TSRJC CET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TSRJC CET 2023 Previous Year Question Papers)మరియు మోడల్ పేపర్ PDF డౌన్లోడ్
TSRJC CET 2023 పరీక్ష మే 06, 2023 తేదీన జరగనుంది. TSRJC CET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలను (TSRJC CET 2023 Previous Year Question Papers)ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSRJC CET 2023 Previous Year Question Papers : తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష కు అప్లికేషన్ గడువు ఏప్రిల్ 15,2023 తేదీతో ముగిసింది. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు TSRJC CET 2023 పరీక్షను వ్రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలల్లో అడ్మిషన్ లభిస్తుంది. ఈ కళాశాలల సంఖ్య తక్కువగా ఉండడం మరియు ఈ కళాశాలల్లో నాణ్యమైన విద్య లభించడంతో TSRJC CET 2023 పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుంది.
TSRJC CET 2023 పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించాలి అంటే విద్యార్థులు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు ఇవే మొదటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు. అయితే విద్యార్థులు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. TSRJC CET 2023 పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వడానికి గత సంవత్సర ప్రశ్న పత్రాలు ఉపయోగపడతాయి. విద్యార్థులు ఈ ఆర్టికల్ లో TSRJC CET 2023 గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వవచ్చు.
ఇది కూడా చదవండి - APRJC CET గత సంవత్సర ప్రశ్న పత్రాలు
TSRJC CET 2023 ముఖ్యమైన తేదీలు (TSRJC CET 2023 Important Dates)
TSRJC CET 2023 పరీక్షకు సంబందించిన ముఖ్యమైన తేదీల వివరాలను ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
కార్యక్రమం | తేదీలు |
TSRJC CET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల | ఫిబ్రవరి 02,2023 |
TSRJC CET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి చివరి తేదీ | ఏప్రిల్ 15, 2023 |
TSRJC CET 2023 హాల్ టికెట్ విడుదల | ఏప్రిల్ చివరి వారం,2023 |
TSRJC CET 2023 పరీక్ష తేదీ | మే 06, 2023 |
TSRJC CET 2023 ఫలితాల విడుదల | తెలియాల్సి ఉంది |
TSRJC CET 2023 కౌన్సెలింగ్ తేదీలు | తెలియాల్సి ఉంది |
TSRJC CET 2023 పరీక్ష సరళి (TSRJC CET 2023 Exam Pattern)
TSRJC CET 2023 పరీక్ష మొత్తం ఐదు స్ట్రీమ్ లకు నిర్వహిస్తారు. ఈ క్రింది పట్టికలో ప్రతీ స్ట్రీమ్ కు ఇచ్చే సిలబస్ మరియు సబ్జెక్టుల వివరాలు తెలుసుకోవచ్చు.
స్ట్రీమ్ | సబ్జెక్టులు | సమయం | మార్కులు |
| ఫిజిక్స్ మాథెమాటిక్స్ ఇంగ్లీష్ |
|
|
BiPC | బయాలజీ ఫిజిక్స్ ఇంగ్లీష్ |
|
|
MEC/CEC | సోషల్ స్టడీస్ మాథెమటిక్స్ ఇంగ్లీష్ | 150 నిమిషాలు | 150 |
EET | ఇంగ్లీష్ మాథెమటిక్స్ ఫిజిక్స్ | 150 నిమిషాలు | 150 |
CGDT | బయాలజీ ఫిజిక్స్ ఇంగ్లీష్ |
| 150 |
గమనిక : ప్రతీ స్ట్రీమ్ కు మూడు సబ్జెక్టుల నుండి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పేపర్ యొక్క మొత్తం మార్కులు 150. ప్రతీ సబ్జెక్టు నుండి 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలు అన్నీ 10వ తరగతి సిలబస్ ఆధారంగా ఉంటాయి.
TSRJC CET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TSRJC CET 2023 Previous Year Question Papers)
విద్యార్థులు ఈ క్రింది పట్టికలో TSRJC CET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలను సబ్జెక్టు ప్రకారంగా PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
TSRJC CET ఇంగ్లీష్ ప్రశ్న పత్రం | ఇక్కడ క్లిక్ చేయండి |
TSRJC CET ఫిజిక్స్ మరియు బయాలజీ ప్రశ్న పత్రం | ఇక్కడ క్లిక్ చేయండి |
TSRJC CET మాథెమాటిక్స్ ప్రశ్న పత్రం | ఇక్కడ క్లిక్ చేయండి |
TSRJC CET మోడల్ ప్రశ్న పత్రం | ఇక్కడ క్లిక్ చేయండి |
విద్యార్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వవచ్చు.
TSRJC CET 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.