AP 10th Class Telugu Important Questions: ఏపీ పదో తరగతి తెలుగు సబ్జెక్ట్‌లోని ముఖ్యమైన ప్రశ్నలు కోసం ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: October 13, 2023 05:52 pm IST

పదో తరగతి విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ని మరింత బలపరచడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అందించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుకు సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు (AP 10th Class Telugu Important Questions) ఇక్కడ అందించాం.
 
AP 10th Class Telugu Important Questions: ఏపీ పదో తరగతి తెలుగు సబ్జెక్ట్‌లోని ముఖ్యమైన ప్రశ్నలు కోసం ఇక్కడ చూడండిAP 10th Class Telugu Important Questions: ఏపీ పదో తరగతి తెలుగు సబ్జెక్ట్‌లోని ముఖ్యమైన ప్రశ్నలు కోసం ఇక్కడ చూడండి

ఏపీ పదో తరగతి తెలుగు ప్రాక్టీస్ ప్రశ్నలు (AP 10th Class Telugu Important Questions): ఏపీ పదో తరగతి తెలుగు సబ్జెక్ట్‌లోని ముఖ్యమైన ప్రశ్నలను ఇక్కడ అందజేశాం. సిలబస్‌లోని అన్ని ఛాప్టర్‌ల్లో ఉన్న ప్రశ్నలు (AP 10th Class Telugu Important Questions) ఇక్కడ ఇచ్చాం. విద్యార్థుల సౌలబ్యం కోసం, అవగాహన కల్పించడానికి ఈ ప్రశ్నలను అభ్యర్థులు పరిశీలించవచ్చు. మునుపటి సంవత్సరాల పరీక్షల్లో అడిగిన అతి ముఖ్యమైన, కీలకమైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. సిలబస్‌లో ఈ ముఖ్యమైన ప్రశ్నలపై విద్యార్థులు దృష్టి పెడితే రాబోయే పరీక్షలో మంచి మార్కులను పొందే ఛాన్స్ ఉంటుంది.

ఏపీ పదో తరగతి సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు  (AP SSC Telugu Practice Questions Complete Details)


ఏపీ పదో తరగతి సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
సంస్థ  పేరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSE AP)
తరగతి పదో తరగతి
అకడమిక్ ఇయర్ 2023-24
కేటగిరి ప్రశ్నపత్రాలు
సబ్జెక్ట్ తెలుగు
అధికారిక వెబ్‌‌సైట్ bse.ap.gov.in


AP SSC Telugu ప్రశ్నపత్రం నమూనా (AP SSC Telugu Question Paper Pattern)

ఏపీ పదో తరగతి తెలుగు సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్న పత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. క్వశ్చన్ పేపర్‌లో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి.  మొత్తం మూడు సెక్షన్లుగా ఉంటాయి.  మొదటి విభాగంలో అవగాహన ప్రతిస్పందన, రెండో విభాగంలో వ్యక్తీకరణ సృజనాత్మకత, మూడో విభాగంలో గ్రామర్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది.

ఏపీ పదో తరగతి తెలుగు ముఖ్యమైన ప్రశ్నలు (Ap 10th class telugu Important Questions)

