- టీఎస్ డీసెట్ 2024 గురించి (About TS DEECET 2024)
- తెలంగాణ డీసెట్ 2024 హైలెట్స్ (TS DEECET 2024 Highlights)
- టీఎస్ డీసెట్ 2024 ముఖ్యమైన తేదీలు (TS DEECET 2024 Important Dates)
- టీఎస్ డీసెట్ 2024 అర్హత ప్రమాణాలు (TS DEECET 2024 Eligibility Criteria)
- TS DEECET 2024 అప్లికేషన్ ఫార్మ్ (TS DEECET 2022 Application Form)
- TS DEECET 2024 దరఖాస్తు ఫీజు (TS DEECET 2024 Application Fee)
- TS DEECET 2024 అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా పూరించాలి? (How to Fill …
- తెలంగాణ డీసెట్ 2024 పరీక్షా నమూనా (TS DEECET 2024 Exam Pattern)
- TS DEECET 2024 పరీక్షా సరళి/ఎంట్రన్స్ పరీక్ష విధానం (TS DEECET 2022 …
- టీఎస్ డీసెట్ 2024 సిలబస్ (TS DEECET 2022 Syllabus)
- టీఎస్ డీసెట్ 2024 హాల్ టికెట్ (TS DEECET 2022 Hall Ticket)
- టీఎస్ డీసెట్ 2024 ఫలితాలు, ర్యాంక్ కార్డు (TS DEECET 2022 Results …
- TS DEECET 2024 అడ్మిషన్ ప్రాసెస్
- టీఎస్ డీసెట్ 2024 ప్రిపరేషన్ టిప్స్ (TS DEECET 2024 Preparation Tips)
టీఎస్ డీసెట్ 2024 పరీక్షా తేదీలు (TS DEECET 2024 Exam Dates): టీఎస్ డీసెట్ 2024 (TS DEECET 2024) లేదా తెలంగాణ స్టేట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్షని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో అభ్యర్థులు రెండు సంవత్సరాల DElEd (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), DPSE (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్)లో ప్రవేశం పొందడానికి రాష్ట్ర స్థాయిలో సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. టీఎస్ డీసెట్ 2024కి (TS DEECET 2024 Exam Dates) సంబంధించిన ముఖ్యమైన తేదీలు , దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఎంట్రన్స్ పరీక్ష, అడ్మిషన్ ప్రక్రియ వంటి అన్ని ముఖ్యమైన వివరాలని తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ని తప్పక చదవండి.
టీఎస్ డీసెట్ 2024 గురించి (About TS DEECET 2024)
తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ DEECET 2022 DEECET కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇది కంప్యూటర్-ఆధారిత పరీక్ష. దీనికి సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి సమాచార బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ డీసెట్ 2024 హైలెట్స్ (TS DEECET 2024 Highlights)
తెలంగాణ డీసెట్ 2024కి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ దిగువున టేబుల్లో తెలుసుకోవచ్చు.
ఎగ్జామ్ నేమ్ | టీఎస్ డీసెట్ |
---|---|
ఫుల్ నేమ్ | తెలంగాణ స్టేట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 |
ఎగ్జామ్ లెవల్ | రాష్ట్రస్థాయి |
రాష్టం పేరు | తెలంగాణ |
కండక్టడ్ అథారిటీ | పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం |
అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
ఎగ్జామ్ మీడియం | ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ |
ఎగ్జామ్ డ్యురేషన్ | రెండు గంటలు |
ఎగ్జామినేషన్ మోడ్ | కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆన్‌లైన్) |
క్వశ్చన్ టైప్ | అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ |
టీఎస్ డీసెట్ 2024 ముఖ్యమైన తేదీలు (TS DEECET 2024 Important Dates)
తెలంగాణ డీసెట్ 2024 కోసం అధికారిక తేదీలు ఇప్పటికే విడుదలయ్యాయి. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ డీసెట్ 2024 (TS DEECET 2024) ముఖ్యమైన తేదీలని ఈ దిగువున చెక్ చేయవచ్చు.
ముఖ్యమైన ఈవెంట్స్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
TS DEECET 2024 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభం | తెలియాల్సి ఉంది |
TS DEECET 2024 అప్లికేషన్ సబ్మిషన్‌ని చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
TS DEECET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ | తెలియాల్సి ఉంది |
TS DEECET 2024 అడ్మిట్ కార్డు విడుదల | తెలియాల్సి ఉంది |
TS DEECET 2024 ఎంట్రన్స్ పరీక్ష | తెలియాల్సి ఉంది |
TS DEECET 2024 ఆన్సర్ కీ | తెలియాల్సి ఉంది |
TS DEECET 2024 ఫలితాలు | తెలియాల్సి ఉంది |
టీఎస్ డీసెట్ 2024 అర్హత ప్రమాణాలు (TS DEECET 2024 Eligibility Criteria)
అర్హతలు ఉన్న అభ్యర్థులు TS DEECET 2024 ఎంట్రన్స్ పరీక్ష కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష కోసం ఏ అర్హత ప్రమాణాలు ఉండాలో ఈ దిగువున అందజేయడం జరిగింది.
