తెలంగాణ పదో తరగతి పరీక్ష తేదీలు 2025 (TS SSC Exam Date 2025 Time Table ) : డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ తెలంగాణ TS SSC టైమ్‌టేబుల్ 2025ని (TS SSC Exam Date 2025 Time Table) అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.inలో విడుదలైంది. తెలంగాణ పదో తరగతి పరీక్షలు 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్ 4, 2025 మధ్య జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ పేజీలో TS SSC పరీక్ష తేదీలు 2025ని చెక్ చేయవచ్చు. పరీక్షలు పెన్ను, పేపర్ ఫార్మాట్‌లో జరుగుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి.
తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ 2025 (Telangana TS SSC Time Table 2025)
విద్యార్థులు ఈ దిగువ పట్టికలో సబ్జెక్ట్‌ల వారీగా తాత్కాలిక సబ్జెక్ట్ వారీగా TS 10వ పరీక్ష తేదీలను (TS SSC Exam Date 2025 Time Table) చెక్ చేయవచ్చు.విషయం | తేదీలు |
---|---|
ఫస్ట్ లాంగ్వేజ్ | మార్చి 21, 2025 |
సెకండ్ లాంగ్వేజ్ | మార్చి 22, 2025 |
థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) | మార్చి 24, 2025 |
మ్యాథ్స్ | మార్చి 26, 2025 |
ఫిజిక్స్ | మార్చి 28, 2025 |
బయోలజీ | మార్చి 29, 2025 |
సోషల్ | ఏప్రిల్ 2, 2025 |
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం & అరబిక్), SSC వొకేషనల్ కోర్సు (థియరీ) | అప్‌డేట్ చేయబడుతుంది |
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II (సంస్కృతం & అరబిక్) | అప్‌డేట్ చేయబడుతుంది |
తెలంగాణ పదో తరగతి టైమ్ టేబుల్ 2025ని ఎలా పొందాలి? (How to Get Telangana SSC Time Table 2025)
TS 10వ పరీక్ష టైమ్ టేబుల్ PDF అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ నుండి తెలంగాణ SSC పరీక్ష టైమ్‌టేబుల్ PDFని పొందేందుకు దిగువ వివరించిన స్టెప్లను అనుసరించండి.
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్
bse.telangana.gov.in
ని సందర్శించాలి.
స్టెప్ 2: హోంపేజీలో తాజా నోటిఫికేషన్ కింద, 'Timetable of SSC March 2025 Telangana' లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: TS SSC టైమ్ టేబుల్ 2025 PDF స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
స్టెప్ 4: భవిష్యత్తు సూచన కోసం 10వ తరగతి డేట్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.