- జేఈఈ మెయిన్ గురించిన సమాచారం (About JEE Main)
- జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ముఖ్యమైన అధ్యాయాలు (Important Chapters for JEE …
- జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ టాపిక్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ - మార్కుల ఆధారంగా …
- జేఈఈ మెయిన్ 2024 ప్రిపరేషన్ టిప్స్ ( JEE Main 2024 Preparation …
- జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ రివిజన్ ప్లాన్ (JEE Main 2024 Revision …
- Faqs
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ లాస్ట్ మినిట్ రివిజన్ ప్లాన్ ( JEE Main 2024 Physics Last Minute Revision Plan) : జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో విద్యార్థులు బాగా కష్టంగా భావించేది ఫిజిక్స్ సబ్జెక్ట్. అదే సమయంలో ఫిజిక్స్ చాలా ముఖ్యమైన సబ్జెక్టు కూడా. ఫిజిక్స్ సబ్జెక్టు లో ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం సులభమైన పని, కానీ ప్రశ్నలను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడానికి విద్యార్థులు ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో ఫిజిక్స్ ప్రశ్నలు కష్టంగా ఉంటాయి అని నిపుణుల అభిప్రాయం. గత సంవత్సరం ప్రశ్న పత్రాలలో కూడా ఫిజిక్స్ సబ్జెక్టు కు సంబంధించిన ప్రశ్నలు కష్టంగానే ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 పరీక్షలలో ఫిజిక్స్ (JEE Main 2024 Physics) సబ్జెక్టు కోసం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు కోసం ఎలా రివిజన్ చేయాలి అని విద్యార్థులు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE Main 2024 రెండు సెషన్‌ల కోసం డిసెంబర్ 2023 నెలలో అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. JEE మెయిన్ 2024 పరీక్ష కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు JEE మెయిన్ 2024 రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్ మోడ్‌లో పూర్తి చేయాలి. ఇంటర్మీడియట్ అర్హత పొందిన లేదా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు అవుతున్న అభ్యర్థులు JEE మెయిన్‌కు హాజరు కావచ్చు. ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ తో పాటు అదనంగా, NTA JEE మెయిన్ పరీక్ష 2024 ప్రిపరేషన్ కోసం మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు మరియు JEE మెయిన్ సిలబస్ని చూడండి. సిలబస్తో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా JEE మెయిన్ 2024 పరీక్షా విధానం గురించి కూడా తెలుసుకోవాలి. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకోవడానికి JEE మెయిన్ శాంపిల్ పేపర్, మాక్ టెస్ట్ మరియు ప్రశ్నా పత్రాలను కూడా చూడాలి
JEE Main 2024 పరీక్ష తేదీలు | NEET 2024 సిలబస్ |
---|
జేఈఈ మెయిన్ గురించిన సమాచారం (About JEE Main)
భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( JEE Main) వ్రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల్లో మరియు యూనివర్సిటీలలో అడ్మిషన్ దొరుకుతుంది. కాబట్టి విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 కు శ్రద్ధగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల కోసం గత సంవత్సర ప్రశ్న పత్రాల ఆధారంగా అత్యధిక వేయిటేజీ ఇచ్చే చాప్టర్ ల జాబితా రూపొందించాం. అయితే దీని అర్థం మిగతా చాప్టర్ లను నిర్లక్ష్యం చేయమని కాదు అని విద్యార్థులు గమనించాలి.
ఇది కూడా చదవండి:
JEE అడ్వాన్స్‌డ్ కోసం JEE మెయిన్ 2024 కటాఫ్
ఇది కూడా చదవండి -
JEE మెయిన్ 2024 కోసం ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ కావాలి?
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ముఖ్యమైన అధ్యాయాలు (Important Chapters for JEE Main Physics 2024)
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు సుమారు 21 చాప్టర్ లు కలిగి ఉంది. వాటిలో నుండి ముఖ్యమైన చాప్టర్ ల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
- Mechanics
- Oscillations And Waves
- Rotational Motion
- Electrostatics
- Atoms And Nuclei
- Current Electricity
- Magnetic effect of Current and Magnetism
ఈ క్రింది అంశాలను కూడా విద్యార్థులు గమనించాలి.
- Oscillations and Waves కు సంబందించిన చాప్టర్ నుండి అత్యధిక ప్రశ్నలు అడుగుతున్నారు, మొత్తం ప్రశ్నల్లో 10% ఈ అంశాల కు సంబంధించినవి.
- కాబట్టి విద్యార్థులు పైన వివరించిన చాప్టర్ లకు సంబంధించిన టాపిక్స్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి.
- ఈ చాప్టర్ లు పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం సులభంగా ఉండే Units and Dimensions, Error Measurement, and Vectors చాప్టర్ లు ప్రిపేర్ అవ్వాలి.
- ప్రతీ చాప్టర్ లో ఉండే కాన్సెప్ట్ లను అర్థం చేసుకోవాలి.
- పైన చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ అయితే మీరు మంచి స్కోరు సాధించే అవకాశం ఉంది.
