AP Sankranti holidays 2024 for Schools: విద్యార్థులకు పండుగే.. పండుగ.. సంక్రాంతి సెలవులు ప్రారంభం

Andaluri Veni

Updated On: January 09, 2024 06:51 pm IST

ఏపీలో స్కూళ్ల పిల్లలకు 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సెలవులను (AP Sankranti holidays 2024 for Schools) ప్రకటించడం జరిగింది. రేపటి నుంచే అక్కడ విద్యార్థులకు సెలవులు మొదలవుతాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
 
AP Sankranti holidays 2024 for Schools: విద్యార్థులకు పండుగే.. పండుగ.. సంక్రాంతి సెలవులు ప్రారంభంAP Sankranti holidays 2024 for Schools: విద్యార్థులకు పండుగే.. పండుగ.. సంక్రాంతి సెలవులు ప్రారంభం

పాఠశాలలకు ఏపీ సంక్రాంతి సెలవులు 2024 (AP Sankranti Holidays 2024 for Schools): ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఇప్పటికే పల్లెల్లో, పట్టణాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రభుత్వం కూడా విద్యార్థులకు భారీగా సెలవులను (AP Sankranti Holidays 2024 for schools) ఇచ్చింది.  ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. ఈ మేరకు 13 రోజుల సెలవులు రానున్నాయి. పైగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లు ఈ సెలవులను ఇవ్వాలని, హాలీ డేస్ రోజుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని బోర్డు ప్రకటనలో వెల్లడించింది. ఒక వేళ ఎవరైనా తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంటే జనవరి 19వ తేదీ నుంచి తిరిగి స్కూళ్లు ప్రారంభం అవుతాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే?

అదేవిధంగా రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు కూడా సెలవులను (AP Pongal Holidays 2024) ప్రకటించడం జరిగింది. ఆ మేరకు  ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంటే వారం రోజులు సెలవులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు 10 రోజులు ఉంటాయి. సంక్రాంతి సందర్భంగా ఇక  ఏపీ, తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా వరస సెలవులు రానున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వరుస సెలవులను ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీ స్కూల్ సంక్రాంతి సెలవుల వివరాలు 2024 (AP School Sankranthi Holidays 2024)

ఏపీ పాఠశాలల సంక్రాంతి సెలవుల వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

టైటిల్ ఏపీ స్కూల్ సంక్రాంతి సెలవులు 2024
కేటగిరి సెలవులు
వెబ్‌సైట్ https://cse.ap.gov.in/
పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 09-01-2024 to 18-01-2024
స్కూల్ రీ ఓపెనింగ్ డే జనవరి 19, 2024
జూనియర్ కాలేజీలకు సెలవులు 11-01-2024 to 17-01-2024 (7 days)
కాలేజీలు రీఓపెనింగ్ డే జనవరి 18 ,2024

మరోవైపు తెలంగాణలో కూడా ఇప్పటికే సంక్రాంతి సెలవులను (TS Pongal Holidays 2024) ప్రకటించడం జరిగింది. ఈ నెల 12 వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ప్రకటించారు. దీంతో  ఉద్యోగం, చదువు రీత్యా తెలంగాణలో ఉంటున్నవాళ్లు సొంతూర్లకు వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అదే విధంగా కాలేజీలకు కూడా ఐదు రోజుల పాటు సెలవులను ప్రకటించడం జరిగింది. కాగా  జనవరి 13న 2వ శనివారం కాగా జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. జనవరి 17న ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-pongal-holidays-in-school-2024-48633/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!