్థులు పరీక్ష జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు ముందుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు.
JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2 లింక్ (JEE Main 2024 City Intimation Slip Session 2 Link)
JEE మెయిన్ 2024 ఎగ్జామ్ సిటీ స్లిప్ 2024ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని విడుదల చేసిన తర్వాత దిగువన జోడించబడుతుంది:
JEE మెయిన్ 2024 సిటీ ఇన్టిమేషన్ స్లిప్ సెషన్ 2 లింక్: ఇక్కడ క్లిక్ చేయండి |
---|
JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2 ముఖ్యమైన తేదీలు (JEE Main 2024 City Intimation Slip Session 2 Important Dates)
ఈ దిగువ అభ్యర్థి మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా సెషన్ 2 కోసం JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను చెక్ చేయవచ్చు.
ఈవెంట్స్ | తేదీలు |
---|---|
విడుదల తేదీ | మార్చి 27, 2024 |
విడుదల సమయం | ఉదయం లేదా సాయంత్రం |
JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2ని ఎలా చెక్ చేయాలి? (How to check the JEE Main 2024 City Intimation Slip Session 2?)
ఈ దిగువ అభ్యర్థి JEE మెయిన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024ని డౌన్‌లోడ్ చేయడానికి దశలను చెక్ చేయవచ్చు.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in/ని సందర్శించాలి.
- తర్వాత హోంపేజీలోని తాజా వార్తల విభాగానికి వెళ్లాలి.
- ఆ పేజీలో సిటీ ఇంటిమేషన్ 2024 లింక్ కోసం వెదికి, దానిపై క్లిక్ చేయాలి.
- సిటీ స్లిప్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
- చివరగా అభ్యర్థి భవిష్యత్తు సూచన కోసం JEE మెయిన్ 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెషన్ 2ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు