AP ECET 2023 Exam Postponed: AP ECET 2023 పరీక్ష జూన్ 20కి వాయిదా, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: April 25, 2023 11:37 am IST

ఏపీ ఈసెట్ 2023 పరీక్షా తేదీల్లో మార్పు జరిగింది. ముందు షెడ్యూల్ ప్రకారం మే 5న జరగాల్సిన ఈ పరీక్షని జూన్ 20కి వాయిదా (AP ECET 2023 Exam Postponed) వేయడం జరిగింది. AP ECET 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
AP ECET 2023 PostponedAP ECET 2023 Postponed

ఏపీ ఈసెట్ 2023 పరీక్ష వాయిదా (AP ECET 2023 Exam Postponed): ఏపీ ఈసెట్ 2023 పరీక్ష జూన్ 20కి వాయిదా పడింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ AP ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష తేదీని జూన్ 20, 2023కి వాయిదా (AP ECET 2023 Exam Postponed) వేసింది. మొదటి షెడ్యూల్ ప్రకారం పరీక్ష మే 5, 2023న జరగాల్సి ఉంది. పరీక్ష కోసం విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాలి. అభ్యర్థులు నోటిఫికేషన్, పరీక్ష సిలబస్, ఇతర పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

AP ECET 2023 పరీక్ష రెండు సెషన్‌లలో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.పేపర్ మొత్తం 200 మార్కులకు జరుగుతుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం AP ECET 2023ని నిర్వహించడం జరుగుతుంది.

ఏపీ ఈసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ECET 2023 Exam Dates)

AP ECET 2023 కోసం రిజిస్ట్రేషన్లు మార్చి 10, 2023 నుంచి ప్రారంభమయ్యాయి. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10, 2023న ముగిశాయి. కరెక్షన్ విండో ఏప్రిల్ 20, 2023 నుంచి  ఏప్రిల్ 22, 2023 వరకు ఓపెన్ అయ్యి ఉంది. రూ.5000 ఆలస్య ఫీజుతో ఆన్‌లైన్ దరఖాస్తును సబ్మిట్ చేయడానికి  ఏప్రిల్ 24 చివరి తేదీ. హాల్ టికెట్లు జూన్ 12, 2023న జారీ చేయబడతాయి. పరీక్ష ఆన్సర్ కీ జూన్ 23, 2023న విడుదలవుతుంది.

ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
AP ECET 2023 నోటిఫికేషన్ రిలీజ్ ఫిబ్రవరి 08, 2023
AP ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ మార్చి 10, 2023
AP ECET 2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 10, 2023
AP ECET 2023 అప్లికేషన్ పార్మ్ కరెక్షన్ విండో 20 నుంచి 22 ఏప్రిల్, 2023
AP ECET 2023 అడ్మిట్ కార్డు విడుదల జూన్ 12, 2023
AP ECET 2023 పరీక్షా తేదీ జూన్ 25, 2023

AP ECET 2023 సిలబస్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in లో చూడొచ్చు.  AP ECET సిలబస్ PDFలో అందుబాటులో ఉంది. మాక్ టెస్ట్‌లను, మోడల్ ప్రశ్నాపత్రాలను కూడా ప్రాక్టీస్ చేయవచ్చు.  AP ECET 2023 జూన్ 20న నిర్వహించాల్సి ఉన్నందున కౌన్సెలింగ్ ప్రక్రియ జూలైలో ప్రారంభమవుతుందని, జూలై మొదటి వారంలో రిజల్ట్స్ విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

తెలుగులో మరిన్ని వివరాల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

AP ECET Previous Year Question Paper

AP ECET Biotechnology 2019

AP ECET Biotechnology Answer Key 2019

AP ECET Bsc-mathematics Question Paper 2019

/news/ap-ecet-2023-postponed-new-exam-date-released-39561/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!