ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు 2024 ఈరోజు విడుదలవుతాయా? (AP DSC Hall Ticket Download 2024)

Andaluri Veni

Updated On: March 05, 2024 12:02 pm IST

ఏపీ పాఠశాల విద్యాశాఖ ఈరోజు ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లను 2024 విడుదల చేస్తుందా? నిన్న కోర్టు తీర్పును అసరించి హాల్ టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అలాగే హాల్ టికెట్లను డౌన్‌లోడ్ (AP DSC Hall Ticket Download 2024)  చేసుకునే విధానం ఇక్కడ అందజేశాం. 
ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు 2024 ఈరోజు విడుదలవుతాయా? (AP DSC Hall Ticket Download 2024)ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు 2024 ఈరోజు విడుదలవుతాయా? (AP DSC Hall Ticket Download 2024)

ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ 2024 (AP DSC Hall Ticket Download 2024) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ (AP DSC) త్వరలో స్కూల్ అసిస్టెంట్ (SA), ఫిజికల్ డైరెక్టర్ (PD), PGT, TGT, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ హాల్ టికెట్లను ఈరోజు విడుదల చేయనుందా? అనే సందేహాం అందరిలో కలుగుతుంది. సోమవారం ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. మార్చ్ 15 వ తేదీ నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ హాల్ టికెట్ల 2024 విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి : AP DSC 2024 Exam: ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలపై కీలక తీర్పు, ఇలా ఆదేశించిన హైకోర్టు

ఏపీ డీఎస్సీ 2024  నోటిఫికేషన్ ప్రకారం  6100 ఖాళీలను భర్తీ చేయనుంది.  అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.  ముందుగా చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీ డీఎస్సీ పరీక్షలు మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను  (AP DSC Hall Ticket Download 2024) AP DSC అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.inలో ఆన్‌లైన్‌లో డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాఠశాల విద్యాశాఖ  ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ ఆన్సర్ కీ విడుదలవుతుంది. ఏప్రిల్ 7న ఫలితాలు రీలీజ్ చేయనుంది.

AP DSC హాల్ టికెట్లను 2024ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How To Download AP DSC Admit Card 2024)

ఈ  దిగువున వివరించిన విధంగా  అభ్యర్థులు తమ AP DSC 2024 హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు AP DSC అధికారిక వెబ్‌సైట్ లింక్ apdsc.apcfss.in సందర్శించాలి.
  • AP DSC విభాగం కింద హోమ్ పేజీ మధ్యలో "హాల్ టికెట్ డౌన్‌లోడ్" అని ఇచ్చిన బటన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత మీరు  AP DSC టీచర్ రిక్రూట్‌మెంట్ 2024 హాల్ టికెట్ డౌన్‌లోడ్ పేజీకి రీ డైరక్ట్ అవుతారు.
  • హాల్ టికెట్ డౌన్‌లోడ్ పేజీలో పేర్కొన్న ఇన్‌పుట్ ఫీల్డ్‌లో మీ అభ్యర్థి ID, పుట్టిన తేదీ  (dd/mm/yyyy) సరిగ్గా నమోదు చేయండి.
  • తదుపరి కొనసాగించడానికి పేజీలో చూపిన విధంగా ధ్రువీకరణ కోడ్‌ని సరిగ్గా నమోదు చేాయలి.
  • చివరగా AP DSC సర్వర్ నుండి మీ హాల్ టిక్కెట్‌ను పొందడానికి లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి, ఇప్పుడు మీరు దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.

AP DSC హాల్ టికెట్ 2024తో ఏం తీసుకెళ్లాలి? (What to carry with AP DSC Hall Ticket 2024?)

ఏపీ డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి కచ్చితంగా హాల్ టికెట్లను తీసుకెళ్లాలి. దీంతోపాటు  మరి ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఈ దిగువున అందించాం.
  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  • ఓటరు గుర్తింపు కార్డు
  • కాలేజ్ ఐడీ
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తలను https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-dsc-hall-ticket-download-2024-pdf-50455/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!