TS TET 2023 ఫలితాలు (TS TET 2023 Results) విడుదల, ఇలా చేక్ చేసుకోండి
TS TET 2023 ఫలితాలు (TS TET 2023 Results) సెప్టెంబర్ 27 తేదీన విడుదలయ్యాయి. ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోండి.
TS TET 2023 ఫలితాలు (TS TET 2023 Results) : తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ తెలంగాణ టెట్ ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేసింది. ఇక్కడ ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆగస్టు 1, 2023 తేదీన TS TET 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2023–2024 విద్యా సంవత్సరానికి TS TET పరీక్ష కోసం ఆగస్టు 2, 2023 తేదీ నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , మరియు ఆగస్టు 16, 2023 తేదీన ముగిసింది. అప్లికేషన్ ఫార్మ్ ని పూర్తి చేయడం ద్వారా, ఆసక్తి గల అభ్యర్థులు కోరుకున్న స్థానానికి దరఖాస్తు చేసుకోవచ్చు. TS TET 2023 పరీక్షను సెప్టెంబర్ 15, 2023 తేదీన , రెండు వేర్వేరు పరీక్షా సెషన్లలో నిర్వహించాల్సి ఉంది. TS TET 2023 పరీక్ష ఫలితాలు (TS TET 2023 Results) సెప్టెంబర్ 27, 2023 తేదీన విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: ఉదయం 10 గంటలకే తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
ఇది కూడా చదవండి: TS TET ఫలితాల డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ చూడండి
TS TET 2023 ఫలితాలు ముఖ్యాంశాలు (TS TET 2023 Results Highlights)
TS TET 2023 ఫలితాలు (TS TET 2023 Results) ముఖ్యాంశాలు దిగువ టేబుల్లో పేర్కొనబడ్డాయి:
పరీక్ష పేరు | TSTET (తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష) |
కండక్టింగ్ బాడీ | పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం |
పరీక్ష మోడ్ | ఆఫ్‌లైన్ |
పరీక్ష వ్యవధి | పేపర్ 1: 150 నిమిషాలు పేపర్ 2: 150 నిమిషాలు |
మొత్తం మార్కులు | పేపర్-1: 150 మార్కులు పేపర్-2: 150 మార్కులు |
మొత్తం ప్రశ్నలు | ప్రతి పేపర్‌లో 150 MCQలు |
మార్కింగ్ స్కీం | ప్రతి సరైన సమాధానానికి +1 నెగెటివ్ మార్కింగ్ లేదు |
పరీక్ష హెల్ప్‌డెస్క్ నం. | 040-23120340 |
పరీక్ష వెబ్‌సైట్ | http://tstet.cgg.gov.in/ |
చెల్లుబాటు | జీవింతాంతం |
వెయిటేజీ | టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో 20% వెయిటేజీ |
TS TET 2023 ఫలితాలు తేదీలు (TS TET 2023 Results Dates )
TSTET 2023 పరీక్ష తేదీలు విడుదల చేయబడ్డాయి, పూర్తి సమాచారం క్రింది టేబుల్ లో గమనించండి.
ఈవెంట్స్ | పరీక్ష తేదీ |
TSTET నోటిఫికేషన్ విడుదల తేదీ 2023 | 01 ఆగస్టు 2023 |
TSTET అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభం తేదీ | 02 ఆగస్టు 2023 |
TSTET అప్లికేషన్ ఫార్మ్ ముగింపు తేదీ | 16 ఆగస్టు 2023 |
TSTET హాల్ టికెట్ విడుదల తేదీ | 09 సెప్టెంబర్ 2023 |
TSTET పరీక్ష తేదీ 2023 | 15 సెప్టెంబర్ 2023 |
TSTET ఫలితం విడుదల 2023 | 27 సెప్టెంబర్ 2023 |
TSTET 2023 హాల్ టికెట్ (TSTET 2023 Admit Card)
TSTET 2023 హాల్ టికెట్ TSTET యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో 09 సెప్టెంబర్ 2023 తేదీన విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం అధికారిక వెబ్‌సైట్ నుండి వారి TSET 2023 హాల్ టికెట్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి దిగువ పేర్కొన్న స్టెప్స్ ని తప్పనిసరిగా పూర్తి చేయాలి.
- TSTET అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- ''డౌన్‌లోడ్ హాల్ టికెట్'' ఎంపికను ఎంచుకోండి
- అభ్యర్థి ID మరియు తేదీ పుట్టిన తేదీని నమోదు చేయండి
- సబ్మిట్ పై క్లిక్ చేయండి.
TSTET 2023 కోసం హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. హాల్ టికెట్ ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అభ్యర్థులు తప్పనిసరిగా సమాచారం (అభ్యర్థి పేరు, ఫోటోగ్రాఫ్, సంతకం మరియు మొదలైనవి) ఏవైనా వ్యత్యాసాల కోసం తనిఖీ చేయాలి మరియు వాటిని సరిదిద్దడానికి వెంటనే పరీక్ష అధికారులకు సమర్పించండి. సమాచారం మొత్తం సరైనది అయితే హాల్ టికెట్ ప్రింటౌట్ తీసుకొని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
TS TET 2023 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? (How to Check TS TET 2023 Result?)
TS TET 2023 ఫలితాలను(TS TET 2023 Results) చెక్ చేయడానికి అభ్యర్థులు అనుసరించాల్సిన స్టెప్స్ ఇక్కడ గమనించండి. లేదా ఈ ఆర్టికల్ లో అందించిన డైరెక్ట్ లింక్ ద్వారా కూడా అభ్యర్థులు వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.- TS TET అధికారిక వెబ్సైటు http://tstet.cgg.gov.in ను ఓపెన్ చేయండి.
- TS TET 2023 ఫలితాలు అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయండి.
- సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- భవిష్యత్తు అవసరం కోసం మీ ఫలితాలను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
TS TET 2023 ఫలితాల డైరెక్ట్ లింక్ (TS TET 2023 Results direct Link)
TS TET 2023 ఫలితాల (TS TET 2023 Results) కోసం క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయాలిTS TET 2023 ఫలితాల డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి |
TS TET 2023 గురించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.