AP LAWCET కౌన్సెలింగ్ 2022 కోసం అవసరమైన పత్రాల జాబితా
AP LAWCET కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి, అన్ని పత్రాలను సులభంగా ఉంచుకోవడం ముఖ్యం. AP LAWCET కౌన్సెలింగ్ 2022 కోసం మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెక్‌లిస్ట్‌ను పొందేందుకు కథనాన్ని స్క్రోల్ చేయండి.
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 కు అవసరమైన డాక్యుమెంట్లు: ఏపీ లాసెట్ 2023 కౌన్సెలింగ్ జూన్ లేదా జూలై నెలలో జరుగుతుంది. ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 శ్రీకృష్ణ దేవరాయ యునివర్సిటీ అనంతపురం అధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఏపీ లాసెట్ 2023 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్ కు హాజరు అవ్వగలరు. విద్యార్థులు కౌన్సెలింగ్ కు హాజరు అయ్యే సమయంలో అక్కడి అధికారుల చేత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేపించుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి.
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 కు హాజరు అయ్యే విద్యార్థులు తప్పని సరిగా అన్ని డాక్యుమెంట్లను వెరిఫికేషన్ కుమోసం తీసుకుని రావాలి. ఒకవేళ విద్యార్థులు ఈ డాక్యుమెంట్లను తీసుకుని రాకపోతే వారికి అడ్మిషన్ లభించదు. కాబట్టి విద్యార్థులు వారికి అవసరమైన పత్రాలను అన్నిటినీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. విద్యార్థులు ఏపీ లాసెట్ 2023 పరీక్ష తర్వాత కౌన్సెలింగ్ కు ఎక్కువ రోజులు గడువు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 కు అవసరమైన డాక్యుమెంట్లు జాబితా ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 పూర్తి సమాచారం (Overview of AP LAWCET Counselling 2023)
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 కు సంబందించిన వివరాలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
విశేషాలు | డీటెయిల్స్ |
ప్రక్రియ పేరు | AP LAWCET కౌన్సెలింగ్ ప్రక్రియ |
కండక్టింగ్ బాడీ | APSCHE తరపున శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం |
ప్రక్రియ యొక్క మోడ్ | ఆన్‌లైన్ మోడ్ |
AP LAWCET కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభ తేదీ | తెలియాల్సి ఉంది |
AP LAWCET కౌన్సెలింగ్ ప్రక్రియ చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ విధానం 2023 (AP LAWCET 2023 Counselling Process)
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 ఈ క్రింద వివరించిన విధంగా అమలు చేయబడుతుంది.
- ఏపీ లాసెట్ 2023 ఫలితాలు విడుదల అయిన తర్వాత కౌన్సెలింగ్ తేదీలను అధికారులు విడుదల చేస్తారు. కౌన్సెలింగ్ కు అర్హత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లో వారి వివరాలు నమోదు చేసుకోవాలి.
- ప్రతీ విద్యార్థికి అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్ కేంద్రం కేటాయించబడింది. కేటాయించిన సమయంలో విద్యార్థులు వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేపించుకోవాలి.
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత విద్యార్థులు కౌన్సెలింగ్ ఫీజును చెల్లించాలి.
- తర్వాత విద్యార్థులు వారికి కావాల్సిన కోర్సు మరియు కళాశాల కోసం వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి.
- అభ్యర్థుల రాంక్, కోర్సు, ప్రాధాన్యత మరియు కేటగిరీ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ ఫీజు 2023 (AP LAWCET 2023 Counselling Fee )
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 కు హాజరు అవుతున్న విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల కేటగిరీ ప్రకారంగా వారు చెల్లించవలసిన ఫీజు ఈ క్రింద పట్టిక లో తెలుసుకోవచ్చు.
వర్గం | కౌన్సెలింగ్ ఫీజు మొత్తం (INR) |
జనరల్ | 1000 |
SC/ ST | 500 |
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 కు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా (List of Documents Required for AP LAWCET 2023 Counselling)
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ 2023 కు హాజరు అవుతున్న విద్యార్థులు హెల్ప్ లైన్ కేంద్రంలో వెరిఫై చేయాల్సిన డాక్యుమెంట్ల జాబితా ఈ క్రింద వివరించబడింది.
- ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్/ అడ్మిట్ కార్డు
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్క్స్ షీట్
- 6వ తరగతి నుండి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం ( అవసరం అయితే)
- ఆదాయ ధ్రువీకరణ పత్రం ( స్కాలర్ షిప్ విద్యార్థుల కు)
- నివాస ధ్రువీకరణ పత్రం
- తల్లి తండ్రుల మరియు విద్యార్థి ఆధార్ కార్డు
- NCC / CAP / PH సర్టిఫికెట్ ( అవసరమైన విద్యార్థులకు)
ఏపీ లాసెట్ 2023 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఏం చేయాలి? (What after AP LAWCET 2023 Document Verification?)
విద్యార్థులు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత అధికారిక వెబ్సైట్ కు లాగిన్ అయ్యి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు వారికి కేటాయించిన తేదీలలో అధికారిక వెబ్సైట్ ద్వారా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ నమోదు సమయంలో విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ కళాశాలలను ఎంచుకోవడం మంచిది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత విద్యార్థులకు అలాట్మెంట్ ఆర్డర్ అందుతుంది. ఇందులో విద్యార్థికి కేటాయించిన కాలేజీలో నిర్దేశించిన గడువు లోపు విద్యార్థులు రిపోర్ట్ చేయాలి. విద్యార్థులకు ఆ కళాశాల నచ్చకపోతే 2వ రౌండ్ కౌన్సెలింగ్ లో పాల్గొనవచ్చు.
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ కేంద్రాలు 2023 (AP LAWCET 2023 Counselling Centers )
ఏపీ లాసెట్ 2023 కౌన్సెలింగ్ కేంద్రాల జాబితా ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
Region | Center |
Ananthapuramu | Sri Krishnadeva University |
Guntur | Acharya Nagarjuna University |
Tirupati | SV University (old MBA building) |
Vishakhapatnam | Andhra University Counselling Centre |
ఏపీ లాసెట్ 2023 కౌన్సెలింగ్ ద్వారా అందించే కోర్సులు (Courses Offered Through AP LAWCET 2023 Counselling )
ఏపీ లాసెట్ 2023 ద్వారా LLB & LLM కోర్సులు అందించబడతాయి.
ఏపీ లాసెట్ 2023 LLB కోర్సుల జాబితా (LLB Courses Offered Through AP LAWCET 2023)
ఏపీ లాసెట్ 2023 ద్వారా అందించే LLB కోర్సుల జాబితా ఈ పట్టికలో తెలుసుకోవచ్చు.
శాఖయొక్క సంకేత పదం | చట్టం కోర్సు |
BBL 5 | 5 సంవత్సరాల BBA LLB |
BCM WL5 | 5 సంవత్సరాల B.Com LLB |
LLB3YH | 3 సంవత్సరాల LLB (ఆనర్స్) |
LLB3YR | 3 సంవత్సరాల LLB |
LLB5YH | 5 సంవత్సరాల LLB (ఆనర్స్) |
LLB5YR | 5 సంవత్సరాల LLB |
ఏపీ లాసెట్ 2023 LLM కోర్సుల జాబితా (LLM Courses Offered Through AP LAWCET 2023)
ఏపీ లాసెట్ 2023 ద్వారా అందించే LLM కోర్సుల జాబితా ఈ పట్టికలో తెలుసుకోవచ్చు.
శాఖయొక్క సంకేత పదం | చట్టం కోర్సు |
LLM BSL | వ్యాపార చట్టంలో LLM |
LLM CAM | రాజ్యాంగ చట్టం & పరిపాలన చట్టంలో LLM |
LLM CLO | రాజ్యాంగ & చట్టపరమైన క్రమంలో LLM |
LLM CML | కమర్షియల్ లాలో LLM |
LLM CSL | కార్పొరేట్ & సెక్యూరిటీ లాలో LLM |
LLM FML | కుటుంబ చట్టంలో LLM |
LLM HRT | మానవ హక్కుల చట్టంలో LLM |
LLM ILO | అంతర్జాతీయ చట్టం & సంస్థలో LLM |
LLM IPR | మేధో సంపత్తి హక్కులలో LLM |
LLM LBL | లేబర్ లాలో LLM |
LLM LCL | లేబర్ క్యాపిటల్ & లాలో LLM |
LLM LIL | లేబర్ & ఇండస్ట్రియల్ లాలో LLM |
LLM LOC | నేరాల చట్టంలో LLM |
ఎడ్యుకేషన్ గురించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.