VITEEE 2024 దరఖాస్తు చివరి తేదీ (VITEE Application Form 2024) : VIT వెల్లూరు VITEEE 2024 దరఖాస్తును (VITEE Application Form 2024) చేసుకోవడానికి మార్చి 31, 2024న చివరి తేదీ. VITEEE 2024 పరీక్షకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ viteee.vit.ac.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీకి ముందు దరఖాస్తును విజయవంతంగా సబ్మిట్ చేసే అభ్యర్థుల కోసం అధికారం VITEEE 2024 అడ్మిట్ కార్డులను విడుదల చేస్తుంది. అధికారం VITEEE 2024 పరీక్ష అధికారిక తేదీని నిర్ధారించ లేదు. తాత్కాలిక VITEEE పరీక్ష తేదీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడింది. షెడ్యూల్ ప్రకారం, VITEEE 2024 పరీక్ష ఏప్రిల్ 19 నుంచి 30, 2024 వరకు నిర్వహించబడుతుంది. అధికారిక, ధ్రువీకరించబడిన పరీక్ష తేదీ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడుతుంది.
VITEEE 2024 దరఖాస్తు ఫార్మ్: దరఖాస్తు చేయడానికి నేరుగా లింక్ (VITEEE 2024 Application Form: Direct Link to Apply)
అభ్యర్థులు ఇక్కడ VITEEE 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి దిగువున ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా వెళ్ళవచ్చు.
VITEEE 2024 దరఖాస్తు : అప్‌లోడ్ చేయాల్సిన పత్రాల స్పెసిఫికేషన్‌లు (VITEEE 2024 Application Form: Specifications of Documents to Upload)
VITEEE 2024 దరఖాస్తు ఫార్మ్ ఫిల్ చేసే ప్రక్రియలో అభ్యర్థులు స్పెసిఫికేషన్‌ల ప్రకారం ఫోటోగ్రాఫ్‌లు, సంతకాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫోటో:
- అభ్యర్థులు ఫోట బ్రైట్‌గా ఉ ండాలి. తెలుపు/ఆఫ్-వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి.
- ఫోటోలో ముఖాన్ని వంచకుండా క్లిక్ చేయాలి, రెండు చెవులు కనిపించేలా చేయాలి, కళ్లు తెరిచి ఉండాలి. తెరవాలి
- అభ్యర్థులు గ్లేర్/ కళ్లద్దాలు ధరించి ఫోటోను క్లిక్ చేయకూడదు
- ఫోటోగ్రాఫ్‌లను JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫోటో సైజ్ 20 KB నుంచి 300 KB మధ్య ఉండాలి
- ఫోటో కొలతలు ఎత్తు (400 నుంచి 550 పిక్సెల్‌లు), వెడల్పు (300 నుంచి 400 పిక్సెల్‌లు) ఉండాలి.
- అభ్యర్థుల ఫోటో చాలా ప్రకాశవంతంగా లేదా చాలా చీకటిగా ఉండకూడదు
సంతకం:
- అభ్యర్థులు A4 తెల్ల కాగితంపై దీర్ఘచతురస్రాకార పెట్టెను (పరిమాణం 6 సెం.మీ X 2 సెం.మీ.) గీయాలి. తర్వాత ముదురు నీలం లేదా నలుపు పెన్నుతో సంతకం చేయండి
- సంతకం స్కాన్ చేసిన కాపీని JPEG ఆకృతిలో అప్‌లోడ్ చేయాలి
- సంతకం ఫోటో 20 KB, 300 KB లోపల ఉండాలి
- సంతకం సైజ్ 3.5 cm X 1.5 cm ఉండాలి.