TS LAWCET రిజిస్ట్రేషన్ 2024 చివరి తేదీ పొడిగించబడింది (TS LAWCET 2024 Registration Last Date) : ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ TS LAWCET 2024 రిజిస్ట్రేషన్ చివరి తేదీని (TS LAWCET 2024 Registration Last Date) ఏప్రిల్ 25, 2024 వరకు పొడిగించింది (ఆలస్య ఫీజు లేకుండా). TS LAWCET 2024 పరీక్షకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు, అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.in ని సందర్శించి, దరఖాస్తు ఫార్మ్‌ను చివరి తేదీలో లేదా అంతకు ముందు సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు TS LAWCET దరఖాస్తు ఫార్మ్ 2024ను షెడ్యూల్ చేసిన తేదీలోగా పూరించ లేకపోతే రూ. 4000 ఆలస్య రుసుముతో మే 25, 2024లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా విజయవంతంగా నమోదు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే అధికారం TS LAWCET హాల్ టికెట్ 2024ని జారీ చేస్తుంది. ఈ సంవత్సరం, TS LAWCET పరీక్ష జూన్ 3, 2024న నిర్వహించబడుతుంది.
TS LAWCET రిజిస్ట్రేషన్ 2024: దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ (TS LAWCET Registration 2024: Direct Link to Apply)
TS LAWCET 2024 పరీక్షకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు TS LAWCET దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి, దానిని సబ్మిట్ చేయడానికి దిగువున ఇచ్చిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. గమనిక, TS LAWCET దరఖాస్తు ఫార్మ్‌ను నింపే ప్రక్రియ దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రక్రియతో మొదలవుతుందని గమనించండి.
TS LAWCET 2024 దరఖాస్తు రుసుము చెల్లించడానికి డైరక్ట్ లింక్ |
---|
TS LAWCET రిజిస్ట్రేషన్ 2024 తేదీలు (TS LAWCET Registration 2024 Dates)
TS LAWCET 2024 రిజిస్ట్రేషన్ సవరించిన తేదీలను దిగువున ఇచ్చిన పట్టికలో ఇక్కడ చూడండి:
ఈవెంట్స్ | తేదీలు |
---|---|
ఆలస్య రుసుము లేకుండా TS LAWCET దరఖాస్తు ఫీజు చెల్లింపు 2024 చివరి తేదీ | ఏప్రిల్ 25, 2024 |
రూ. 500 ఆలస్య రుసుముతో TS LAWCET రిజిస్ట్రేషన్ చివరి తేదీ | మే 4, 2024 |
రూ. 1000 ఆలస్య రుసుముతో TS LAWCET రిజిస్ట్రేషన్ చివరి తేదీ | మే 11, 2024 |
రూ. 2000 ఆలస్య రుసుముతో TS LAWCET రిజిస్ట్రేషన్ చివరి తేదీ | మే 18, 2024 |
రూ. 4000 ఆలస్య రుసుముతో TS LAWCET రిజిస్ట్రేషన్ చివరి తేదీ | మే 25, 2024 |
TS LAWCET 2024 దరఖాస్తు ఫార్మ్ దిద్దుబాటు | మే 20 నుండి 25, 2024 వరకు |
TS LAWCET హాల్ టికెట్ జారీ | మే 30, 2024 |
TS LAWCET 2024 పరీక్ష | మే 3, 2024 |
అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయకూడదు. లేకపోతే కన్వీనర్ అన్ని దరఖాస్తులను తిరస్కరిస్తారు లేదా ఆ దరఖాస్తు ఫార్మ్‌లో దేనినైనా ఆమోదించవచ్చు. తిరస్కరించబడిన దరఖాస్తు ఫార్మ్‌ల నుంచి దరఖాస్తు ఫీజు జప్తు చేయబడుతుంది.