TS DEECET 2025 Exam Dates: తెలంగాణ డీసెట్ 2025 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్, సిలబస్, రిజల్ట్స్, కౌన్సెలింగ్

టీఎస్ డీసెట్ 2025ని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశం పొందడానికి సంవత్సరానికి ఒక్కసారి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన (TS DEECET 2025 Exam Dates) ముఖ్యమైన  తేదీలు, ఇతర వివరాలని ఈ ఆర్టికల్లో అందజేశాం. 

టీఎస్ డీసెట్ 2025 పరీక్షా తేదీలు (TS DEECET 2025 Exam Dates): టీఎస్ డీసెట్ 2025 (TS DEECET 2025) లేదా తెలంగాణ స్టేట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్షని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో అభ్యర్థులు రెండు సంవత్సరాల DElEd (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్),  DPSE (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్)లో ప్రవేశం పొందడానికి రాష్ట్ర స్థాయిలో సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. టీఎస్ డీసెట్ 2025కి (TS DEECET 2025 Exam Dates)సంబంధించిన ముఖ్యమైన తేదీలు , దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఎంట్రన్స్ పరీక్ష, అడ్మిషన్ ప్రక్రియ వంటి అన్ని ముఖ్యమైన వివరాలని తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ని తప్పక చదవండి. 

టీఎస్ డీసెట్ 2025 గురించి (About TS DEECET 2025)

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ DEECET 2025 DEECET కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇది కంప్యూటర్-ఆధారిత పరీక్ష. దీనికి సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి సమాచార బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

తెలంగాణ డీసెట్ 2025 హైలెట్స్ (TS DEECET 2025 Highlights)

తెలంగాణ డీసెట్ 2025 కి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ దిగువున టేబుల్లో తెలుసుకోవచ్చు. 

ఎగ్జామ్ నేమ్          టీఎస్ డీసెట్
ఫుల్ నేమ్      తెలంగాణ స్టేట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024
ఎగ్జామ్ లెవల్        రాష్ట్రస్థాయి
రాష్టం పేరు        తెలంగాణ
కండక్టడ్  అథారిటీ    పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం
అప్లికేషన్ మోడ్    ఆన్‌లైన్
ఎగ్జామ్ మీడియం      ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ
ఎగ్జామ్ డ్యురేషన్      రెండు గంటలు
ఎగ్జామినేషన్ మోడ్            కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆన్‌లైన్)
క్వశ్చన్ టైప్            అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్

టీఎస్ డీసెట్ 2025 ముఖ్యమైన తేదీలు (TS DEECET 2025 Important Dates)

తెలంగాణ డీసెట్ 2025 కోసం అధికారిక తేదీలు ఇప్పటికే విడుదలయ్యాయి. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ డీసెట్ 2025 (TS DEECET 2025) ముఖ్యమైన తేదీలని ఈ దిగువున చెక్ చేయవచ్చు.

ముఖ్యమైన ఈవెంట్స్

ముఖ్యమైన తేదీలు

TS DEECET 2025 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభం

మార్చి 2025

TS DEECET 2025 అప్లికేషన్ సబ్మిషన్‌ని చివరి తేదీ

ఏప్రిల్ 2025

 TS DEECET 2025 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 

తెలియాల్సి ఉంది

TS DEECET 2025 అడ్మిట్ కార్డు విడుదల

తెలియాల్సి ఉంది

TS DEECET 2025 ఎంట్రన్స్ పరీక్ష

జూన్ 2025
TS DEECET 2025 ఆన్సర్ కీతెలియాల్సి ఉంది
TS DEECET 2025 ఫలితాలుతెలియాల్సి ఉంది

టీఎస్ డీసెట్ 2025 అర్హత ప్రమాణాలు (TS DEECET 2025 Eligibility Criteria)

అర్హతలు ఉన్న అభ్యర్థులు TS DEECET 2025 ఎంట్రన్స్ పరీక్ష కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష కోసం ఏ అర్హత ప్రమాణాలు ఉండాలో ఈ దిగువున అందజేయడం జరిగింది. 

  • అభ్యర్థి భారతీయ జాతీయుడై ఉండాలి
  • తెలంగాణ ఎడ్యుకేషనల్ సంస్థల (అడ్మిషన్ ) ఆర్డర్, 1974 ప్రకారం స్థానిక/స్థానేతర స్థితి అవసరాలకు అనుగుణంగా ఉండాలి. 
  • అభ్యర్థులు TS DEECET 2025 లో ర్యాంక్ పొంది ఉండాలి. ప్రభుత్వ DIET, ప్రవేట్ ఎలిమెంటరీ టీచర్ విద్యా సంస్థలలో A, B కేటగిరీ సీట్లలో సీట్ల కేటాయింపు కోసం ఈ దిగువ ఇవ్వబడిన ఎడ్యుకేషనల్ అర్హతలను కలిగి ఉండాలి.
  • ర్యాంక్ పొందడానికి OC, BC వర్గాల అభ్యర్థులైతే TS DEECETలో 35 శాతం మార్కులు సంపాదించాలి. SC, ST కేటగిరీల అభ్యర్థులకు సీట్ల కేటాయింపు కోసం ఎటువంటి కనీస మార్కులు లేవు. 

