AP Grama Sachivalayam Recruitment 2023: ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Andaluri Veni

Updated On: July 06, 2023 02:23 pm IST

14493  ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ (AP Grama Sachivalayam Recruitment 2023) త్వరలో విడుదలకానుంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటో? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 
AP Grama Sachivalayam Recruitment 2023: ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?AP Grama Sachivalayam Recruitment 2023: ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఏపీ గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్ 2023 (AP Grama Sachivalayam Recruitment 2023): ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 14493 సచివాలయ పోస్టులకు (AP Grama Sachivalayam Recruitment 2023) సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానుంది. చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.   ఆ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కూడా త్వరలో అనౌన్స్ చేయబడుతుంది. సంబంధిత వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లోకి gramawardsachivalayam.ap.gov.in వెళ్లి చూడొచ్చు.

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (AP Grama Sachivalayam Recruitment 2023 Details)

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్‌కు 2023 సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.

కండక్టింగ్ బాడీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం ఖాళీల వివరాలు 14000
పోస్టు పేరు డిజిటల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ
ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ రిలీజ్ డేట్ త్వరలో
దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ త్వరలో
వయస్సు పరిమితి 18 నుంచి 42
అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in, gramawardsachivalayam.ap.gov.in


ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023 అర్హత ప్రమాణాలు (AP Grama Sachivalayam Notification 2023 Eligibility)

AP గ్రామ సచివాలయం ఉద్యోగాలకు అప్లై చేసుకునే ముందు ముందుగా అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు కావాల్సిన అర్హత ప్రమాణాలను తెలుసుకోవాలి.
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి (BA, BSc లేదా బీటెక్) గ్రాడ్యుయేషన్‌లో  పాసై ఉండాలి.
  • అభ్యర్థులు తమ డిగ్రీలో 45 శాతం కంటే ఎక్కువ మార్కులను పొంది ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థుల రిజర్వేషన్‌ బట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు పదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల పరిశీలనతో ఎంపిక చేయడం జరుగుతుంది.

AP గ్రామ సచివాలయం ఉద్యోగాలు 2023కి ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply to AP Grama Sachivalayam Jobs 2023)

ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in కి వెళ్లాలి.
  • ఆ తర్వాత  హోంపేజీలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్‌ని ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవాలి.
  • అనంతరం దరఖాస్తు ఫార్మ్‌లో అవసరమైన అన్ని సరైన వివరాలతో ఫార్మ్‌ను పూరించాలి.
  • అన్ని వివరాలను ధ్రువీకరించి,  తర్వాతి దశకు కొనసాగాలి.
  • తర్వాత సంతకం, ఆధార్ కార్డ్, ఫోటో, మార్క్‌షీట్‌ల వంటి డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి.
  • చివరగా ఫార్మ్‌ను సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్‌ని నిర్ధారించడానికి దరఖాస్తు ఫార్మ్‌ ఫీజు చెల్లించాలి.
  • ఇప్పుడు మీరు AP గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తలు https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-grama-sachivalayam-recruitment-2023-42799/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!