VITEEE 2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల (VITEEE Result 2023 Released): VITEEE ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. VIT విశ్వవిద్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో VITEEE రిజల్ట్స్‌ని (VITEEE Result 2023 Released) 2023ని విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు viteee.vit.ac.inలో యాక్టివేట్ చేయబడిన లింక్ నుంచి స్కోర్‌కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. VIT ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష ఏప్రిల్ 17 నుంచి 23, 2023 వరకు నిర్వహించబడింది.
VITEEE రిజల్ట్స్ 2023 లింక్ (VITEEE Result 2023 Link)
VITEEE రిజల్ట్స్ 2023 ఆన్‌లైన్‌లో మాత్రమే చెక్ చేసుకోవాలి. అభ్యర్థుల సౌలభ్యం కోసం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ viteee.vit.ac.inలో యాక్టివేట్ చేయబడింది.
VITEEE రిజల్ట్స్ 2023 లింక్ – Click here |
---|
VITEEE ఫలితం 2023: స్టెప్స్ ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి (VITEEE Result 2023: Steps to Check the Result)
విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. వెబ్‌సైట్‌లో VITEEE స్కోర్‌కార్డ్ 2023ని చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ PDFని డౌన్‌లోడ్ చేయడానికి ఈ దిగువన తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.
- ముందుగా అభ్యర్థులు VIT, వెల్లూరు అధికారిక వెబ్‌సైట్ www.viteee.vit.ac.inని సందర్శించాలి.
- హోమ్‌పేజీలో 'VIT Engineering Entrance Examination 2023 Result' అనే లింక్‌పై క్లిక్ చేయాలి
- 'లాగిన్' పేజీలో అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, 'సబ్మిట్' బటన్‌ను క్లిక్ చేయాలి.
- తర్వాత VITEEE రిజల్ట్స్ 2023ని PDF ఫార్మాట్‌లో కొత్త ట్యాబ్‌లో చూడొచ్చు.
- 'Ctrl+F' కీతో మీ హాల్ టికెట్ నెంబర్, స్థితిని చెక్ చేసుకోవాలి.
- తర్వాత PDFని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయాలి
- భవిష్యత్తు సూచన కోసం రిజల్ట్స్ కాపీని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
VITEEE స్కోర్‌కార్డ్ 2023లో ఉండే వివరాలు (Details Mentioned in VITEEE Scorecard 2023)
VITEEE స్కోర్‌కార్డ్ 2023లో ఈ కింద తెలిపిన వివరాలు ఉంటాయి. రిజల్ట్స్ PDF కాపీని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులందరూ జాగ్రత్తగా ఆ వివరాలను చెక్ చేసుకోవాలి.
అభ్యర్థి పేరు
జెండర్
కేటగిరి
VTE హాల్ టికెట్ నెంబర్
అభ్యర్థి పొందిన మార్కులు
అభ్యర్థి సాధించిన ర్యాంక్
అర్హత స్థితి
ఈ సంవత్సరం VIT ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షకు సుమారు 2 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. VITEEE ఫలితం 2023 ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు రెండు దశల్లో నిర్వహించబడే కౌన్సెలింగ్ ప్రక్రియకు అర్హులు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి.