AP DSC 2024 అర్హత ప్రమాణాలు (AP DSC 2024 Eligibility Criteria) పోస్టు ప్రకారంగా తెలుసుకోండి.
AP DSC నోటిఫికేషన్ ఫిబ్రవరి 2024 నెలలో విడుదల కానున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 పోస్టులు భర్తీ చేయనున్నారు. AP DSC 2024 అర్హత ప్రమాణాలు (AP DSC 2024 Eligibility Criteria) పోస్టు ప్రకారంగా తెలుసుకోండి.
AP DSC అర్హత ప్రమాణాలు (AP DSC 2024 Eligibility Criteria) : AP DSC 2024 నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. AP DSC 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 2024 నెలలో నోటిఫికేషన్ విడుదల కానున్నది. AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అవ్వగానే అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. AP DSC 2024 పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. SGT, స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల ఖాళీల సంఖ్య 6100 . AP DSC నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. AP DSC నోటిఫికేషన్ 2024 ద్వారా వివిధ పోస్టులకు ఉన్న ఖాలీలను భర్తీ చేయనున్నారు. వాటిలో వివిధ పోస్టులకు వివిధ అర్హత ప్రమాణాలను కలిగి ఉంటాయి. AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు పోస్టు ప్రకారంగా క్రింద ఇచ్చిన అర్హత ప్రమాణాలను (AP DSC 2024 Eligibility Criteria) ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: 6100 పోస్టులకు ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల, 12వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
AP DSC 2024 ముఖ్యమైన తేదీలు (AP DSC 2024 Important Dates)
కార్యక్రమం | తేదీలు |
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ | ఫిబ్రవరి 07, 2024 |
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభం | ఫిబ్రవరి 12, 2024 |
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ | తెలియాల్సి ఉంది. |
AP DSC 2024 హాల్ టికెట్ విడుదల | తెలియాల్సి ఉంది. |
AP DSC 2024 పరీక్ష తేదీ | తెలియాల్సి ఉంది. |
AP DSC 2024 ఆన్సర్ కీ విడుదల | తెలియాల్సి ఉంది. |
AP DSC 2024 ఫలితాలు విడుదల | తెలియాల్సి ఉంది. |
AP DSC 2024 అర్హత ప్రమాణాలు (AP DSC 2024 Eligibility Criteria)
AP DSC నోటిఫికేషన్ 2024 ద్వారా వివిధ పోస్టులకు ఉన్న ఖాలీలను భర్తీ చేయనున్నారు. వాటిలో వివిధ పోస్టులకు వివిధ అర్హత ప్రమాణాలను(AP DSC 2024 Eligibility Criteria) కలిగి ఉంటాయి. AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు పోస్టు ప్రకారంగా క్రింద ఇచ్చిన అర్హత ప్రమాణాలను(AP DSC 2024 Eligibility Criteria) తనిఖీ చేయవచ్చు.
AP DSC 2024 PGT అర్హత ప్రమాణాలు
- అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్ట్ గ్రాడుయేషన్ పూర్తి చేయాలి.
- బ్యాచిలర్ డిగ్రీ లో కనీసం 50% శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
- ఖచ్చితంగా B.ED కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి.
AP DSC 2024 TGT అర్హత ప్రమాణాలు
- అభ్యర్థులు కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి.
- గుర్తింపు పొందిన సంస్థ నుండి B.ED కోర్సులో ఉత్తీర్ణత సాదించాలి
AP DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ అర్హత ప్రమాణాలు
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్
- D.ED లేదా D.El.ED లో డిప్లొమా లేదా
- B.ED గ్రాడ్యుయేషన్
AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ అర్హత ప్రమాణాలు
- సంబంధిత సబ్జెక్టు లో గ్రాడ్యుయేషన్ లేదా
- బ్యాచిలర్ డిగ్రీ లేదా
- BCA/BBM/ B.ED
AP DSC 2024 మ్యూజిక్ టీచర్ అర్హత ప్రమాణాలు
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్
- మ్యూజిక్ లో 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు
AP DSC 2024 వయో పరిమితి
AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, గరిష్ట వయసు 44 సంవత్సరాలు. SC/ST/BC అభ్యర్థులకు గరిష్ట వయసు 49 సంవత్సరాల వరకు ఉండవచ్చు, వికలాంగులకు గరిష్ట వయసు 54 సంవత్సరాలు ఉండవచ్చు.
గమనిక : AP DSC 2024 పరీక్ష కోసం అప్లై చేసే అభ్యర్థులు అందరూ TET పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి.
ఇది కూడా చదవండి - AP DSC అప్లికేషన్ ఫార్మ్ 2024
AP DSC 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC 2024 Important Highlights)
AP DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
AP DSC నోటిఫికేషన్ 2024 | వివరాలు |
నోటిఫికేషన్ పేరు | AP DSC నోటిఫికేషన్ 2024 |
నిర్వహణ సంస్థ | కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , ఆంద్రప్రదేశ్ |
పోస్టులు | SGT, TGT, PGT , SA , మ్యూజిక్ టీచర్ |
ఖాళీల సంఖ్య | 6100 |
దరఖాస్తు ప్రారంభం | ఫిబ్రవరి 2024 |
అధికారిక వెబ్సైటు | cse.ap.gov.in/apdsc.apcfss.in |
ఇది కూడా చదవండి - పోస్టు ప్రకారంగా AP DSC 2024 ఖాళీల జాబితా
AP DSC పరీక్షా విధానం 2024 (AP DSC Exam Pattern 2024)
AP DSC పరీక్షా విధానం 2024 గురించి ఈ దిగువున పట్టికలో అందజేశాం.సబ్జెక్టులు | ప్రశ్నలు | మార్కులు |
జనరల్ నాలెడ్జ్ | 20 | 10 |
ఎడ్యుకేషన్ పర్సపెక్టివ్స్ | 20 | 10 |
లాంగ్వేజ్-I (భారతీయ భాషలు), లాంగ్వేజ్ -II (ఇంగ్లీష్)లో సీనియర్ సెకండరీ స్థాయి (ఇంటర్మీడియట్ స్థాయి) వరకు భాషా నైపుణ్యం, భాషా అంశాలు, కమ్యూనికేషన్, గ్రహణ సామర్థ్యాలు | 36 | 18 |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిలబస్ I నుంచి VIII వరకు క్లాస్ X స్థాయి వరకు కష్టతరమైన స్టాండర్డ్ | 54 | 27 |
U.G ప్రకారం టీచింగ్ మెథడాలజీ (స్ట్రాటజీ పేపర్స్). డి.పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్ సిలబస్ | 30 | 15 |
మొత్తం | 160 | 80 |
AP DSC 2024 ప్రిపరేషన్ టిప్స్ ( AP DSC 2024 Preparation Tips)
AP DSC 2024 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ క్రింది టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా మంచి స్కోరు సాధించవచ్చు.- కరెంట్ అఫైర్స్ నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి.
- జనరల్ నాలెడ్జ్ అంశాల మీద పట్టు కలిగి ఉండాలి, నిరంతరం ప్రాక్టీస్ చేయాలి.
- AP DSC 2024 సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
- ప్రతీ సబ్జెక్టు యొక్క మెథడాలజీ కూడా ఖచ్చితంగా చదవాలి.