AP PGECET 2023 Seat Allotment Round 1: AP PGECET 2023 సీట్ల కేటాయింపు రౌండ్ 1 వాయిదా, కొత్త షెడ్యూల్ ఇదే

Andaluri Veni

Updated On: August 29, 2023 11:43 am IST

రెండవసారి, AP PGECET 2023 సీట్ల కేటాయింపు రౌండ్ 1 (AP PGECET 2023 Seat Allotment Round 1)   వాయిదా పడింది. సీటు కేటాయింపు మరియు ఇతర వెబ్ కౌన్సెలింగ్ తేదీలు కింద అందించబడ్డాయి. 
AP PGECET 2023 Seat Allotment Round 1 PostponedAP PGECET 2023 Seat Allotment Round 1 Postponed

AP PGECET 2023 సీట్ల కేటాయింపు రౌండ్ 1 వాయిదా (AP PGECET 2023 Seat Allotment Round 1): AP PGECET 2023 కోసం మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు వాయిదా పడింది.  AP PGECET 2023 సీట్ల కేటాయింపు తేదీలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి మరోసారి సవరణలు చేసింది. అధికారులు మొదట రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్‌ను ఆగస్టు 29, 2023న విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత అది ఆగస్టు 31కి రీషెడ్యూల్ చేయబడింది. ఇప్పుడు మళ్లీ సెప్టెంబరర్ 15, 2023‌కి వాయిదా వేయడం జరిగింది. వెబ్ ఆప్షన్ నమోదు కోసం గడువు తేదీని వాస్తవానికి ఆగస్టు 25న సెట్ చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 11, 2023 వరకు పొడిగించబడింది.

వెబ్ కౌన్సెలింగ్ కోసం ఇంకా రిజిస్టర్ చేసుకోని అభ్యర్థులు 31 ఆగస్ట్ 2023 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సమయం ఉంది. రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా pgecet-sche.aptonline.in లాగిన్ అవ్వాలి . వారి వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, క్యాప్చాతో. GATE మరియు GPAT 2023 అడ్మిషన్‌లకు సంబంధించిన AP PGECET 2023కి సంబంధించిన అన్ని ఈవెంట్‌ల కోసం నవీకరించబడిన షెడ్యూల్ ఇక్కడ అందుబాటులో ఉంది.

AP PGECET 2023 సీట్ల కేటాయింపు రౌండ్ 1 రివైజ్డ్ షెడ్యూల్ (AP PGECET 2023 Seat Allotment Round 1 Revised Schedule)

AP PGECET 2023 సీట్ల కేటాయింపు రౌండ్ 1, ఇతర సంబంధిత ఈవెంట్‌ల షెడ్యూల్ ఈ కింద టేబుల్లో ప్రదర్శించబడుతుంది.

ఈవెంట్స్

AP PGECET 2023 రివైజ్డ్ షెడ్యూల్

వెబ్ కౌన్సెలింగ్ నమోదు చివరి తేదీ

ఆగస్టు 31, 2023

ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6, 2023 వరకు

వెబ్ ఆప్షన్ల నమోదు

సెప్టెంబర్ 8 నుండి 11, 2023 వరకు

వెబ్ ఆప్షన్ల మార్పు

సెప్టెంబర్ 12, 2023

సీట్ల కేటాయింపు

సెప్టెంబర్ 15, 2023

రిపోర్టింగ్‌కి చివరి తేదీ

సెప్టెంబర్ 23, 2023

ఆగస్టు 31, 2023న వెబ్ కౌన్సెలింగ్ నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత, ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6, 2023 వరకు జరుగుతుంది. ఆ తర్వాత అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్‌లను సెప్టెంబర్ 8,  11, 2023 మధ్య ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 12, 2023న, అభ్యర్థులు తమ మునుపు నమోదు చేసిన ఆప్షన్‌లలో ఏవైనా లోపాలు తలెత్తితే మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. అందించిన సమాచారం ఆధారంగా AP PGECET 2023 సీట్ల కేటాయింపు రౌండ్ 1 ఫలితాలు సెప్టెంబర్ 15, 2023న వెలువడతాయి.

ఇది కూడా చదవండి |

మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖోని చూస్తూ ఉండండి Education News ఎంట్రన్స్కి సంబంధించినది పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్ . మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-pgecet-2023-seat-allotment-round-1-postponed-44403/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!