APPSC Selection Process: ఏపీపీఎస్సీ ఎంపిక విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: January 10, 2024 01:42 pm IST

రాష్ట్రంలో పలు శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్‌ పరీక్షలను నిర్వహిస్తుంది.  ఏపీపీఎస్సీ ఎంపిక విధానం గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
విషయసూచిక
  1. ఏపీపీఎస్సీ అంటే ఏమిటీ? (What is APPSC?)
  2. APPSC గ్రూప్ 1 దరఖాస్తు ఫార్మ్ తేదీ 2023-24
  3. APPSC గ్రూప్ 1 అప్లికేషన్ 2024: ఖాళీలు (APPSC Group 1 Application …
  4. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 వివరాలు (APPSC Group 2 Notification …
  5. ఏపీపీఎస్సీ 2023 పరీక్షా విధానం (APPSC 2023: Exam Pattern)
  6. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (APPSC Group 1 Prelims …
  7. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ విధానం   (APPSC గ్రూప్ 1 మెయిన్స్ …
  8. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్  పరీక్షా విధానం (Exam Pattern for Group …
  9. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా విధానం (Mains Exam Pattern for …
  10. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (Exam Pattern for Group …
  11. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షా విధానం (APPSC Group 3 Mains …
  12. APPSC గ్రూప్ 4 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (APPSC Exam Pattern for …
  13. APPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షా విధానం (APPSC Mains Exam Pattern …
APPSC Selection Process: ఏపీపీఎస్సీ ఎంపిక విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి

ఏపీపీఎస్సీ ఎంపిక విధానం (APPSC Selection Process): వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా నోటిఫికేషన్లు విడుదలవుతాయి.  ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఏపీపీఎస్సీ గ్రూప్ 3, ఏపీపీఎస్సీ గ్రూప్ 4ల పరీక్షలను నిర్వహిస్తుంది.  ఆయా కేటగిరీల ప్రకారం, ఉద్యోగ ఖాళీల ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు తమ అర్హతలు, అనుకూలత ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  APPSC గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ పేజీలో ఏపీపీఎస్సీ‌కి సంబంధించిన ఎంపిక ప్రక్రియ (APPSC Selection Process) ఎలా జరుగుతుందో? పూర్తి సమాచారం అందజేయడం జరిగింది.

ఇది కూడా చదవండి: APPSC గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే?

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్
APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్, ఇతర సంబంధిత పోస్టులకు క్రమం తప్పకుండా పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పరీక్షలో వివిధ దశలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్,  ఇంటర్వ్యూలలో సెలక్ట్ అవ్వాలి. ఉద్యోగ ఖాళీలను బట్టి అభ్యర్థుల ఎంపిక విధానం భిన్నంగా ఉంటుంది. మొదట అభ్యర్థులు ప్రిలిమ్స్ దశలో ఉత్తీర్ణులైతేనే మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించగలరు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన అభ్యర్థులను మొదట ట్రైనింగ్ ఇవ్వడం జరగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ పూర్తైన తర్వాత అభ్యర్థి వారి పోస్ట్‌కు పోస్ట్ చేయబడతారు.

ఏపీపీఎస్సీ అంటే ఏమిటీ? (What is APPSC?)

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులను నియమించేందుకు వార్షిక రాష్ట్రస్థాయి నియామక పరీక్షను నిర్వహించే రాష్ట్ర పరిపాలనా సంస్థ. APPSC రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ రౌండ్‌లు మూడు దశలుగా ఉంటాయి. ఈ పోస్టుల్లో నియమితులవ్వడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని రౌండ్‌లలో ఉత్తీర్ణత సాధించాలి.   APPSC ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్-టైప్‌లో ఉంటుంది.  APPSC మెయిన్స్ పరీక్ష వివరణాత్మక-రకం పరీక్ష.

APPSC గ్రూప్ 1 దరఖాస్తు ఫార్మ్ తేదీ 2023-24

APPSC గ్రూప్ 1 సర్వీస్‌లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న ఆసక్తి, అర్హత గల దరఖాస్తుదారులందరూ దిగువ పట్టికలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి  షెడ్యూల్‌ను ఇక్కడ చూడవచ్చు.

APPSC గ్రూప్ 1 2024 ఈవెంట్‌లు

తేదీ

నోటిఫికేషన్ విడుదల (నం. 12/2023)

డిసెంబర్ 8, 2023

అప్లికేషన్ ప్రారంభ తేదీ

జనవరి 1, 2024

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ

జనవరి 21, 2024 (11:59 PM నాటికి)

APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్ష తేదీ

మార్చి 17, 2024

AP గ్రూప్ 1 2024 మెయిన్స్ పరీక్ష తేదీ

ఏప్రిల్ 2024 (అంచనా)

APPSC గ్రూప్ 1 అప్లికేషన్ 2024: ఖాళీలు (APPSC Group 1 Application 2024: Vacancies)

వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు APPSC ప్రకటించింది. కమిషన్ షేర్ చేసిన APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024లో ప్రతి కేటగిరీకి సంబంధించిన పోస్ట్‌ల జాబితా షేర్ చేయబడింది. ఇక్కడ ఖాళీల వివరాలను క్లుప్తంగా చెక్ చేయండి.

