AP Inter Results Revaluation 2023: ఏపీ ఇంటర్ ఫలితాల రీ వాల్యుయేషన్ 2023 షెడ్యూల్‌, దరఖాస్తు విధానం ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: April 26, 2023 07:09 pm IST

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 విడుదలయ్యాయి. ఫలితాల రీ వాల్యుయేషన్‌కు సంబంధించిన షెడ్యూల్, దరఖాస్తు విధానం (AP Inter Results Revaluation 2023) గురించి ఇక్కడ వివరంగా అందజేశాం. 
AP Inter Results Revaluation 2023: ఏపీ ఇంటర్ ఫలితాల రీ వాల్యుయేషన్ 2023  షెడ్యూల్‌, దరఖాస్తు విధానం ఇక్కడ తెలుసుకోండిAP Inter Results Revaluation 2023: ఏపీ ఇంటర్ ఫలితాల రీ వాల్యుయేషన్ 2023 షెడ్యూల్‌, దరఖాస్తు విధానం ఇక్కడ తెలుసుకోండి

ఏపీ ఇంటర్ ఫలితాల రీ వాల్యుయేషన్ 2023 (AP Inter Results Revaluation 2023): ఏపీ ఇంటర్ ఫలితాలు 2023 విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు  ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల  ఫలితాలు ఒకేసారి విడుదల చేసింది. చాలా మంది విద్యార్థులు మంచి గ్రేడ్‌లతో ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఏమైనా సందేహాలుంటే వాటిని తీర్చుకునేందుకు  విద్యార్థులు రీవాల్యుయేషన్ ప్రక్రియను (AP Inter Results Revaluation 2023) చేపట్టవచ్చు.  జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు  చేసుకోవచ్చు. అభ్యర్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్ డ్ ద్వారా అప్లై చేసుకోవాలి.

విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్  పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి  ఉంటుంది. అంతకంటే తక్కువ మార్కులు పొందినవారు, రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయినవారు తమ జవాబు పత్రాలను రీచెకింగ్ లేదా రీ వాల్యుయేషన్ కోసం పంపవచ్చు. దానికోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. జవాబు పత్రాల రీ వాల్యుయేషన్ తర్వాత  విద్యార్థుల సవరించిన మార్కులు ఆధారంగా మార్కుషీట్లలో అప్‌డేట్ చేయబడతాయి.

ఏపీ ఇంటర్ 2023 ఫలితాల రీ వాల్యుయేషన్  ముఖ్యమైన తేదీ (Revaluation of AP Inter 2023 Results Important Dates)

ఏపీ ఇంటర్ 2023 ఫలితాల రీ వాల్యుయేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఇక్కడ చూడండి.
పరీక్ష నిర్వహణ అధికారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్
పరీక్ష పేరు ఇంటర్మీడియట్  ఎగ్జామ్
AP ఇంటర్మీడియట్ రీవాల్యుయేషన్ ఫార్మ్ చివరి తేదీ తెలియాల్సి ఉంది
లొకేషన్ ఆంధ్రప్రదేశ్
కేటగిరి రీవాల్యుయేషన్ ఫలితం
అధికారిక వెబ్‌సైట్ http://bieap.gov.in/

AP ఇంటర్మీడియట్ ఫలితాలు, రీవాల్యుయేషన్/రీకౌంటింగ్ ప్రక్రియ కోసం ఎలా దరఖాస్తు చేయాలి (How to apply for AP Intermediate results, revaluation process)

విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం  రీవాల్యుయేషన్, రీ చెకింగ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకునే విధానం ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
  • అధికారిక వెబ్‌సైట్ www.bieap.gov.in లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో 'Revaluation (Rechecking) Application Form Link' పై క్లిక్ చేయాలి
  • మీరు రీచెకింగ్ ఫార్మ్‌ను దరఖాస్తు చేయాలనుకుంటున్న మీ సంబంధిత లింక్‌ని ఇక్కడ ఎంచుకోండి
  • తర్వాత  ఓపెన్ అయ్యే ఫార్మ్‌లో అవసరమైన వివరాలు ఇవ్వాలి.
  • అక్కడున్న ఫీల్డ్‌లో మీ హాల్ టికెట్ నెంబర్, ఈ మెయిల్ IDని నమోదు చేయాలి
  • తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీ ఇంటర్మీడియట్ రీ వాల్యుయేషన్ ఫీజు   (Fee for AP Inter Results 2023 Re-verification )

ఏపీ ఇంటర్ ఫలితాలు 2023ను రీకౌంటింగ్, రీ వాల్యుయేషన్ చేయించుకోవడానికి విద్యార్థులు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫీజు చెల్లించిన తర్వాత ఆ ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది.
  • రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.260లు చెల్లించాలి.
  • ఇప్పటికే దిద్దిన జవాబు స్క్రిప్ట్ స్కాన్ చేసిన కాపీతో సహా రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.1300 చెల్లించాలి.
  • అభ్యర్థులందరూ https://bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-inter-12th-result-rechecking-2023-check-the-schedule-and-process-here-39667/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!