GATE 2025 ఫలితాల లింక్‌ (GATE Result Link 2025)

Rudra Veni

Updated On: March 19, 2025 02:50 PM

GATE 2025 ఫలితాలు అతి త్వరలో విడుదలకానున్నాయి. గేట్ 2025 డౌన్‌లోడ్ లింక్‌ని (GATE Result Link 2025) ఈ పేజీలో అందిస్తాం. ఫలితాలు విడుదలైన వెంటనే  ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది. 
 
GATE 2025 ఫలితాల లింక్‌ (GATE Result Link 2025)

GATE ఫలితాల లింక్ 2025 (GATE Result Link 2025) : అధికారిక సమాచార బులెటిన్ ప్రకారం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), రూర్కీ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2025 ఫలితాలను మార్చి 19న ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు GOAPS (GATE ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్) పోర్టల్ ద్వారా తమ స్కోర్‌లను ఇక్కడ చెక్ చేయవచ్చు. అదనంగా GATE 2025 స్కోర్‌కార్డ్ మార్చి 28 నుంచి మే 31 వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వడం ద్వారా వారి స్కోర్‌కార్డ్‌లను పొందవచ్చు. గడువు తేదీని మిస్ అయిన వారు, పరీక్ష పేపర్‌కు రూ.500 ఫీజు చెల్లించి డిసెంబర్ 31 వరకు స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

GATE 2025 ఫలితాల డౌన్‌లోడ్ లింక్ (GATE Result Link 2025)

గేట్ 2025 ఫలితాల ముఖ్యాంశాలు (GATE 2025 Result Highlights)

GATE ఫలితం 2025 చాలా మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. GATE 2025 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు భారతదేశంలోని వివిధ అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో MTech ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందుతారు. దాంతోపాటు చాలా మంది విద్యార్థులు అద్భుతమైన కెరీర్ వృద్ధిని అందించే PSUలలో సురక్షితమైన ఉద్యోగాలకు అర్హులు అవుతారు. GATE ఫలితం 2025 గురించి ముఖ్యమైన విషయాల గురించి ఈ దిగువున పట్టికలో అందించాం.

గేట్ ఫలితం 2025 ముఖ్యాంశాలు

వివరాలు

వివరాలు

ఫలితాల ప్రకటన తేదీ

మార్చి 17, 2025

ఫలితం  స్థితి

విడుదలైంది

ఎక్కడ చెక్ చేయాలి?

అప్‌డేట్ చేయబడుతుంది

లాగిన్ ఆధారాలు

గేట్ రిజిస్ట్రేషన్ ఐడీ/ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్

లభ్యత GATE స్కోర్‌కార్డ్

అప్‌డేట్ చేయబడుతుంది

గేట్ 2025 ఫలితాల చెల్లుబాటు

ఫలితాల ప్రకటన తేదీ నుండి 3 సంవత్సరాలు

గేట్ ఫలితం 2025 ఉపయోగం
  • IIT COAPS ద్వారా IIT M.Tech ప్రవేశం
  • గేట్ ద్వారా PSU నియామకాలు
  • CCMT ద్వారా NIT/IIT M.Tech ప్రవేశాలు
గత సంవత్సరాలలో గేట్ దరఖాస్తుదారుల మొత్తం సంఖ్య
  • గేట్ 2023 దరఖాస్తుదారులు: 6.70 లక్షలు
  • గేట్ 2021 దరఖాస్తుదారులు- 711542
  • గేట్ 2020 దరఖాస్తుదారులు- 913275

GATE 2025 స్కోర్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download GATE 2025 Scorecard)

GATE 2025 స్కోర్ కార్డును ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • అధికారిక గేట్ వెబ్‌సైట్‌ను  gate2025.iitr.ac.in సందర్శించాలి.
  • హోంపేజీలో ప్రదర్శించబడే గేట్ ఫలితం 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ లాగిన్ ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
  • కొనసాగడానికి 'సమర్పించు' పై క్లిక్ చేయాలి.
  • గేట్ 2025 స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • భవిష్యత్తు సూచన కోసం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

గేట్ 2025 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? (How to Check GATE Result 2025?)

IISc బెంగళూరు GATE 2025 ఫలితాన్ని ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేస్తుంది. అర్హత సాధించిన GATE కటాఫ్‌ను పొందిన మార్కులు, అభ్యర్థుల వివరాలతో పాటు ప్రస్తావిస్తారు. చివరి GATE ఆన్సర్ కీ 2025 ఉపయోగించి లెక్కించిన మార్కుల ఆధారంగా ఫలితం పబ్లిష్ చేయబడుతుంది. అభ్యర్థులు తమ GATE ఫలితాలను చెక్ చేసుకునే విధానం  ఇక్కడ అందించాం.

స్టెప్ 1 - ముందుగా అభ్యర్థులు GOAPS పోర్టల్‌కి వెళ్లాలి.

స్టెప్ 2 - గేట్ రిజిస్ట్రేషన్ ఐడీ/ఈమెయిల్ చిరునామా/ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 3 - 'GATE ఫలితం 2025' లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 4 - గేట్ 2025 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్ 5 - భవిష్యత్తు సూచన కోసం ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.

గేట్ ఫలితం 2025లో ఉండే వివరాలు (Details Mentioned on GATE Result 2025)

GATE 2025 ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి. అభ్యర్థులు తమ పేరు,  రోల్ నెంబర్ సరిగ్గా పేర్కొనబడ్డాయో లేదో ఫలితం తమకు మాత్రమే చెందుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ కింద ఇవ్వబడిన GATE 2025 ఫలితంలో పేర్కొన్న వివరాలను పరిశీలించండి.

  • అభ్యర్థి పేరు

  • గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్

  • పొందిన మార్కులు (100 లో)

  • గేట్ స్కోరు (1000కి)

  • ALI ఇండియా ర్యాంక్ (AIR)

  • గేట్ పరీక్షా పత్రం, కోడ్

  • గేట్ 2025 అర్హత మార్కులు


గమనిక - GATE ఫలితంలో పేర్కొన్న వివరాలతో ఏదైనా వ్యత్యాసం ఉంటే, అభ్యర్థులు జోనల్ IITని సంప్రదించి సవరణ చేయించుకోవాలి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/gate-result-link-2025-iit-roorke-to-activate-gate-scores-soon/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All