TS EDCET 2023 ఆశించిన కటాఫ్ ( TS EDCET 2023 Expected Cutoff) : కేటగిరీ ప్రకారంగా చూడండి
TS EDCET 2023 ఆశించిన కటాఫ్ విద్యార్థుల కేటగిరీ ను బట్టి మారుతూ ఉంటుంది. TS EDCET 2023 ఆశించిన కటాఫ్ ను కేటగిరీ ప్రకారంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
TS EDCET 2023 పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) నిర్వహిస్తుంది. TS EDCET పరీక్ష ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. B.ED లో ప్రవేశం పొందడానికి ప్రతీ సంవత్సరం అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్ష వ్రాస్తూ ఉంటారు. అయితే కేవలం TS EDCET 2023 కటాఫ్ మార్కులను సాధించిన వారు మాత్రమే అడ్మిషన్ పొందగలరు. TS EDCET 2023 కటాఫ్ మార్కులు కేటగిరీ ప్రకారంగా మారుతూ ఉంటాయి అని విద్యార్థులు గమనించాలి. TS EDCET 2023 కటాఫ్ మార్కులను అధికారిక వెబ్సైటు లో విడుదల చేస్తారు. గత సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా TS EDCET 2023 ఆశించిన కటాఫ్ మార్కులను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. TS EDCET 2023 ఫలితం జూన్ 12,2023 తేదీన విడుదల అయ్యాయి . ఫలితాలను చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ చూడండి.
ఇది కూడా చదవండి: నేడే ప్రత్యేక దశ తెలంగాణ ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల, లింక్ కోసం ఇక్కడ చూడండి
ఇది కూడా చదవండి: తెలంగాణ ఎడ్‌సెట్ ప్రత్యేక దశ వెబ్ ఆప్షన్లు విడుదల, లింక్ కోసం ఇక్కడ చూడండి
TS EDCET 2023 ఫలితాలు డైరెక్ట్ లింక్
TS EDCET 2023 ఫలితాలను క్రింది పట్టికలో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి - TS EDCET 2023 టాపర్స్ లిస్ట్
TS EDCET 2023 ముఖ్యంశాలు (TS EDCET 2023 Highlights)
TS EDCET 2023 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
పరీక్ష పేరు | తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ |
యూనివర్సిటీ | ఉస్మానియా యూనివర్సిటీ |
నిర్వహణ అధికారం | TSCHE |
పరీక్ష తేదీ | 18 మే , 2023 |
ఫలితాల విడుదల | తెలియాల్సి ఉంది. |
కౌన్సెలింగ్ తేదీ | తెలియాల్సి ఉంది |
TS EDCET 2023 ఉత్తీర్ణత మార్కులు ( TS EDCET 2023 Qualifying Marks )
TS EDCET పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహించబడుతుంది. అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 25% మార్కులను సాధించాలి. అంటే 150 మార్కులకు 38 మార్కులు సాధించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత మార్కులు సాధించిన అంత మాత్రాన వారికి కళాశాలలో అడ్మిషన్ లభించదు. కళాశాలలో అడ్మిషన్ పొందడానికి తప్పనిసరిగా కటాఫ్ మార్కులను సాధించాలి అని విద్యార్థులు గమనించాలి.
TS EDCET 2023 ఆశించిన కటాఫ్ మార్కులు (TS EDCET 2023 Expected Cutoff Marks)
TS EDCET 2023 కటాఫ్ మార్కులు ఫలితాలు విడుదల అయిన తర్వాత అధికారిక వెబ్సైటు లో విడుదల చేస్తారు. TS EDCET 2023 ఆశించిన కటాఫ్ మార్కులను క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
కేటగిరీ | ఆశించిన కటాఫ్ |
జనరల్ | 60 |
SC | 38 |
ST | 38 |
OBC | 45 |
అభ్యర్థులు పైన పట్టికలో ఉన్నది ఆశించిన కటాఫ్ మాత్రమే అని గమనించాలి. అధికారిక కటాఫ్ విడుదల చేసిన తర్వాత నిర్దిష్టమైన కటాఫ్ మార్కులను అప్డేట్ చేయడం జరుగుతుంది.
TS EDCET 2023 కటాఫ్ ను ప్రభావితం చేసే అంశాలు ( Factors Deciding TS EDCET 2023)
TS EDCET 2023 కటాఫ్ ను నిర్ణయించే అంశాల జాబితా ఇక్కడ చూడవచ్చు.
- TS EDCET గత సంవత్సరాల కటాఫ్
- TS EDCET పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య
- TS EDCET అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య
- అభ్యర్థుల కేటగిరీ
TS EDCET 2023 గురించిన మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.