ఎడ్యుకేషనల్ అర్హతలు (Educational Qualifications)

అభ్యర్థులు TS DEECET 2025 కోసం ఈ దిగువ ఇవ్వబడిన ఎడ్యుకేషనల్ అర్హతలు ఉండాలి. 

  • దరఖాస్తుదారు తప్పనిసరిగా TS DEECET కమిటీ నిర్ణయించిన ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అడ్మిషన్ సమయానికి ఇంటర్మీడియట్ పరీక్షలో పాసై ఉండాలి
  • TS DEECET 2025కి హాజరు కావడానికి దరఖాస్తుదారు అర్హత పరీక్షలో మొత్తం 50%  మార్కులు సాధించి ఉండాలి. SC, ST శారీరక వికలాంగ అభ్యర్థుల విషయంలో మార్కులు కనీస శాతం 45% ఉంటుంది.

వయస్సు ప్రమాణాలు (Age Criteria)

  • అభ్యర్థికి అడ్మిషన్ సంవత్సరం సెప్టెంబర్ 1 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అడ్మిషన్ నుంచి D.EI.Ed/DPSE ప్రోగ్రామ్‌కు గరిష్ట వయోపరిమితి లేదు.

గమనిక: ఒకేషనల్ కోర్సులతో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తెలంగాణ డీఈఈసెట్ 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.

TS DEECET 2025 అప్లికేషన్ ఫార్మ్ (TS DEECET 2025 Application Form)

TS DEECET 2025 కోసం దరఖాస్తు చేసుకోడానికి అభ్యర్థులు ముందుగా టీఎస్ డీసెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఉచిత సమాచార బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ఉన్న విధంగా అభ్యర్థులు తమ అర్హతలను కలిగి ఉన్నారో? లేదో? చెక్ చేసుకోవాలి. తర్వాత  అభ్యర్థి చెల్లింపు గేట్‌వే సేవ ద్వారా రూ.450 ఫీజు చెల్లించాలి. చెల్లింపు గేట్‌వే వద్ద అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫిల్ చేయాలి. ఫీజు రసీదు తర్వాత అభ్యర్థికి రిఫరెన్స్ ID ఇవ్వబడుతుంది. దాంతో అభ్యర్థి దరఖాస్తు సబ్మిషన్‌ని కొనసాగించవచ్చు. 

TS DEECET 2025 దరఖాస్తు ఫీజు (TS DEECET 2025 Application Fee)

TS DEECET 2025 కోసం దరఖాస్తు ఫీజు రూ. 450లు. అభ్యర్థులు తప్పనిసరిగా TS DEECET 2025 దరఖాస్తు ఫీజును అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తు ఫీజుని క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. 

సాధారణ, వెనుకబడిన వారికి క్లాస్రూ. 450
షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, PHC అభ్యర్థులకురూ. 450

TS DEECET 2025 అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా పూరించాలి? (How to Fill TS DEECET 2025 Application Form?)

దరఖాస్తు ఫీజును చెల్లించిన తర్వాత అభ్యర్థులు TS DEECET 2025 కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని 'సబ్మిట్ అప్లికేషన్'పై క్లిక్ చేయడం ద్వారా పూరించాలి. TS DEECET 2025 కోసం అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేసే విధానం ఈ దిగువున అందజేయడం జరిగింది. 
  • అప్లికేషన్ ఫార్మ్‌లో సమాచారాన్ని పూరించిన తర్వాత అభ్యర్థి తన ఫోటోని, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో 50 kb, సంతకం చేసిన ఇమేజ్ 30 kb కంటే తక్కువ సైజ్ ఉండాలి. 
  • ఫోటోని తెల్ల కాగితంపై అతికించి ఉండాలి.  దాని కింద అభ్యర్థి సంతకం చేయాలి. సంతకం అని సూచించిన బాక్స్‌లో సరిపోయేలా చూసుకోవాలి. ఫోటోగ్రాఫ్,  సంతకంతో సహా అవసరమైన సైజ్‌ని స్కాన్ చేసి, స్థానిక మెషీన్‌లో JPG ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలి. 
  • ఫోటో లేని లేదా సరైన సైజుతో అస్పష్టమైన ఫోటో/ఫోటో లేని అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. అలాంటి అభ్యర్థులకు హాల్ టికెట్ ఇవ్వరు. కాబట్టి అప్‌లోడ్ బటన్‌ను నొక్కిన తర్వాత అభ్యర్థి వీటన్నింటినీ చెక్ చేసుకోవాలి. 
  • ఫోటో, అభ్యర్థి డీటెయిల్స్ సరిపోలకపోవడం గురించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే దరఖాస్తు సబ్మిషన్ తర్వాత వారిని పరిగణలోకి తీసుకోరు. 