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ టాపిక్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ - మార్కుల ఆధారంగా (JEE Mains 2024 Physics Topic-Wise Distribution - Based on Marks)
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు లో ఒకొక్క టాపిక్ కు ఉండే వేయిటేజీ గురించిన స్పష్టమైన అవగాహన మీకు ఉంటే మంచి స్కోరు సాధించడం చాలా సులభం. జేఈఈ మెయిన్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం CollegeDekho టాపిక్ వైజ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ను క్రింద అందించింది.
జేఈఈ మెయిన్ ఫిజిక్స్
Basic concepts: (1 mark each)
- Units and Dimensions
- Vectors
- Measurement of Errors
Fundamental concepts: (2 marks each)
- Kinematics
- Friction
- Newton’s Laws of Motion
JEE Main Physics Important concepts: (2-3 marks each)
- Centre of Mass, Momentum, and Collision
- Rotational Dynamics
- Simple Harmonic Motion
- Fluid Mechanics
- Wave Motion and String Waves
- Magnetism
- Heat & Thermodynamics
- Nuclear Physics
- Modern Physics
Easy and Scoring Concepts
- Work, Energy and Power
- Electrostatics
- Current Electricity
- Wave Optics
- Ray Optics
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ టాపిక్ ప్రకారంగా వేయిటేజీ (JEE Mains 2024 Physics Topic-wise Weightage)
TOPIC | NUMBER OF QUESTIONS | WEIGHTAGE (MARKS) |
---|---|---|
Electromagnetics Induction | 1 | 4 |
Solids and Fluids | 1 | 4 |
Waves | 1 | 4 |
Work, Power, and Energy | 1 | 4 |
Gravitation | 1 | 4 |
Simple Harmonic Motion | 1 | 4 |
Unit, Dimension, and Vector | 1 | 4 |
Kinematics | 1 | 4 |
Laws of Motion | 1 | 4 |
Centre Of Mass, Impulse, and Momentum | 1 | 4 |
Rotation | 1 | 4 |
Magnetics | 2 | 8 |
Heat and Thermodynamics | 3 | 12 |
Current Electricity | 3 | 12 |
Electrostatics | 3 | 12 |
Optics | 3 | 12 |
Modern Physics | 5 | 20 |
JEE మెయిన్స్ 2024 ఉత్తీర్ణత మార్కులు | JEE మెయిన్స్ ప్రిపరేషన్ టిప్స్ |
---|---|
JEE మెయిన్స్ 2024 మార్కులు vs ర్యాంక్ | JEE మెయిన్స్ ప్రాక్టీస్ పేపర్లు |
జేఈఈ మెయిన్ 2024 ప్రిపరేషన్ టిప్స్ ( JEE Main 2024 Preparation Tips)
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు
- రివిజన్ స్టార్ట్ చేసే ముందు విద్యార్థులు బేసిక్స్, మరియు ఫార్ములాల మీద అవగాహన కలిగి ఉండాలి.
- జేఈఈ మెయిన్ 2024 సిలబస్ మొత్తం పూర్తి చేయాలి, ఎందుకంటే విద్యార్థులకు వచ్చే ఒక్క మార్కు కూడా వారి రాంక్ లలో చాలా తేడా వచ్చేలా చేస్తుంది.
- NCERT పుస్తకాలలో జేఈఈ సిలబస్ పూర్తి చేసిన తర్వాత ఆ టాపిక్ ల గురించి మిగతా పుస్తకాలలో మరింత లోతుగా అధ్యయనం చేయండి.
సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండండి
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 ప్రిపేర్ అవ్వడానికి ముందు వారి సిలబస్ గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టాపిక్ ప్రకారంగా జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ (JEE Main Physics Preparation by Topic)
- విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 లో టాపిక్ ప్రకారంగా వచ్చే ప్రశ్నల వేయిటేజీ తెలుసుకోవడానికి గత సంవత్సర ప్రశ్న పత్రాలను పరిశీలించాలి.
- ప్రతీ టాపిక్ కు ఉన్న వేయిటేజీ ను బట్టి వారి టైం టేబుల్ ను ప్రిపేర్ చేసుకోవాలి.
వేగంగా సమాధానాలు వ్రాయడం అలవాటు చేసుకోవాలి
జేఈఈ మెయిన్ 2024 పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పరీక్ష సమయం లాగా అన్ని ప్రశ్నలకి సమాధానాలు వ్రాయాలి అంటే విద్యార్థులు వేగంగా ఉండాలి. కాబట్టి విద్యార్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేస్తూ ఉంటే వారి వేగం కూడా పెరుగుతుంది.
సబ్జెక్టు ప్రకారంగా మాక్ పరీక్షలు వ్రాయండి.
జేఈఈ మెయిన్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాక్ టెస్ట్ లు వ్రాయడం చాలా అవసరం, మాక్ టెస్ట్ ల ఆధారంగా విద్యార్థులు వారి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. ఎక్కువ సమయం పట్టే ప్రశ్నలు మరియు టాపిక్ లను గుర్తించి వాటి కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. మాక్ టెస్ట్ లు వ్రాయడం వల్ల విద్యార్ధులకు రివిజన్ పూర్తి అవుతుంది మరియు వేగం కూడా పెరుగుతుంది.
