వీటీఈఈఈ 2023 పరీక్ష (VITEEE 2023 Exam):
వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షను వెల్లూరు, చెన్నైలో ఉన్న క్యాంపస్‌లతో పాటు భోపాల్, అమరావతిలోని విశ్వవిద్యాలయాల్లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ పరీక్ష (VITEEE 2023 Exam) ఏప్రిల్ 17 నుంచి 23 వరకు జరగనుంది. పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో జరగబోతుంది.
ఈ పరీక్షలో ప్రశ్నలు MCQ ఆధారితంగా ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు 2 గంటల 30 నిమిషాలలో ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి అనుమతించబడతారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వడం జరుగుతుంది. తప్పు సమాధానానికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. VITEEE కోసం అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు, పరీక్ష రోజు పాటించాల్సిన మార్గదర్శకాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
VITEEE 2023: పరీక్ష రోజున అవసరమైన ముఖ్యమైన పత్రాలు (VITEEE 2023: Important Documents Required on Exam Day)
పరీక్ష రోజున అవసరమైన అన్ని పత్రాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయో? లేదో? అభ్యర్థులు చెక్ చేసుకోవాలి. అప్పుడు చివరి నిమిషంలో ఎటువంటి టెన్షన్ లేకుండా అభ్యర్థులు పరీక్ష రాయగలుగుతారు.- హాల్ టికెట్
- ఫోటో గుర్తింపు కార్డు
VITEEE 2023: పరీక్ష రోజు మార్గదర్శకాలు (VITEEE 2023: Exam Day Guidelines)
VITEEE 2023 పరీక్ష రోజు అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాలును ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- అభ్యర్థులు పరీక్షకు కనీసం 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలని సిఫార్సు చేయబడింది.
- పరీక్ష హాలులో కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, మరే ఇతర గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు.
- పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులను హాల్‌లోకి అనుమతించరు.
- అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలో తమ హాల్ టికెట్‌ని చూపించాలి. అధికారులు దానిని ధ్రువీకరించడం జరుగుతుంది.
- ఇన్విజిలేటర్ ముందు హాజరు షీట్‌లో సైన్ ఇన్ చేయాలి..
తెలుగులో మరిన్ని వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి.