TS TET కేటగిరీ ప్రకారంగా కటాఫ్ మార్కులు
TS TET 2024 కటాఫ్ మార్కులను ఈ ఆర్టికల్ లో కేటగిరీ ప్రకారంగా వివరంగా తెలుసుకోవచ్చు.
TS TET కటాఫ్ 2024 కేటగిరీ ప్రకారంగా : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు జూన్ 12వ తేదీన విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా TS TET 2024 కటాఫ్ గురించి అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం కటాఫ్ మార్కులు చాలా అవసరం, ఈ కటాఫ్ మార్కులను సాధించిన వారికి మాత్రమే రిక్రూట్మెంట్ ప్రక్రియలో ముందుకు వెళ్ళగలరు. TS TET 2024 కటాఫ్ అభ్యర్థుల కేటగిరీను బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఆర్టికల్ లో తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కటాఫ్ 2024 ను వివరంగా తెలుసుకోవచ్చు. టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ లో TET పరీక్ష కు 20% వెయిటేజీ ఉన్న నేపథ్యంలో ఈ మార్కులు కీలకం అని అభ్యర్థులు గుర్తించాలి.
TS TET కటాఫ్ 2024 కేటగిరీ ప్రకారంగా (TS TET Cutoff 2024 for All Categories)
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కటాఫ్ ను అభ్యర్థుల కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
కేటగిరీ | TS TET కటాఫ్ 2024 |
జనరల్ కేటగిరీ | తెలియాల్సి ఉంది |
BC | తెలియాల్సి ఉంది |
SC | తెలియాల్సి ఉంది |
ST | తెలియాల్సి ఉంది |
PH | తెలియాల్సి ఉంది |
TS TET 2024 క్వాలిఫయింగ్ మార్కులు ( TS TET 2024 Qualifying Marks)
తెలంగాణ TET 2024 పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా మారుతూ ఉంటాయి. అభ్యర్థులు ఈ క్రింది పట్టిక ద్వారా TS TET 2024 ఉతీర్ణత మార్కులను తెలుసుకోవచ్చు.
కేటగిరీ | ఉత్తీర్ణత శాతం | ఉత్తీర్ణత మార్కులు |
జనరల్ | 60% | 90 |
BC | 50% | 75 |
SC/ST | 40% | 60 |
PH | 40% | 60 |
గమనిక : తెలంగాణ TET ఉత్తీర్ణత మార్కులు అంటే కేవలం అభ్యర్థి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన మార్కులు మాత్రమే, ఉతీర్ణత మార్కులు సాధించిన అందరికీ ర్యాంక్ లభించదు అని గమనించాలి.
TSTET 2024 పరీక్ష ముఖ్యాంశాలు (TSTET 2024 Exam Highlights)
TSTET 2024 ముఖ్యమైన ముఖ్యాంశాలు దిగువ టేబుల్లో పేర్కొనబడ్డాయి:
పరీక్ష పేరు | TSTET (తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష) |
కండక్టింగ్ బాడీ | పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం |
పరీక్ష మోడ్ | ఆఫ్‌లైన్ |
పరీక్ష వ్యవధి | పేపర్ 1: 150 నిమిషాలు పేపర్ 2: 150 నిమిషాలు |
మొత్తం మార్కులు | పేపర్-1: 150 మార్కులు పేపర్-2: 150 మార్కులు |
మొత్తం ప్రశ్నలు | ప్రతి పేపర్‌లో 150 MCQలు |
మార్కింగ్ స్కీం | ప్రతి సరైన సమాధానానికి +1 నెగెటివ్ మార్కింగ్ లేదు |
పరీక్ష హెల్ప్‌డెస్క్ నం. | 040-23120340 |
పరీక్ష వెబ్‌సైట్ | http://tstet.cgg.gov.in/ |
చెల్లుబాటు | జీవింతాంతం |
వెయిటేజీ | టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో 20% వెయిటేజీ |
తెలంగాణ TET 2024 ఫలితాలు ( TS TET Results 2024)
తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) మే 20వ తేదీ నుంచి జూన్ 2వ తేదీల్లో జరిగాయి. సంబంధిత తెలంగాణ టెట్ ఫలితాలు జూన్ 12, 2024న రిలీజ్ కానున్నాయి. TS TET ఫలితాన్ని పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ వారి అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేయనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా వారి ఫలితాలను తెలుసుకోవచ్చు మరియు ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ TET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.