AP EAMCET Colleges for 5000 to 10,000 Rank: AP EAMCET 2024లో 5000 నుంచి 10,000 ర్యాంక్ కోసం B.Tech CSE కాలేజీల లిస్ట్ ఇదే
మీరు AP EAMCET 2024లో 5000 నుంచి 10,000 ర్యాంక్ సాధించారా? అభ్యర్థులు AP EAMCET 2024లో 5000 నుంచి 10,000 ర్యాంక్ (AP EAMCET Colleges for 5000 to 10,000) కోసం B.Tech CSE కాలేజీల జాబితాని ఇక్కడ చెక్ చేయవచ్చు.
AP EAMCET 2024లో 5000 నుంచి 10,000 ర్యాంక్ కోసం B.Tech CSE కాలేజీల జాబితా (AP EAMCET Colleges for 5000 to 10,000): AP EAMCET 2024లో 5000 నుండి 10,000 ర్యాంక్ సాధించారా? 5000 నుంచి 10,000 ర్యాంక్ పొందిన అభ్యర్థులు AP EAMCET కాలేజీల్లో అడ్మిషన్ పొందడానికి నిర్దిష్ట అర్హత ప్రమాణాలకి అర్హత సాధించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా AP EAMCET ఉత్తీర్ణత మార్కులు, ఇతర AP EAMCET 2024 అర్హత ప్రమాణాలని క్లియర్ చేసి ఉండాలి. AP EAMCET ఉత్తీర్ణత మార్కులు జనరల్ కేటగిరికి 25 శాతం, ఇది AP EAMCET 2024 Examలో 160 మార్కుల్లో 40 మార్కులకి సమానం. అధికారుల ప్రకారం, SC/ST అభ్యర్థులకు AP EAMCET అర్హత మార్కులు కోసం అటువంటి ప్రమాణాలు లేవు. ఈ ఆర్టికల్లో మేము AP EAMCET 2024లో 5000 నుంచి 10,000 ర్యాంకుల కోసం B.Tech CSE కాలేజీల జాబితాని అందించాం.
ఇది కూడా చదవండి: ఈరోజే ఏపీ ఎంసెట్ బైపీసీ సీట్ల కేటాయింపు జాబితా రిలీజ్, ఇలా ఒక క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఎంసెట్‌లో 5000 నుంచి 10,000 ర్యాంకులను పొందిన అభ్యర్థులు బీటెక్‌లో అడ్మిషన్లు పొందడానికి మంచి కళాశాలలు ఉన్నాయి. ఆ కాలేజీలకు సంబంధించిన వివరాలను అభ్యర్థులు ముందుగానే తెలుసుకుని ఉండాలి. అదే సమయంలో ఆ కాలేజీల ఓపెనింగ్ ర్యాంక్, ముగింపు ర్యాంకుల వివరాలను కూడా ఇక్కడ తెలియజేస్తున్నాం. అభ్యర్థులు ఈ వివరాలతో తమకొచ్చిన ర్యాంకులతో ఏ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చో అంచనా వేసుకోవచ్చు.
AP EAMCETలో 5000 నుంచి 10,000 ర్యాంక్ కోసం B.Tech CSE కాలేజీలు (B.Tech CSE Colleges for Rank 5000 to 10,000 in AP EAMCET)
AP EAMCET 2024 పరీక్షలో ర్యాంక్ సాధించిన అభ్యర్థులు AP EAMCET 2024లో 5000 నుంచి 10,000 ర్యాంక్ కోసం B.Tech CSE కాలేీజీల జాబితాని పరిశీలించవచ్చు. ఇది ప్రారంభ, ముగింపు ర్యాంక్ ఆధారంగా ఉంటుంది. మునుపటి సంవత్సరం కటాఫ్. సంబంధిత సంస్థల కోసం AP EAMCET 2024 కటాఫ్ ఇంకా విడుదల కాలేదు.
