TSPSC 2024 అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష పూర్తి సిలబస్ మరియు సరళి (TSPSC Agriculture Officer Syllabus and Exam Pattern)
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ సిలబస్ 2024 (TSPSC Agriculture Officer Syllabus 2024) మరియు పరీక్ష సరళి గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ సిలబస్ (TSPSC Agriculture Officer Syllabus 2024 in Telugu) : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది . ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల కాబట్టి ఈ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టు కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏ మాత్రం రాజీ పడకుండా ఉండాలి. TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి సిలబస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అభ్యర్థులు TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ సిలబస్ మరియు పరీక్ష సరళి గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం TSPSC ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నది. TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2024 కూడా మే 2024 నెలలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. ఈ పరీక్షకు అప్లై చేసే అభ్యర్థులు ముందునుండే సరైన ప్రిపరేషన్ ప్లాన్ కలిగి ఉండడం అవసరం, అలాగే TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ సిలబస్ (TSPSC Agriculture Officer Syllabus 2024) గురించి కూడా సరైన అవగాహన కలిగి ఉండాలి.
సంబంధిత కథనాలు
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ సిలబస్ 2024 PDF డౌన్లోడ్ ( TSPSC Agriculture Officer Syllabus 2024 PDF Download)
అభ్యర్థులు ఈ క్రింద అందించిన లింక్ ద్వారా TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ సిలబస్ 2024 PDF ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ సిలబస్ 2024 PDF డౌన్లోడ్ - ఇక్కడ క్లిక్ చేయండి. |
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష విధానం 2024 ( TSPSC Agriculture Officer Exam Pattern 2024)
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష విధానం 2024 గురించిన పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
పేపర్ టైప్ | మొత్తం ప్రశ్నలు | సమయం | మొత్తం మార్కులు |
పేపర్ 1 - జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 150 | 150 నిమిషాలు | 150 |
పేపర్ 2 - డిగ్రీ స్థాయి అగ్రికల్చర్ | 150 | 150 నిమిషాలు | 300 |
పైన వివరించిన విధంగా TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష రెండు పేపర్లు గా నిర్వహిస్తారు. పేపర్ 1 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్ కు కేటాయించిన సమయం 150 నిమిషాలు. పేపర్ 1 లో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించబడింది.
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పేపర్ 2 డిగ్రీ స్థాయి అగ్రికల్చర్ సిలబస్ ఆధారంగా ఉంటుంది. పేపర్ 2 లో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. పేపర్ 1 మరియు పేపర్ 2 కలిపి మొత్తం మార్కులు 450.
ఇది కూడా చదవండి - TSPSC డిగ్రీ లెక్చరర్ సిలబస్
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ సిలబస్ 2024 (TSPSC Agriculture Officer Syllabus 2024)
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ సిలబస్ ను క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
పేపర్ | సిలబస్ |
|
|
|
|
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష 2024 సమాచారం ( TSPSC Agriculture Officer Exam 2024 Important Details)
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష 2024 గురించిన సమాచారం ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.పరీక్ష పేరు | TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష 2024 |
నిర్వహణ సంస్థ | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష తేదీ | తెలియాల్సి ఉంది. |
అధికారిక వెబ్సైట్ | tspsc.gov.in |
TSPSC పరీక్షల గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
Get Help From Our Expert Counsellors
FAQs
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షలో మొత్తం ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షలో మొత్తం 300 ప్రశ్నలకు సమాధానం వ్రాయాల్సి ఉంటుంది.
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహించబడుతుంది?
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష 450 మార్కులకు నిర్వహించబడుతుంది.
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ 2024 పరీక్ష సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ 2024 పరీక్ష సిలబస్ ను ఈ పేజీలో ఉన్న PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.