- అభ్యర్థి భారతీయ జాతీయుడై ఉండాలి
- తెలంగాణ ఎడ్యుకేషనల్ సంస్థల (అడ్మిషన్ ) ఆర్డర్, 1974 ప్రకారం స్థానిక/స్థానేతర స్థితి అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
- అభ్యర్థులు TS DEECET 2024లో ర్యాంక్ పొంది ఉండాలి. ప్రభుత్వ DIET, ప్రవేట్ ఎలిమెంటరీ టీచర్ విద్యా సంస్థలలో A, B కేటగిరీ సీట్లలో సీట్ల కేటాయింపు కోసం ఈ దిగువ ఇవ్వబడిన ఎడ్యుకేషనల్ అర్హతలను కలిగి ఉండాలి.
- ర్యాంక్ పొందడానికి OC, BC వర్గాల అభ్యర్థులైతే TS DEECETలో 35 శాతం మార్కులు సంపాదించాలి. SC, ST కేటగిరీల అభ్యర్థులకు సీట్ల కేటాయింపు కోసం ఎటువంటి కనీస మార్కులు లేవు.
ఎడ్యుకేషనల్ అర్హతలు (Educational Qualifications)
అభ్యర్థులు TS DEECET 2024 కోసం ఈ దిగువ ఇవ్వబడిన ఎడ్యుకేషనల్ అర్హతలు ఉండాలి.
- దరఖాస్తుదారు తప్పనిసరిగా TS DEECET కమిటీ నిర్ణయించిన ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అడ్మిషన్ సమయానికి ఇంటర్మీడియట్ పరీక్షలో పాసై ఉండాలి
- TS DEECET 2024కి హాజరు కావడానికి దరఖాస్తుదారు అర్హత పరీక్షలో మొత్తం 50% మార్కులు సాధించి ఉండాలి. SC, ST శారీరక వికలాంగ అభ్యర్థుల విషయంలో మార్కులు కనీస శాతం 45% ఉంటుంది.
వయస్సు ప్రమాణాలు (Age Criteria)
- అభ్యర్థికి అడ్మిషన్ సంవత్సరం సెప్టెంబర్ 1 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అడ్మిషన్ నుంచి D.EI.Ed/DPSE ప్రోగ్రామ్‌కు గరిష్ట వయోపరిమితి లేదు.
గమనిక: ఒకేషనల్ కోర్సులతో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తెలంగాణ డీఈఈసెట్ 2022కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
TS DEECET 2024 అప్లికేషన్ ఫార్మ్ (TS DEECET 2022 Application Form)
TS DEECET 2024 కోసం దరఖాస్తు చేసుకోడానికి అభ్యర్థులు ముందుగా టీఎస్ డీసెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఉచిత సమాచార బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ఉన్న విధంగా అభ్యర్థులు తమ అర్హతలను కలిగి ఉన్నారో? లేదో? చెక్ చేసుకోవాలి. తర్వాత అభ్యర్థి చెల్లింపు గేట్‌వే సేవ ద్వారా రూ.450 ఫీజు చెల్లించాలి. చెల్లింపు గేట్‌వే వద్ద అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫిల్ చేయాలి. ఫీజు రసీదు తర్వాత అభ్యర్థికి రిఫరెన్స్ ID ఇవ్వబడుతుంది. దాంతో అభ్యర్థి దరఖాస్తు సబ్మిషన్‌ని కొనసాగించవచ్చు.
TS DEECET 2024 దరఖాస్తు ఫీజు (TS DEECET 2024 Application Fee)
TS DEECET 2024 కోసం దరఖాస్తు ఫీజు రూ. 450లు. అభ్యర్థులు తప్పనిసరిగా TS DEECET 2024 దరఖాస్తు ఫీజును అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తు ఫీజుని క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
సాధారణ, వెనుకబడిన వారికి క్లాస్ | రూ. 450 |
---|---|
షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, PHC అభ్యర్థులకు | రూ. 450 |
TS DEECET 2024 అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా పూరించాలి? (How to Fill TS DEECET 2022 Application Form?)
దరఖాస్తు ఫీజును చెల్లించిన తర్వాత అభ్యర్థులు TS DEECET 2024 కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని 'సబ్మిట్ అప్లికేషన్'పై క్లిక్ చేయడం ద్వారా పూరించాలి. TS DEECET 2024 కోసం అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేసే విధానం ఈ దిగువున అందజేయడం జరిగింది.- అప్లికేషన్ ఫార్మ్‌లో సమాచారాన్ని పూరించిన తర్వాత అభ్యర్థి తన ఫోటోని, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో 50 kb, సంతకం చేసిన ఇమేజ్ 30 kb కంటే తక్కువ సైజ్ ఉండాలి.
- ఫోటోని తెల్ల కాగితంపై అతికించి ఉండాలి. దాని కింద అభ్యర్థి సంతకం చేయాలి. సంతకం అని సూచించిన బాక్స్‌లో సరిపోయేలా చూసుకోవాలి. ఫోటోగ్రాఫ్, సంతకంతో సహా అవసరమైన సైజ్‌ని స్కాన్ చేసి, స్థానిక మెషీన్‌లో JPG ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలి.
- ఫోటో లేని లేదా సరైన సైజుతో అస్పష్టమైన ఫోటో/ఫోటో లేని అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. అలాంటి అభ్యర్థులకు హాల్ టికెట్ ఇవ్వరు. కాబట్టి అప్‌లోడ్ బటన్‌ను నొక్కిన తర్వాత అభ్యర్థి వీటన్నింటినీ చెక్ చేసుకోవాలి.
- ఫోటో, అభ్యర్థి డీటెయిల్స్ సరిపోలకపోవడం గురించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే దరఖాస్తు సబ్మిషన్ తర్వాత వారిని పరిగణలోకి తీసుకోరు.
తెలంగాణ డీసెట్ 2024 పరీక్షా నమూనా (TS DEECET 2024 Exam Pattern)
తెలంగాన డీసెట్ పరీక్ష గురించి పూర్తి అవగాహనను పొందడానికి TS DEECET 2024 పరీక్షా సరళిని తెలుసుకోవాలి. వివరాలు కింద పట్టికలో ఉన్నాయి.పరీక్షా విధానం: TS DEECET ఆన్‌లైన్ మోడ్‌లో (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) మాత్రమే నిర్వహించబడుతుంది.
ప్రశ్నల సంఖ్య: TS DEECET కోసం మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష వ్యవధి: పరీక్ష 2 గంటల 30 నిమిషాలు అంటే 150 నిమిషాల వ్యవధి ఉంటుంది.
మార్కింగ్ స్కీమ్: దరఖాస్తుదారుకు ప్రతి సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది.
నెగెటివ్ మార్కింగ్ స్కీమ్: ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
TS DEECET 2024 పరీక్షా సరళి/ఎంట్రన్స్ పరీక్ష విధానం (TS DEECET 2022 Exam Pattern/Scheme of Entrance Exam)
TS DEECET 2024 ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. పరీక్ష పేపర్ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. పేపర్ 100 ప్రశ్నలతో మూడు భాగాలను కలిగి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
మీడియం | విషయం/ టాపిక్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు | ||
---|---|---|---|---|---|
తెలుగు | పార్ట్ I | జనరల్ ఇంగ్లీష్, టీచింగ్ ఆప్టిట్యూడ్ | 10 | 10 | |
పార్ట్ II | సాధారణ ఇంగ్లీష్ | 10 | 10 | ||
సాధారణ తెలుగు | 20 | 20 | |||
పార్ట్ III | సబ్జెక్ట్ నిర్దిష్ట (అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్) | ప్రశ్నల సంఖ్య | ప్రశ్నల సంఖ్య | ||
మ్యాథ్స్ | 20 | 20 | |||
ఫిజికల్ సైన్సెస్ | 10 | 10 | |||
జీవ శాస్త్రాలు | 10 | 10 | |||
సామాజిక శాస్త్రాలు | 20 | 20 | |||
మొత్తం (పార్ట్ I, II & III) | 100 | 100 | |||
ఆంగ్ల | పార్ట్ I | జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ | 10 | 10 | |
పార్ట్ II | సాధారణ ఇంగ్లీష్ | 20 | 20 | ||
సాధారణ తెలుగు/ ఉర్దూ (అభ్యర్థి ఎంపిక చేసుకున్నట్లుగా) | 10 | 10 | |||
పార్ట్ III | సబ్జెక్ట్ నిర్దిష్ట (అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | ప్రశ్నల సంఖ్య | ||
గణితం | 20 | 20 | |||
ఫిజికల్ సైన్స్ | 10 | 10 | |||
జీవ శాస్త్రం | 10 | 10 | |||
సామాజిక అధ్యయనాలు | 20 | 20 | |||
మొత్తం (పార్ట్ I, II & III) | 100 | 100 |
టీఎస్ డీసెట్ 2024 సిలబస్ (TS DEECET 2022 Syllabus)
TS DEECET 2024 సిలబస్ సాధారణ ఇంగ్లీష్, మ్యాథ్స్ వంటి విభాగాలను కలిగి ఉంటుంది. పార్ట్ II, పార్ట్ III కోసం అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని సిలబస్ తరగతుల VIII నుంచి X వరకు సిలబస్ గురించి బాగా తెలుసుకోవాలి.