తెలంగాణ డీసెట్ 2025 పరీక్షా నమూనా (TS DEECET 2025 Exam Pattern)

తెలంగాన డీసెట్ పరీక్ష గురించి పూర్తి అవగాహనను పొందడానికి TS DEECET 2025 పరీక్షా సరళిని తెలుసుకోవాలి. వివరాలు కింద పట్టికలో ఉన్నాయి. 

పరీక్షా విధానం: TS DEECET ఆన్‌లైన్ మోడ్‌లో (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) మాత్రమే నిర్వహించబడుతుంది. 
ప్రశ్నల సంఖ్య: TS DEECET కోసం మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 
పరీక్ష వ్యవధి: పరీక్ష 2 గంటల 30 నిమిషాలు అంటే 150 నిమిషాల వ్యవధి ఉంటుంది. 
మార్కింగ్ స్కీమ్: దరఖాస్తుదారుకు ప్రతి సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది. 
నెగెటివ్ మార్కింగ్ స్కీమ్: ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

TS DEECET 2025 పరీక్షా సరళి/ఎంట్రన్స్ పరీక్ష విధానం (TS DEECET 2025 Exam Pattern/Scheme of Entrance Exam)

TS DEECET 2025 ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. పరీక్ష పేపర్ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. పేపర్ 100 ప్రశ్నలతో మూడు భాగాలను కలిగి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.

మీడియం

విషయం/ టాపిక్

ప్రశ్నల సంఖ్య

మార్కులు

తెలుగు

పార్ట్ I

జనరల్ ఇంగ్లీష్,  టీచింగ్ ఆప్టిట్యూడ్

10

10

పార్ట్ II

సాధారణ ఇంగ్లీష్

10

10

సాధారణ తెలుగు

20

20

పార్ట్ III

సబ్జెక్ట్ నిర్దిష్ట (అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్)

ప్రశ్నల సంఖ్య

ప్రశ్నల సంఖ్య

మ్యాథ్స్

20

20

ఫిజికల్ సైన్సెస్

10

10

జీవ శాస్త్రాలు

10

10

సామాజిక శాస్త్రాలు

20

20

మొత్తం (పార్ట్ I, II & III)

100

100

ఆంగ్ల

పార్ట్ I

జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్

10

10

పార్ట్ II

సాధారణ ఇంగ్లీష్

20

20

సాధారణ తెలుగు/ ఉర్దూ (అభ్యర్థి ఎంపిక చేసుకున్నట్లుగా)

10

10

పార్ట్ III

సబ్జెక్ట్ నిర్దిష్ట (అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్

ప్రశ్నల సంఖ్య

ప్రశ్నల సంఖ్య

గణితం

20

20

ఫిజికల్ సైన్స్

10

10

జీవ శాస్త్రం

10

10

సామాజిక అధ్యయనాలు

20

20

మొత్తం (పార్ట్ I, II & III)

100

100

టీఎస్ డీసెట్ 2025 సిలబస్ (TS DEECET 2025 Syllabus)

TS DEECET 2025 సిలబస్ సాధారణ ఇంగ్లీష్, మ్యాథ్స్ వంటి విభాగాలను కలిగి ఉంటుంది. పార్ట్ II, పార్ట్ III కోసం అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని సిలబస్ తరగతుల VIII నుంచి X వరకు సిలబస్ గురించి బాగా తెలుసుకోవాలి.

మీడియంభాగంమొత్తం మార్కులు
ఆంగ్ల

పార్ట్ I- జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్

పార్ట్ II- జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఉర్దూ/తెలుగు (అభ్యర్థులు ఎంచుకున్నట్లు)

పార్ట్ III- మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్

100
తెలుగు

పార్ట్ I- జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూట్

పార్ట్ II- జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్

పార్ట్ III- గణితం, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్

100
ఉర్దూ

పార్ట్ I- జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూట్

పార్ట్ II- జనరల్ ఉర్దూ, జనరల్ ఇంగ్లీష్

పార్ట్ III- మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్

100

టీఎస్ డీసెట్ 2025 హాల్ టికెట్ (TS DEECET 2025 Hall Ticket)

వెబ్‌సైట్‌లో నోటిఫై చేసిన తేదీ ప్రకారం అభ్యర్థులు తమ TS DEECET 2025 హాల్ టిక్కెట్‌లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌ల డౌన్‌లోడ్‌కు సంబంధించిన తేదీల్లోని సమాచారానికి సంబంధించి అధికారిక సైట్‌ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి నిర్దేశిత సమయంలోగా హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేకపోతే హెల్ప్‌లైన్‌ను సంప్రదించి క్లారిటీ తీసుకోవచ్చు. 