ఖచ్చితమైన సమాధానాలు
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం కంటే , వ్రాసే సమాధానాలు సరైనవి వ్రాయాలి ఇలా వ్రాయడం వలన విద్యార్థుల స్కోరు పెరుగుతుంది. దాని ద్వారా విద్యార్థి రాంక్ కూడా మంచిగా వస్తుంది. ఒకవేళ విద్యార్థులు సమాధానాలు తప్పుగా రాస్తే మైనస్ మార్కులు ఇవ్వబడతాయి.
వారానికి ఒకసారి రివిజన్ చేయండి
విద్యార్థులు వారి కోసం రూపొందించుకున్న టైం టేబుల్ ను ఫాలో అవుతూ పూర్తి చేసిన టాపిక్ లను రోజుకు ఒకసారి మరియు వారానికి ఒకసారి రివిజన్ చేసుకోవాలి.
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ రివిజన్ ప్లాన్ (JEE Main 2024 Revision Plan for Physics)
జేఈఈ మెయిన్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఫిజిక్స్ కొంచెం కష్టమైన సబ్జెక్టు. అయితే విద్యార్థులు సరిగా ప్రిపేర్ అయితే ఈ సబ్జెక్టు లో కూడా మంచి స్కోరు సాధించవచ్చు. ఫిజిక్స్ సబ్జెక్టు రివిజన్ చేస్తున్న సమయంలో విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
- విద్యార్థులు టాపిక్స్ ను బట్టీ పట్టే విధానంలో కాకుండా ఫార్ములాలు లేదా సూత్రాలను అర్థం చేసుకోవాలి.
- న్యూమరికల్ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి.
- ప్రతీ రోజూ చదివిన టాపిక్ ను మళ్ళీ రివిజన్ చేసుకోవాలి.
- విద్యార్థులు ప్రిపేర్ అయ్యే సమయంలో షార్ట్ నోట్స్ వ్రాసుకొవడం అలవాటు చేసుకోవాలి.
- విద్యార్థులు ఆన్లైన్ లో మొబైల్ లేదా లాప్టాప్ లో గత సంవత్సర ప్రశ్న పత్రాలను ప్రిపేర్ అవ్వడం కంటే ఆఫ్లైన్ లో ప్రిపేర్ అవ్వడం వలన డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు.
- ప్రశ్నలకు సమాధానాలు వ్రాసే ముందు ప్రశ్నను బాగా అర్థం చేసుకోవాలి,
- ఫిజిక్స్ లో న్యూమరికల్ ప్రశ్నలు లభించే పుస్తకాలు కూడా రిఫరెన్స్ తీసుకోవాలి.
- సిలబస్ మొత్తం పూర్తి చేసిన తర్వాత రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ఒక మాక్ టెస్ట్ వ్రాయడం చాలా అవసరం.
ప్రశ్నకు రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాల కలయిక అవసరం, అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
- భౌతిక శాస్త్రంలో సంఖ్యాపరమైన సమస్యలకు అంకితమైన పుస్తకాన్ని కొనుగోలు చేయండి
- JEE మెయిన్ కోసం ఏదైనా ఫిజిక్స్ అధ్యాయాన్ని చదివేటప్పుడు మీరు కీలక సూత్రాల కోసం షార్ట్ నోట్స్ చేయడం ముఖ్యం. ఇవి రాబోయే రోజుల్లో మీరు సవరించడాన్ని సులభతరం చేస్తాయి
- చివరిది కానీ, మొత్తం సిలబస్ పూర్తయిన తర్వాత, ప్రతి రెండు లేదా మూడు రోజులకు కనీసం మూడు గంటలపాటు ఒక పూర్తి మాక్ పరీక్షను పూర్తి చేయడం చాలా కీలకం.
సంబంధిత లింకులు,
JEE Main 2024 ఉత్తీర్ణత మార్కులు | JEE Main 2024 ప్రాక్టీస్ పేపర్లు |
---|---|
JEE మెయిన్ మార్కులు vs పర్సంటైల్ | JEE మెయిన్ 2024 మార్కులు vs ర్యాంక్ |
JEE Main 2024 లో 95+ పర్శంటైల్ సాధించడం ఎలా? | - |
ఇలాంటి మరిన్ని అప్‌డేట్‌లు మరియు Education News కోసం, CollegeDekhoని చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ
JEE మెయిన్ 2025 అడ్మిట్ కార్డులో (JEE Main 2025 Admit Card) తప్పులని సరి చేసుకునే విధానం
JEE మెయిన్ 2025 రివిజన్ టిప్స్ (JEE Main 2025 Revision Tips) నోట్స్, ప్రిపరేషన్ ప్లాన్, మంచి స్ట్రాటజీ
JEE మెయిన్ 2024 హెల్ప్‌లైన్ నంబర్ (JEE Main 2024 Helpline Number) - కేంద్రం, ఫోన్ నంబర్, చిరునామా