మీడియం | భాగం | మొత్తం మార్కులు |
---|---|---|
ఆంగ్ల | పార్ట్ I- జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ పార్ట్ II- జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఉర్దూ/తెలుగు (అభ్యర్థులు ఎంచుకున్నట్లు) పార్ట్ III- మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ | 100 |
తెలుగు | పార్ట్ I- జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూట్ పార్ట్ II- జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ పార్ట్ III- గణితం, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ | 100 |
ఉర్దూ | పార్ట్ I- జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూట్ పార్ట్ II- జనరల్ ఉర్దూ, జనరల్ ఇంగ్లీష్ పార్ట్ III- మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ | 100 |
టీఎస్ డీసెట్ 2024 హాల్ టికెట్ (TS DEECET 2022 Hall Ticket)
వెబ్‌సైట్‌లో నోటిఫై చేసిన తేదీ ప్రకారం అభ్యర్థులు తమ TS DEECET 2024 హాల్ టిక్కెట్‌లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌ల డౌన్‌లోడ్‌కు సంబంధించిన తేదీల్లోని సమాచారానికి సంబంధించి అధికారిక సైట్‌ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి నిర్దేశిత సమయంలోగా హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేకపోతే హెల్ప్‌లైన్‌ను సంప్రదించి క్లారిటీ తీసుకోవచ్చు.
TS DEECET 2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి దశలు (Steps for downloading TS DEECET 2024 Admit Card)
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఇప్పుడు, అభ్యర్థి TS DEECET 2024 అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్ లేదా అడ్మిషన్ టికెట్) లింక్‌పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి తప్పనిసరిగా లాగిన్ వివరాలు, అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
- అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.
- TS DEECET అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
టీఎస్ డీసెట్ 2024 ఫలితాలు, ర్యాంక్ కార్డు (TS DEECET 2022 Results and Rank Card)
TS DEECET 2024 ఫలితాలు త్వరలో విడుదల అవుతాయి. మార్కులు, ర్యాంక్ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించడం జరుగుతుంది. కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి అభ్యర్థులు TS DEECET 2024 ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TS DEECET 2024 అడ్మిషన్ ప్రాసెస్
TS DEECET 2024కి అడ్మిషన్ నుంచి 85% సీట్లు స్థానిక అభ్యర్థులకు, మిగిలిన 15% సీట్లు తెలంగాణ ఎడ్యుకేషనల్ సంస్థల (నిబంధనలు, ప్రవేశాలు) ఆర్డర్, 1974 ప్రకారం అన్‌రిజర్వ్‌డ్ కోసం రిజర్వ్ చేయబడతాయి.
టీఎస్ డీసెట్ 2024 ప్రిపరేషన్ టిప్స్ (TS DEECET 2024 Preparation Tips)
తెలంగాణ డీసెట్ 2024 ప్రిపరేషన్ టిప్స్ గురించి ఈ దిగువున తెలియజేయడం జరిగింది. ఈ టిప్స్ కచ్చితంగా అభ్యర్థులకు ఉపయోగపడతాయి.
- దరఖాస్తుదారు వివరణాత్మక సిలబస్‌ను సూచించాలి.
- అన్ని అంశాలను కవర్ చేయడానికి ప్రయత్నించాలి.
- కరెంట్ అఫైర్స్‌పై అవగాహనను పెంపొందించుకోవడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా జర్నల్స్/వార్తాపత్రికలను రోజూ చదవాలి. దరఖాస్తుదారులు ప్రతి విభాగానికి సమాన సమయాన్ని ఇచ్చే టైమ్‌టేబుల్‌ను రూపొందించాలి.
- అభ్యర్థులు వీలైనన్ని మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం/మాక్ టెస్ట్‌లను పరిష్కరించడానికి ప్రయత్నించాలి.
TS DEECET 2024 అప్‌డేట్స్ కోసం CollegeDekho ని చూస్తూనే ఉండండి
సిమిలర్ ఆర్టికల్స్
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి