APPSC Group 2 Recruitment 2023: APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల, మొత్తం 897 పోస్టులు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?

Andaluri Veni

Updated On: December 08, 2023 01:03 pm IST

APPSC గ్రూప్ 2 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్  (APPSC Group 2 Recruitment 2023) నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  ఎన్ని పోస్టులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలు గురించి ఇక్కడ అందజేశాం. 
 
APPSC Group 2 Recruitment 2023: APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల,  మొత్తం 897 పోస్టులు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?APPSC Group 2 Recruitment 2023: APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల, మొత్తం 897 పోస్టులు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 (APPSC Group 2 Recruitment 2023):  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 (APPSC Group 2 Recruitment 2023) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  మొత్తం 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 21న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జనవరి 1, 2024లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.  అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఖాళీల వివరాలు  ఇతర సమాచారం కోసం ఈ దిగువున చూడండి.

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF


APPSC Group 2 రిక్రూట్‌మెంట్ ఖాళీల వివరాలు (APPSC Group 2 Recruitment 2023 Vacancy Details)


APPSC Gropu 2 రిక్రూట్‌మెంట్ ఖాళీల వివరాలు ఈ దిగువున అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
  • ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331
  • నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు  566

APPSC Group 2 నోటిఫికేషన్ 2023 ముఖ్యమైన తేదీలు (APPSC Group 2 Notification 2023: Important Dates)

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC గ్రూప్ 2 2023 ప్రిలిమ్స్ పరీక్షను 25 ఫిబ్రవరి 2024న నిర్వహించనుంది.   APPSC భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్ర రిక్రూట్‌మెంట్ బోర్డులలో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని అనేక పోస్టుల కోసం అభ్యర్థులను నియమించుకోవడానికి వివిధ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ దిగువన  APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలను చెక్ చేయండి.

APPSC గ్రూప్ 2, 2023 నోటిఫికేషన్ రిలీజ్ డేట్ డిసెంబర్ 07, 2023
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం డిసెంబర్ 21, 2023
APPSC 2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 01, 2024
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్   డేట్ ఫిబ్రవరి 25, 2024
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితం 2023 తెలియాల్సి ఉంది
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీ 2023 తెలియాల్సి ఉంది


APPSC గ్రూప్ 2 అప్లికేషన్ ఫీజు 2023  (APPSC Group 2 Application Fee 2023)

దరఖాస్తు ఫార్మ్‌ను నింపేటప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు తిరిగి చెల్లించబడదు. అభ్యర్థుల కేటగిరీని బట్టి ఇది మారుతుంది.

కేటగిరి ఎగ్జామినేషన్ ఫీజు ప్రొసెసింగ్ ఫీజు
జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.30 రూ.330
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.30 రూ.80

APPSC  గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ తెలుసుకోవడానికి https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-prelims-application-dates-2023-47956/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!