AP Intermediate Results: నేడే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల, ఏ టైమ్‌కి రిలీజ్ అవుతాయంటే?

Andaluri Veni

Updated On: April 26, 2023 06:00 am IST

ఏపీ విద్యార్థుల అలర్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2023 నేడు రిలీజ్ (AP Intermediate Results) అవ్వనున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు  విజయవాడలోని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 
AP Intermediate Results: నేడే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల, ఏ టైమ్‌కి రిలీజ్ అవుతాయంటే?AP Intermediate Results: నేడే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల, ఏ టైమ్‌కి రిలీజ్ అవుతాయంటే?

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 (AP Intermediate Results): ఏపీ  ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2023 (AP Intermediate Results) నేడు విడుదల కానున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను 2023 ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) ఈరోజు (ఏప్రిల్ 26, 2023) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుంది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను bie.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్మీడియట్ 2023 ఫలితాలను (AP Intermediate Results)  ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలో నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి  డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేసి తమ ఫలితాలను, మార్కులను తెలుసుకోవచ్చు.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల వివరాలు (AP Inter 1st & 2nd Year Examination 2023 Details)

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 4.84 లక్షల మంది, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు 5.19 లక్షల మంది పరీక్షలు రాశారు.  ఈ పరీక్షలు రాష్ట్రంలో మొత్తం 1,489 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి.

పరీక్ష అథారిటీ పేరు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP)
అకడమిక్ సంవత్సరం 2022-2023
పరీక్ష పేరు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15, 2023 నుంచి ఏప్రిల్  03, 2023
ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 04, 2023
ఏపీ ఇంటర్ ఫలితాలు 2023 విడుదల తేదీ ఏప్రిల్ 26, 2023, సాయంత్రం 5:00 గంటలకు
అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in, results.bie.ap.gov.in

ఏపీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2023 ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? How to download AP Inter 1st Year and 2nd Year Results 2023?

ఈ దిగువున తెలిపిన విధంగా అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. దానికి ఫాలో అవ్వాల్సిన విధానాన్ని స్పష్టంగా ఇవ్వడం జరిగింది.
  • విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ bie.ap.gov.in ని సందర్శించాలి.
  • హోంపేజీలో AP Class 12 Results 2023 అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాలి
  • తర్వాత విద్యార్థి ఏపీ ఇంటర్ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • అనంతరం ఆ మార్కుల లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
ఏపీ విద్యార్థులు భవిష్యత్తు అవసరాల రీత్యా  మార్కుల లిస్ట్‌ ప్రింట్‌ను దగ్గరే పెట్టుకోవాలి.

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-inter-result-2023-date-and-time-39629/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top