అభ్యర్థుల కోసం సిలబస్‌లోని ఛాప్టర్ల వైజుగా ఇక్కడ ప్రశ్నలను అందజేయడం జరిగింది. విద్యార్థులు చూడవచ్చు. గత సంవత్సరాల ప్రశ్న పత్రాల్లో కూడా ఈ ప్రశ్నలను అడగడం జరిగింది.
  • మహిళలకు సంబంధించిన ‘మాతృభావన’ పాఠ్యభాగ కవి పరిచయం రాయండి.
  • మాతృభావన రచయిత గురించి రాయండి?
  • స్త్రీలు పూజ్యనీయులు అన్న శివాజీ మాటల వెనుక ఆంతర్యమును సొంత మాటల్లో వివరించండి.
  • మాతృభావన రచయిత ఎవరు? ఆయన రచనల గురించి రాయండి.
  • శివాజి వ్యక్తిత్వం గురించి తెలియజేయండి
  • శివాజీ మహిళల పట్ల చూపిన గౌరవభావం నీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఉంటే వారి గురించి తెలియజేయండి?
  • శివాజీ, సోన్ దేవుడు పాత్రల స్వభావాల గురించి తెలియజేయండి?
  • అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడంలో ఎవరెవరి పాత్ర ఉంది?
  • అనేక రాజవంశాలు అమరావతిని ఎందుకు అభివృద్ధి పరిచారు?
  • శరీరధర్మశాస్త్రాన్ననుసరించి శిల్పాలు రూపొందించడంలోని ప్రత్యేకత ఏమిటి?
  • శాతవాహనుల కులగురువు స్వభావాన్ని విశ్లేషించండి.
  • అమరావతి నగర సాంస్కృతిక వైభవాన్ని శిల్పకళా సంపదను గురించి సొంత మాటల్లో వివరించండి.
  • ఏయే రాజ వంశాలు అమరావతిని అభివృద్ధి చేశాయో తెలపండి?
  • అమరావతి భిన్న సంస్కృతుల నెలవు కావడానికి కారణాలు ఏమిటీ?
  • నాటి –నేటి అమరావతిని విశ్లేషించండి.
  • జానపదుని జాబు రచయిత గురించి వివరంగా రాయండి?
  • జానపదుని జాబు పాఠ్యభాగ నేపథ్యం గురించి తెలియజేయండి?
  • కాలం విలువ గురించి రాయండి
  • రాత్రి అనే ఆలోచన రానీక చీకటి అనే పేరు విననీక ‘వెన్నెల’ ను వర్ణించిన కవిని గురించి తెలపండి
  • చంద్రోదయాన్ని అత్యంత మనోహరంగా వర్ణించిన “వెన్నెల” పాఠ్యభాగ ‘కవి పరిచయం’ రాయండి
  • ఎఱ్ఱన రచనల గురించి తెలియజేయండి.
  • బాలచంద్రుడెలా ఉన్నాడు?
  • ధన్యుడు పాఠం నేపధ్యాన్ని వివరించండి.
  • ధన్యుడు పాఠంలో నిజమైన ధన్యుడు ఎవరు? ఎట్లు చెప్పగలవు?
  • ధన్యుడు పాఠం ఎవరు వ్రాశారు? ఆయన గురించి వ్రాయండి.
  • పరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి వేటిని పేర్కొన్నారు?
  • ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి వేటిని పేర్కొన్నాడో తెలపండి.
  • ‘శతకం’ అనే ప్రక్రియను గురించి వివరించండి.
  • పీఠిక అంటే ఏమిటి? వివరించండి.
  • ‘మహిళావరణం’ అనే పుస్తకానికి రచయిత్రులు రాసిన ‘పీఠిక’ ప్రక్రియ వివరించండి.
  • ఓల్గా గారి గురించి రాయండి.
  • వసంత కన్నబిరాన్ గురించి రాయండి
  • సముద్రలంఘనం పాఠం నేపథ్యం రాయండి.
  • అయ్యలరాజు రామభద్రుని గురించి రాయండి.
  • హనుమంతుని స్వభావాన్ని వివరించండి.
  • మానవ చరిత్రలోని గొప్ప మలపులేవి?
  • గోరంత దీపాలు పాఠం ఎవరు రచించారు? రచయిత గురించి రాయండి.
  • పులికంటి వారు అందుకున్న పురస్కారాలు, చేసిన సత్కారాలు వివరించండి.
  • ‘గోరంత దీపాలు’ కథానిక ద్వారా మీరేమి గ్రహించారు?
  • “ఇవ్వాటిమీద నాగ్రహముదగునె?” అనే మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు?
  • భిక్ష పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
  • భిక్ష పాఠం ఎవరు రచించారు? ఆయన గురించి క్లుప్తంగా రాయండి?
  • శ్రీనాథుని రచనా శైలిని, సాహిత్య సేవను గురించి వివరంగా రాయండి.
  • చిత్రగ్రీవంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఏమి ఉన్నాయి?
  • మానవులకు, పావురాలకూ స్నేహం ఉందని ఎలా తెలియజేయగలవు
  • చిత్రగ్రీవం పాఠ్య రచయితను గురించి రాయండి.
  • ధనగోపాల్ ముఖర్జీ సాహిత్య సేవను గురించి వివరించండి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, సమాచారం కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, కొత్త అప్‌డేట్‌లను తెలుసుకోండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-ssc-telugu-practice-questions-46247/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!