కేటగిరి

APPSC గ్రూప్ 1 ఖాళీ 2024

గ్రూప్ I పోస్టులు (డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమీషనర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఫైర్ ఆఫీసర్, RTO, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, డిప్యూటీ రిజిస్ట్రార్, మునిసిపల్ కమిషనర్-గ్రేడ్ II, అసిస్టెంట్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, జిల్లా ఉపాధి అధికారి, సహాయ ఆడిట్ అధికారి)

81

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 వివరాలు (APPSC Group 2 Notification 2023 Details)

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 వివరాలను ఈ దిగువున టేబుల్లో అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

APPSC రిక్రూట్‌మెంట్ 2023 APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్
కండక్టింగ్ అథారిటీ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
సంవత్సరం 2023
మొత్తం ఖాళీల వివరాలు 897
APPSC అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం డిసెంబర్ 21, 2023
APPSC ఎగ్జామ్ మోడ్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్
అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in

ఏపీపీఎస్సీ 2023 పరీక్షా విధానం (APPSC 2023: Exam Pattern)


APPSC గ్రూప్ 1, గ్రూప్ 2, 2023కి సంబంధించిన APPSC నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన సూచనల ప్రకారం అప్లికేషన్ పూరించాలి. APPSC నోటిఫికేషన్‌లో పరీక్షకు అవసరమైన మొత్తం సంబంధిత సమాచారం ఉంటుంది. పరీక్షా విధానం ఈ దిగువున తెలిపిన విధానంలో ఉంటుంది.
  • APPSC గ్రూప్ 1 పరీక్ష మూడు దశలు ప్రిలిమినరీ/స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ.
  • స్క్రీనింగ్ పరీక్షలో రెండు పేపర్లు ఒక్కొక్కటి 140 పాయింట్లు, ప్రధాన పరీక్షలో ఏడు 150 పాయింట్లు, ఇంటర్వ్యూలో 75 పాయింట్లు ఉంటాయి.
  • తెలుగు, ఇంగ్లీషు రెండింటిలో అందుబాటులో ఉన్న భాషా పత్రాలు మినహా, పరీక్షా పత్రం, సిలబస్ రెండు భాషలలో అందుబాటులో ఉంటాయి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (APPSC Group 1 Prelims Exam Pattern)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా విధానం దిగువున తెలిపిన విధంగా ఉంటుంది.
పేపర్ సబ్జెక్ట్స్ మొత్తం ప్రశ్నలు మార్కులు టైమ్
1 జనరల్ స్టడీ 120 120 120 నిమిషాలు
2 జనరల్ ఆప్టిట్యూడ్ 120 120 120 నిమిషాలు
మొత్తం మొత్తం 240 240 240

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ విధానం   (APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పాటర్న్)


ఏపీపీఎస్సీ గ్రూప్ 1  మెయిన్స్ పరీక్షా విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరీశీలించవచ్చు.
1 ఇంగ్లీష్ 150 180 నిమిషాలు
2 తెలుగు 150 180 నిమిషాలు
3 పేపర్ 1 జనరల్ ఎస్సై 150 180 నిమిషాలు
4 పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ 150 180 నిమిషాలు
5. పేపర్ 3  రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం, నీతి, 150 180 నిమిషాలు
6. పేపర్ 4 భారతదేశం, ఆంధ్రప్రదేశ్  ఎకనామీ, అభివృద్ధి 150 180 నిమిషాలు
7 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ 150 180 నిమిషాలు

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్  పరీక్షా విధానం (Exam Pattern for Group 2 Prelims)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానం గురించి దిగువున టేబుల్లో అందజేశాం.
సబ్జెక్టులు ప్రశ్నల సంఖ్య మొత్తం మార్కులు టైమ్
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలీటీ 150 150 రెండున్నర గంటలు
ఆంధ్రప్రదేశ్, ఇండియన్ కానిస్టిట్యూషన్ సోషల్, హిస్టరీ కల్చరల్ 150 150 రెండున్నర గంటలు
ఎకానమీ, ప్లానింగ్ 150 150 రెండున్నర గంటలు

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా విధానం (Mains Exam Pattern for Group 2)


ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా విధానం గురించి దిగువున ఇచ్చిన టేబుల్‌ను పరిశీలించండి.

పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 150
2 ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర (ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర) భారత రాజ్యాంగం సాధారణ అవలోకనం 150 150
3 భారతదేశంలో ప్రణాళిక, భారత ఆర్థిక వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక సూచనతో గ్రామీణ సమాజంలో సమకాలీన సమస్యలు, అభివృద్ధి 150 150

ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (Exam Pattern for Group 3 Prelims)

ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ప్రిలిమ్స్ పరీక్షా విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
సెక్షన్ ఏ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 75 75
సెక్షన్ బీ రూరల్ డెవలప్‌మెంట్, గ్రామీణ ఏరియా సమస్యలు 75 75

ఏపీపీఎస్సీ గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షా విధానం (APPSC Group 3 Mains Exam Pattern)

పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 150
పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 150

APPSC గ్రూప్ 4 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (APPSC Exam Pattern for Group 4 Prelims)

ఏపీపీఎస్సీ గ్రూప్ 4 పరీక్షా విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.

సబ్జెక్ట్ మార్కులు
సెక్షన్ ఏ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 100/100
సెక్షన్ బీ జనరల్  ఇంగ్లీష్, జనరల్ తెలుగు 50/50

APPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షా విధానం (APPSC Mains Exam Pattern for Group 4)

APPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షా విధానం గురించి దిగువున అందజేయడం జరిగింది.
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలీటీ 150/150 150 నిమిషాలు
జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు 150/150 150 నిమిషాలు
మొత్తం 300 300


తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కోసం, అప్‌డేట్స్ కోసం Collegedekhoని ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/appsc-selection-process/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!