APPSC Group 1 Notification 2023 Expected Date:అభ్యర్థులకు గుడ్‌న్యూస్, APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్

Andaluri Veni

Updated On: November 08, 2023 12:30 pm IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెలాఖారులోపు APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకానుంది. నోటిఫికేషన్ ఏ డేట్‌లో రిలీజ్ (APPSC Group 1 Notification 2023 Expected Date) అవుతుందో ఇక్కడ తెలుసుకోండి.
APPSC Group 1 Notification 2023 Expected Date:అభ్యర్థులకు గుడ్‌న్యూస్, APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్APPSC Group 1 Notification 2023 Expected Date:అభ్యర్థులకు గుడ్‌న్యూస్, APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 అంచనా తేదీ (APPSC Group 1 Notification 2023 Expected Date): ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా అభ్యర్థులకు శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్  చైర్మ‌న్ గౌత‌మ్ సవాంగ్  APPSC గ్రూప్ 1, 2 పోస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.  APPSC గ్రూప్ 1లో 100 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. ఇదే సమయంలో APPSC Group 1 ఉద్యోగాల నోటిఫికేషన్‌లను నవంబర్ నెలాఖరులోపు (APPSC Group 1 Notification 2023 Expected Date) ఎప్పుడైనా విడుదల చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ఫిబ్రవరి 2024లో APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామని, ఈ పోస్టుల భర్తీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 పూర్తి వివరాలు (APPSC Group 1 Notification 2023 Full Details)

APPSC గ్రూప్ 1కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువన టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

ఎగ్జామ్ పేరు APPSC గ్రూప్ 1
నిర్వహించే సంస్థ APPSC
APPSC గ్రూప్ 1  అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in
APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023-24 నవంబర్ 2023
APPSC గ్రూప్ 1 ఖాళీలు 100
APPSC గ్రూప్ 1 ఆప్షన్ల ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ
APPSC గ్రూప్ 1 దరఖాస్తు ప్రక్రియ మోడ్ ఆన్‌లైన్
APPSC గ్రూప్ 1 జీతం రూ. 37,000 నుంచి రూ.91,000
APPSC గ్రూప్ 1 వయో పరిమితి 18 నుంచి 42 ఏళ్లు

APPSC Group 1 నోటిఫికేషన్ అర్హత ప్రమాణాలు (APPSC Group 1 Notification Eligibility Criteria)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అర్హత ప్రమాణాలను ఈ దిగువున అందజేశాం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పరిశీలించవచ్చు.
  • APPSC Group 1 నోటిఫికేషన్‌కు సంబంధించిన చాలా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.  కొన్ని పోస్టులకు 18 నుంచి 28, 18 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థుల వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది.
  • APPSC Group 1 చాలా పోస్టులకు, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొంది ఉండాలి. అయితే పూర్తి వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.

APPSC గ్రూప్ 1 ఫీజు (APPSC Group 1 Fee)

APPSC గ్రూప్ 1 దరఖాస్తు ఫీజు అన్ని కేటగిరీల వారికి రూ. 250గా  నిర్దేశించడం జరిగింది. పరీక్ష  రుసుముగా రూ.120లు పే చేయాల్సి ఉంటుంది. SC/ST/ BC/PWD/Ex-serv, నిరుద్యోగ యువత వర్గానికి చెందిన వారు ఎటువంటి పరీక్ష ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ వివిధ పోస్టులకు సంబంధించిన వివరాలు (APPSC Group 1 Notification Posts Details)

APPSC గ్రూప్ 1కు సంబంధించిన  ఏ ఏ పోస్టులను భర్తీ చేస్తారో ఆ వివరాలను దిగువున తెలియజేశాం. ఆ పోస్టుల సమాచారాన్ని ఈ దిగువున అందజేయడం జరిగింది.
  • డిప్యూటీ కలెక్టర్
  • అసిస్టెంట్ కమిషనర్
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్)
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మగవాళ్లు)
  • ప్రాంతీయ రవాణా ఆఫీసర్
  • జిల్లా అగ్నిమాపక అధికారి
  • అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్
  • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్
  • మండల పరిషత్ అభివృద్ధి అధికారి
  • జిల్లా రిజిస్ట్రార్
  • డిప్యూటీ రిజిస్ట్రార్
  • జిల్లా ఉపాధి అధికారి
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి
  • జిల్లా గిరిజన సంక్షేమ అధికారి
  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
  • జిల్లా పంచాయతీ అధికారి
  • జిల్లా బీసీ సంక్షేమ అధికారి
  • మున్సిపల్ కమిషనర్
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-1-notification-2023-release-date-47053/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!