APOSS Supplementary Results 2023: APOSS ఇంటర్మీడియట్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023 విడుదల, చెక్ చేసుకోవడానికి లింక్ ఇదే

Andaluri Veni

Updated On: July 26, 2023 01:21 pm IST

APOSS ఇంటర్మీడియట్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023 (APOSS Supplementary Results 2023) విడుదలయ్యాయి.  ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
APOSS Supplementary Results 2023: APOSS ఇంటర్మీడియట్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023 విడుదల, చెక్ చేసుకోవడానికి లింక్ ఇదేAPOSS Supplementary Results 2023: APOSS ఇంటర్మీడియట్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023 విడుదల, చెక్ చేసుకోవడానికి లింక్ ఇదే

APOSS సప్లిమెంటరీ ఫలితాలు 2023 (APOSS Supplementary Results 2023): ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) SSC లేదా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను (APOSS Supplementary Results 2023) ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి apopenschool.ap.gov.inని సందర్శించవచ్చు.  అభ్యర్థులు ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.  APOSS పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023ని చెక్ చేయడానికి దరఖాస్తుదారులు తమ అడ్మిషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్‌ను నమోదు చేయడం ద్వారా వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. తద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

APOSS SSC సప్లిమెంటరీ ఫలితాల 2023 లింక్
APOSS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 లింక్

APOSS సప్లిమెంటరీ ఫలితం 2023 వివరాలు (APOSS Supplementary Result 2023 Details)

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) SSC లేదా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఇక్కడ అందజేయడం జరిగింది.
స్కూల్ పేరు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS)
కేటగిరి ఫలితాలు
ఎగ్జామినేషన్ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్
సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్ జూన్ 26 నుంచి జూలై 4, 2023
APOSS సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
లొకేషన్ అమరావతి
అధికారిక వెబ్‌సైట్ apopenschool.ap.gov.in

APOSS SSC, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to check APOSS SSC, Inter Supplementary Results 2023)

APOSS SSC, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేసుకునే విధానం గురించి ఈ దిగువున అందించడం జరిగింది.
  • ముందుగా అభ్యర్థులు apopenschool.ap.gov.in ని సందర్శించండి.
  • SSC లేదా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జూన్ / జూలై -2023 ఫలితాలను చెక్ చేయడానికి వెబ్‌సైట్ దిగువకు వెళ్లి, లింక్‌‌ని క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ అడ్మిషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి.
  • క్రాస్ చెక్ చేసి, మీ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • డౌన్‌లోడ్ చేసిన పేజీ హార్డ్‌కాపీని భవిష్యత్తు సూచనల కోసం సేవ్ చేసి ఉంచండి.

AP ఓపెన్ ఇంటర్, SSC సప్లిమెంటరీ ఫలితాలు 2023లో పేర్కొనబడిన వివరాలు (Details Mentioned on AP Open Inter Supplementary Results 2023)

ఏపీ  ఓపెన్ ఇంటర్మీడియట్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల కార్డుపై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
  • విద్యార్థి పేరు
  • పరీక్షలో పొందిన మార్కులు
  • ఫలితాల స్టేటస్
  • తల్లిదండ్రుల పేరు
  • స్కూల్ పేరు
  • సబ్జెక్ట్ కోడ్
  • సబ్జెక్టుల వారీగా పొందిన మొత్తం మార్కులు
  • ఎగ్జామ్ పేరు
  • రోల్ నెంబర్
  • రిమార్క్స్
APOSS 2023 పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను మేలో ప్రకటించడం జరిగింది. అందులో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడం జరిగింది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/aposs-supplementary-results-2023-link-here-43458/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!