TS ECET 2024 ముఖ్యమైన తేదీలు (TS ECET 2024 Dates): తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS ECET 2024 కోసం నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ తేదీలను (TS ECET 2024 Dates) విడుదల చేసింది. అధికారులు విడుదల చేసిన TS ECET 2024 ముఖ్యమైన తేదీల ప్రకారం ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదల చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 15, 2024 ప్రారంభమవుతుంది. ఎటువంటి ఆలస్య ఫీజు చెల్లింపు లేకుండా రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 16, 2024 వరకు దరకాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28, 2024 వరకు చేసుకోవచ్చు. మరింత స్పష్టత కోసం పూర్తి షెడ్యూల్‌ను ఈ దిగువున అందజేశాం.
TS ECET 2024 ముఖ్యమైన తేదీలు (TS ECET 2024 Important Dates)
ఈ దిగువు పట్టిక TS ECET 2024 నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ కోసం పూర్తి షెడ్యూల్‌ను ప్రదర్శిస్తుంది.
ఈవెంట్స్ | తేదీలు |
---|---|
TS ECET 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ | ఫిబ్రవరి 14, 2024 |
TS ECET 2024 నమోదు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 15, 2024 |
ఆలస్య రుసుము లేకుండా TS ECET 2024 రిజిస్ట్రేషన్ చివరి తేదీ | ఏప్రిల్ 16, 2024 |
TS ECET 2024 లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 | ఏప్రిల్ 22, 2024 |
ఆలస్య రుసుముతో TS ECET 2024 నమోదు చివరి తేదీ 2 | ఏప్రిల్ 28, 2024 |
TS ECET 2024 రిజిస్ట్రేషన్ ఫార్మ్ సవరణ సౌకర్యం ప్రారంభ తేదీ | ఏప్రిల్ 24, 2024 |
TS ECET 2024 రిజిస్ట్రేషన్ ఫార్మ్ సవరణ సౌకర్యం చివరి తేదీ | ఏప్రిల్ 28, 2024 |
TS ECET 2024 హాల్ టికెట్ విడుదల తేదీ | మే 1, 2024 |
TS ECET 2024 పరీక్ష తేదీ | మే 6, 2024 |
ఆసక్తిగల అభ్యర్థులు TS ECET 2024 పరీక్షకు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా చెక్ చేయాలి. ఏప్రిల్ 22, 2024 వరకు ఆలస్య రుసుముతో నమోదు చేసుకున్న అభ్యర్థులు రూ.500లు చెల్లించవలసి ఉంటుంది. ఇంకా ఆలస్యమైతే, ఏప్రిల్ 28, 2024 వరకు ఆలస్య రుసుము రూ.1000 చెల్లించాలి. ఈ తేదీ తర్వాత ఆలస్య రుసుముతో లేదా లేని దరఖాస్తులు ఆమోదించబడవు. ఎడిటింగ్ సదుపాయం ఏప్రిల్ 24, 2024న ఓపెన్ అవుతుంది. చివరి నిమిషంలో దరఖాస్తు ఫార్మ్‌లో మార్పులు చేయాలనుకునే దరఖాస్తుదారుల కోసం ఏప్రిల్ 28, 2024 వరకు విండో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులు స్క్రీనింగ్ దశ దాటిన అభ్యర్థులకు హాల్ టికెట్ విడుదల చేయబడుతుంది. పరీక్షకు సంబంధించిన వివరాలను పొందుపరచబడుతుంది. అధికారికంగా ప్రకటించినట్లుగా, TS ECET 2024 మే 6, 2024న నిర్వహించబడుతుంది.
పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో BE/B.Tech/B.Pharm కోర్సుల్లో ప్రవేశానికి అనుమతించబడతారు.