TS LAWCET దరఖాస్తు ఫార్మ్ 2024 విడుదల (TS LAWCET Application Form 2024) : ఉస్మానియా విశ్వవిద్యాలయం TS LAWCET 2024 దరఖాస్తు ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని lawcet.tsche.ac.in సందర్శించవచ్చు. TA LAWCET 2024 పరీక్షకు అభ్యర్థులు ఏప్రిల్ 15, 2024న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు TS LAWCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను మే 25, 2024లోపు ఆలస్య ఫీజుతో సబ్మిట్ చేయవచ్చు. గ్రాడ్యుయేషన్‌లో మొత్తంగా 44.5% శాతం, అంతకంటే ఎక్కువ (రిజర్వ్‌డ్ కేటగిరీకి 41.5%) పొందిన అభ్యర్థులు TS LAWCET దరఖాస్తు ఫార్మ్‌ను పూరించే ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు. షెడ్యూల్ ప్రకారం, TS LAWCET 2024 పరీక్ష జూన్ 3, 2024న నిర్వహించబడుతుంది.
TS LAWCET దరఖాస్తు ఫార్మ్ 2024: దరఖాస్తు చేయడానికి డైరక్ట్ లింక్ (TS LAWCET Application Form 2024: Direct Link to Apply)
TS LAWCET 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి దిగువున ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా వెళ్ళండి. దరఖాస్తు ఫీజును చెల్లించండి.
TS LAWCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి డైరక్ట్ లింక్ |
TS LAWCET దరఖాస్తు ఫార్మ్ 2024 తేదీలు (TS LAWCET Application Form 2024 Dates)
TS LACWCET 2024 దరఖాస్తు ఫార్మ్ ముఖ్యమైన తేదీలను కింది పట్టికలో ఇవ్వడం జరిగింది.
ఈవెంట్స్ | తేదీలు |
---|---|
TS LAWCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి చివరి తేదీ (ఆలస్య ఫీజు లేకుండా) | ఏప్రిల్ 15, 2024 |
TS LAWCET దరఖాస్తు ఫార్మ్ సబ్మిషన్ చివరి తేదీ (ఆలస్య రుసుముతో) | ఏప్రిల్ 25, 2024 (ఆలస్య ఫీజు రూ. 500తో) |
మే 5, 2024 (ఆలస్య ఫీజు రూ. 1000తో) | |
మే 15, 2024 (ఆలస్య ఫీజు రూ. 2000తో) | |
మే 25, 2024 (ఆలస్య ఫీజు రూ. 4000తో) |
TS LAWCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించే ప్రక్రియలో, అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే మరియు క్రియాశీల మొబైల్ నెంబర్, ఈ మెయిల్ చిరునామాను నమోదు చేయాలి, అక్కడ అభ్యర్థులు విజయవంతమైన నమోదు తర్వాత లాగిన్ ఆధారాలను స్వీకరిస్తారు. అలాగే అభ్యర్థులు TS LAWCET దరఖాస్తు ఫారమ్ 2024ను విజయవంతంగా సమర్పించిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవాలని సూచించారు.
TS LAWCET 2024 పరీక్ష తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 21 ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. జాబితా నుండి పరీక్షా కేంద్రాలను జోడించే లేదా తొలగించే హక్కు కన్వీనర్‌కు ఉందని గమనించండి.