TS DEECET 2025 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి దశలు (Steps for downloading TS DEECET 2025 Admit Card)

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • ఇప్పుడు, అభ్యర్థి TS DEECET 2025 అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్ లేదా అడ్మిషన్ టికెట్) లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • అభ్యర్థి తప్పనిసరిగా లాగిన్ వివరాలు, అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. 
  • అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.
  • TS DEECET అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

టీఎస్ డీసెట్ 2025 ఫలితాలు, ర్యాంక్ కార్డు (TS DEECET 2025 Results and Rank Card)

TS DEECET 2025 ఫలితాలు పరీక్ష పూర్తైన 40 రోజుల తర్వాత విడుదల అవుతాయి.  మార్కులు, ర్యాంక్‌ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించడం జరుగుతుంది. కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి అభ్యర్థులు TS DEECET 2025 ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS DEECET 2025 అడ్మిషన్ ప్రాసెస్

TS DEECET 2025కి అడ్మిషన్ నుంచి 85% సీట్లు స్థానిక అభ్యర్థులకు, మిగిలిన 15% సీట్లు తెలంగాణ ఎడ్యుకేషనల్ సంస్థల (నిబంధనలు, ప్రవేశాలు) ఆర్డర్, 1974 ప్రకారం అన్‌రిజర్వ్‌డ్ కోసం రిజర్వ్ చేయబడతాయి.

టీఎస్ డీసెట్ 2025 ప్రిపరేషన్ టిప్స్ (TS DEECET 2024 Preparation Tips)

తెలంగాణ డీసెట్ 2025 ప్రిపరేషన్ టిప్స్ గురించి ఈ దిగువున తెలియజేయడం జరిగింది. ఈ టిప్స్ కచ్చితంగా అభ్యర్థులకు ఉపయోగపడతాయి. 

  • దరఖాస్తుదారు వివరణాత్మక సిలబస్‌ను సూచించాలి. 
  • అన్ని అంశాలను కవర్ చేయడానికి ప్రయత్నించాలి. 
  • కరెంట్ అఫైర్స్‌పై అవగాహనను పెంపొందించుకోవడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా జర్నల్స్/వార్తాపత్రికలను రోజూ చదవాలి. దరఖాస్తుదారులు ప్రతి విభాగానికి సమాన సమయాన్ని ఇచ్చే టైమ్‌టేబుల్‌ను రూపొందించాలి. 
  • అభ్యర్థులు వీలైనన్ని మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం/మాక్ టెస్ట్‌లను పరిష్కరించడానికి ప్రయత్నించాలి.    

 TS DEECET 2025 అప్‌డేట్స్ కోసం CollegeDekhoని చూస్తూనే ఉండండి

Get Help From Our Expert Counsellors

Admission Updates for 2025

  • LPU
    Phagwara
  • Doaba College
    Jalandhar

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Related Questions

Crystal Teacher Training Institute ko kon sa approval hai?

-Dharmendra kumarUpdated on February 21, 2025 04:00 PM
  • 1 Answer
Sukriti Vajpayee, Content Team

Dear student,

Crystal Teacher Training Institute, Chhattarpur, ko NCTE (National Council for Teacher Education) se approval mila hai. Is college se aap Diploma aur Certificate level k courses complete kar sakte hain.

READ MORE...

In which chapters they will give problems for 2marks

-Yasoda GUpdated on February 27, 2025 05:30 PM
  • 1 Answer
Jayita Ekka, Content Team

Dear student,

Crystal Teacher Training Institute, Chhattarpur, ko NCTE (National Council for Teacher Education) se approval mila hai. Is college se aap Diploma aur Certificate level k courses complete kar sakte hain.

READ MORE...

What is the per semester fees for D.El.Ed? Can I do it from a private college?

-AnonymousUpdated on March 12, 2025 02:24 PM
  • 1 Answer
Sukriti Vajpayee, Content Team

Dear student,

Crystal Teacher Training Institute, Chhattarpur, ko NCTE (National Council for Teacher Education) se approval mila hai. Is college se aap Diploma aur Certificate level k courses complete kar sakte hain.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్