తెలంగాణ 10వ తరగతి పరీక్ష తేదీలు(TS SSC Time Table 2023) : తెలంగాణ విద్యా శాఖ మంత్రి శ్రీ సబిత ఇంద్రా రెడ్డి గారు 10వ తరగతి పరీక్ష తేదీల సమాచారం అధికారికంగా విడుదల చేశారు. ఈ సమాచారం ప్రకారం తెలంగాణ 10వ తరగతి పరీక్షలు(TS SSC Time Table 2023) 3 ఏప్రిల్ 2023 నుండి 13 ఏప్రిల్ 2023 వరకూ జరగనున్నాయి. 2023 మార్చి నెలలో విద్యార్థులు తమ పాఠశాలల నుండి వారి హాల్ టికెట్ లను పొందవచ్చు. ఈ విద్యా సంవత్సరం పరీక్షా విధానంలో కొన్ని మార్పులు జరిగాయి, గతంలో విద్యార్థులు 11 పేపర్ల కు పరీక్షలు రాయాల్సి ఉండగా ఈ సంవత్సరంలో మాత్రం కేవలం 6 పెపర్లకే పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
క్రింద వివరించబడిన టేబుల్ లో విద్యార్థులు వారి పరీక్ష తేదీలను గమనించవచ్చు.
పైన వివరించబడిన విధంగా ఈ విద్య సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు 6 పేపర్లకు మాత్రమే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రతీ పరీక్షకు ఇచ్చే సమయం 3 గంటలు. జనరల్ సైన్స్ పేపర్ కు ఇచ్చే సమయం 3 గంటల 20 నిమిషాలు. ప్రతీ సబ్జెక్టు కు పాస్ మార్కులు 35.
తెలంగాణ 10వ తరగతి 2022-23 ప్రశ్న పత్రాల బ్లూ ప్రింట్ కూడా త్వరలో విడుదల కానున్నాయి. ప్రశ్న పత్రాల బ్లూ ప్రింట్ ద్వారా పరీక్షలలో ఇచ్చే ప్రశ్నల విధానాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
తెలంగాణ 10వ తరగతి పరీక్షలు(TS SSC Time Table 2023) ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. బోర్డు పరీక్షలకు విద్యార్థులు తప్పని సరిగా తమ హాల్ టికెట్లను తీసుకుని వెళ్ళాలి. విద్యార్థులు పరీక్ష తేదీల సమాచారాన్ని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అధికారిక వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్ bse.telangana.gov.in
తెలంగాణ 10వ తరగతి పరీక్ష విధానం 2023(TS SSC Exam Pattern 2023) , గత సంవత్సర ప్రశ్న పత్రాలు , 10వ తరగతి ఫలితాలు మొదలైన ముఖ్య సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.