కళాశాల/ఇన్‌స్టిట్యూట్ పేరు | ఓపెనింగ్ ర్యాంక్ | క్లోజింగ్ ర్యాంక్ |
వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | 6,142 | 1,29,340 |
JNTUK ఇంజనీరింగ్ కాలేజ్, నర్సారావు పేట | 6,207 | 75,362 |
జీపీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ | 5,015 | 1,22,310 |
జీఎమ్మార్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ | 5,276 | 92,791 |
విష్ణు గ్రూప్ ఇనిస్టిట్యూషన్స్, విష్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | 4,384 | 1,31,172 |
ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ | 5,348 | 66,556 |
ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | 6,204 | 1,27,899 |
ANU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ | 10,414 | 70,263 |
ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ | 6,994 | 1,22,457 |
మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | 9,586 | 29,353 |
RGMCET కర్నూలు - రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | 9,957 | 19,629 |
శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల, తిరుపతి (SVEC తిరుపతి) - స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మోహన్ బాబు విశ్వవిద్యాలయం | 10,000 | 10,511 |
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమండ్రి | 7,192 | 19,741 |
AP EAMCET కటాఫ్ సంబంధిత కథనాలు,
AP EAMCET లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ కోసం ప్రసిద్ధ B.Tech కాలేజీల జాబితా (List of famous B.Tech colleges for direct admission without AP EAMCET)
పరీక్షలో సాధించిన ర్యాంక్‌తో AP EAMCETలో పాల్గొనే కాలేజీల్లో అడ్మిషన్ తక్కువ స్కోర్లు లేదా ప్రయత్నించని పరీక్షల కారణంగా అభ్యర్థులకు కొంచెం కఠినంగా ఉంటుంది. ఒక అభ్యర్థి తక్కువ స్కోర్ చేసినా లేదా AP EAMCET పరీక్షకు అర్హత సాధించకపోయినా దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేనేజ్‌మెంట్ కోటా ద్వారా అభ్యర్థులకు అడ్మిషన్ అందించే అనేక కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. AP EAMCET లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ కోసం జనాదరణ పొందిన B.Tech కళాశాలల జాబితా వారి సుమారు సగటు కోర్సు ఫీజుతో ఈ దిగువన టేబుల్లో జాబితా చేయడం జరిగింది.
కళాశాల పేరు | సుమారు సగటు కోర్సు ఫీజు |
DRK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | సంవత్సరానికి రూ.55,000 |
శ్రీ మిటపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | సంవత్సరానికి రూ. 89,000నరసరావుపేట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
ఉన్నత విద్య కోసం ICFAI ఫౌండేషన్ | సంవత్సరానికి రూ. 2,50,000 |
నరసరావుపేట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | సంవత్సరానికి రూ. 50,000 - 89,000 |
KL యూనివర్సిటీ, గుంటూరు | సంవత్సరానికి రూ. 1,15,000 - 2,75,000 |
సెంచూరియన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ | సంవత్సరానికి రూ. 95,000 - 1,48,000 |
నరసరావుపేట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ | సంవత్సరానికి రూ.50,300 |
శ్రీ వాణి ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ | సంవత్సరానికి రూ.50,500 |
GITAM విశ్వవిద్యాలయం | సంవత్సరానికి రూ.2,22,200 - 3,29,500 |
విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ మరియు రీసెర్చ్ (యూనివర్శిటీగా పరిగణించబడుతుంది) (VFSTR) | సంవత్సరానికి రూ.1,20,000 నుంచి రూ.2,80,000 |
మీ AP EAMCET స్కోర్‌ల ఆధారంగా మీ ర్యాంక్‌లు మరియు కళాశాలలను నిర్ణయించడానికి, మీరు దిగువ ఇచ్చిన లింక్‌ల నుండి మా AP EAMCET ర్యాంక్ ప్రిడిక్టర్, కాలేజీ ప్రిడిక్టర్‌ని ఉపయోగించవచ్చు.
AP EAMCET ఫలితం 2024 (AP EAMCET Result 2024)
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ AP EAMCET 2024 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ets.apsche.ap.gov.in 2024లో APSCHE తరపున విడుదల చేస్తుంది. పరీక్ష అనంతరం ఏపీ ఎంసెట్ ఫలితాలు, ఆన్సర్ కీని విడుదల చేస్తుంది. అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో వీక్షించడానికి వారి హాల్ టికెట్ నెంబర్ అవసరం అవుతుంది. అభ్యర్థి ర్యాంకులకు సంబంధించి అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు విశ్వవిద్యాలయం SMSని పంపించదు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌తో ఆన్‌లైన్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. తమకొచ్చిన ర్యాంకులు, కటాఫ్ ఆధారంగా అభ్యర్థుల ఏ కాలేజీల్లో సీటు పొందగలరో అంచనా వేసుకోవచ్చు.
AP EAMCET ర్యాంక్ వైజ్ కాలేజీల కథనాలు,
AP EAMCET 2024లో మరిన్ని కథనాలు, అప్‌డేట్‌ల కోసం కాలేజ్‌దేఖోతో చూస్తూ ఉండండి!