జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 పరీక్షలలో జనవరి 27వ తేదీన జరగాల్సిన పరీక్ష ఫిబ్రవరి 1, 2023 తేదీకి మార్చబడింది అని విద్యార్థులు గమనించాలి. ఈ పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని పత్రాలను (JEE Main Advance Intimation Slip) తీసుకుని వెళ్లాలి వాటిని తీసుకుని వెళ్లకపోతే విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. జేఈఈ మెయిన్ 2023 పరీక్ష రోజున విద్యార్థులు ఏ డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లాలో (Documents Required on JEE MAIN 2023 Exam Day) ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2023 పరీక్ష రోజు అవసరమైన పత్రాలు ( Documents Required on JEE MAIN 2023 Exam Day)
జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులు ఈ క్రింద వివరించిన డాక్యుమెంట్లను తప్పని సరిగా పరీక్ష కేంద్రానికి తీసుకుని వెళ్లాలి.- అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న జేఈఈ అడ్మిట్ కార్డు (JEE Main 2023 Admit card ) (అడ్మిట్ కార్డు మీద విద్యార్థి సంతకం ఉండాలి)
- విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ( అప్లికేషన్ ఫారం లో ఇచ్చిన ఫోటో నే ఇక్కడ కూడా ఇవ్వాలి)
- ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ( ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా కాలేజీ సర్టిఫై చేసిన ఐడీ కార్డ్)
- PwD సర్టిఫికెట్ ( PwD కేటగిరీ విద్యార్థులు , డాక్టర్ చేత ధ్రువీకరించబడిన PwD సర్టిఫికెట్ ఒరిజినల్ కాపీ ను తీసుకుని వెళ్లాలి)