- జేఈఈ మెయిన్ పరీక్ష రోజున విద్యార్థులు తప్పనిసరిగా షెడ్యూల్డ్ టైమ్‌కు ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి. ఎందుకంటే సెక్యూరిటీ చెకింగ్స్ ఉంటాయి. పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులు పరీక్షా హాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు.
- పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులపై పేరు, సెంటర్ వివరాలను ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ టైమింగ్స్‌ను చూసుకోవాలి.
- ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లేటప్పుడు అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డుతో పాటు, ఐడీ ప్రూఫ్‌ను కూడా తీసుకెళ్లాలి. అంటే ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, స్కూల్ ఐడీ, పాన్, డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదో ఒకటి తీసుకెళ్లాలి.
- పరీక్షా హాల్‌కు వెళ్లేటప్పుడు అభ్యర్థులు ఎటువంటి పేపర్లను అనుమతించరు. పరీక్ష హాల్లో పెన్ లేదా పెన్సిల్, రఫ్ వర్క్ కోసం ఓ బ్లాంక్ పేపర్‌ను అందిస్తారు.
- పరీక్ష హాల్లో అభ్యర్థులు తమకు ఇచ్చిన షీట్ పైభాగంలో తమ పేరు, రోల్ నెంబర్‌ను తప్పనిసరిగా రాయాలి. పరీక్ష హాల్ నుంచి బయలుదేరే ముందు ఈ షీట్ ఇన్విజిలేటర్‌కు తిరిగి ఇవ్వాలి.
- పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను తీసుకెళ్లకూడదు. మొబైల్స్, కాలిక్యులేటర్లు, హ్యాండ్ బ్యాగ్‌లు, పుస్తకాలు ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు.
- PWD (Person with Disability Registration) రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌ని తీసుకెళ్లాలి.
- JEE మెయిన్ పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు తప్పనిసరిగా సెంటర్ ఇన్విజిలేటర్లు సూచించిన సూచనలను పాటించాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత ముగిసే వరకు బయటకు వచ్చేందుకు అవకాశం ఉండదు.
- జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023
- గుర్తింపు కార్డు, ఫోటో కాపీలు
- శానిటైజర్
- బాల్ పాయింట్ పెన్స్
- మాస్కులు
- ట్రాన్స్‌ప్రరెంట్ వాటర్ బాటిల్
- అభ్యర్థులు షుగర్ పేషంట్లు అయితే షుగర్ ట్యాబ్లెట్లు, పండ్లు
JEE మెయిన్ ఎగ్జామ్ హాల్లో అనుమతించని వస్తువులు (Things Not Allowed Inside JEE Main 2023 Exam Hall)
- పెన్సిల్, జామెట్రీ బాక్స్
- పర్స్, వాలెట్. హ్యాండ్ బ్యాగ్స్
- ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్
- స్టేషనరీ, పేపర్లు
- తినే వస్తువులు, టీ, కాఫీ
- మెటల్ వస్తువులు
- టేప్ రికార్డర్, కెమెరా
- సెల్ ఫోన్, ఇయర్ ఫోన్స్